త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Vishwak Sen | యంగ్ పొలిటిక‌ల్ లీడ‌ర్‌గా విశ్వ‌క్‌సేన్ – రాజ‌కీయ వార‌సుల క‌ష్టాల‌పై సినిమా

టాలీవుడ్ హీరో విశ్వ‌క్‌సేన్ వార‌స‌త్వంతో రాజ‌కీయాల్లోకి అడుగుపెట్ట‌బోతున్నారు. యంగ్ పొలిటిక‌ల్ లీడ‌ర్‌గా అవ‌తారం ఎత్త‌బోతున్నారు. రాజ‌కీయ చద‌రంగంలో అత‌డికి ఎలాంటి ప‌రిణామాలు ఎదుర‌య్యాయ‌న్న‌ది లెగ‌సీ సినిమాలో చూడాల్సిందేన‌ని మేక‌ర్స్ అంటోన్నారు. సాయికిర‌ణ్ దాదా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న ఈ మూవీ ఫిబ్ర‌వ‌రిలో థియేట‌ర్ల‌లోకి రాబోతుంది.

N

Entertainment | Published On Nov 28, 2026, 5.35 pm IST

Vishwak Sen | యంగ్ పొలిటిక‌ల్ లీడ‌ర్‌గా విశ్వ‌క్‌సేన్ – రాజ‌కీయ వార‌సుల క‌ష్టాల‌పై సినిమా
Advertisement

Vishwak Sen | ఈ న‌గ‌రానికి ఏమైంది సినిమాకు సీక్వెల్‌గా తెర‌కెక్కిన ఈఎన్ఈ రిపీట్‌తో చాలా కాలం త‌ర్వాత హీరోగా పెద్ద విజ‌యాన్ని అందుకున్నారు విశ్వ‌క్‌సేన్‌ (Vishwak Sen) . ఈ స‌క్సెస్‌ను ఎంజాయ్ చేస్తోన్న టాలీవుడ్ (Tollywood)హీరో త‌న అప్‌క‌మింగ్ మూవీపై అప్‌డేట్ ఇచ్చాడు. కెరీర్‌లో తొలిసారి పొలిటిక‌ల్ క‌థ‌తో విశ్వ‌క్‌సేన్ చేస్తోన్న సినిమా లెగ‌సీ. పిండం ఫేమ్ సాయికిర‌ణ్ దైదా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్త‌య్యింది. ఈ విష‌యాన్ని అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించిన మేక‌ర్స్ రిలీజ్‌పై మాత్రం ట్విస్ట్ ఇచ్చారు. తొలుత ఈ సినిమాను డిసెంబ‌ర్‌లో ప్రేక్ష‌కుల ముందుకు తీసురావాల‌నుకున్నారు. తాజాగా మూడు నెల‌లు సినిమాను పోస్ట్‌పోన్ చేశారు. డిసెంబ‌ర్‌లో కాకుండా ఫిబ్ర‌వ‌రిలో లెగ‌సీ విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్‌...

పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్‌గా ద‌ర్శ‌కుడు సాయికిర‌ణ్ దైదా లెగ‌సీ సినిమాను తెర‌కెక్కిస్తోన్నారు. తన తండ్రి రాజకీయ వారసత్వం కారణంగా ఓ యువ‌కుడికి ఎదురైన అనుహ్య ప‌రిస్థితుల‌తో ఆద్యంతం థ్రిల్లింగ్‌గా ఉండ‌బోతున్న‌ట్లు స‌మాచారం. రాజ‌కీయాలు, వ్య‌క్తిగ‌త జీవితాల మ‌ధ్య నాయ‌కులు ఎదుర్కొనే సంఘ‌ర్ష‌ణను కొత్త కోణంలో ఆవిష్క‌రించ‌బోతున్న‌ట్లు తెలిసింది.

యంగ్ లీడ‌ర్‌గా...

ఇందులో యంగ్ పొలిటిక‌ల్ లీడ‌ర్‌గా విశ్వ‌క్‌సేన్ ఇంటెన్స్ పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు. కే కే మీనన్ విల‌న్‌గా న‌టిస్తోన్న ఈ సినిమాలో ఏక్తా రాథోడ్ హీరోయిన్‌గా క‌నిపించ‌బోతుంది. రావు రమేష్, సచిన్ ఖేడ్క‌ర్‌, మురళీ మోహన్, రాజా రవీంద్ర, రాజీవ్ కనకాల, అనీష్ కురువిల్లా, ఖుషీ రవి, కల్యాణి నటరాజన్ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. ఈ సినిమాకు 96 ఫేమ్ గోవింద్ వ‌సంత మ్యూజిక్ అందిస్తున్నారు. యశ్వంత్ దగ్గుమాటితో క‌లిసి డైరెక్ట‌ర్ సాయికిరణ్ రెడ్డి దైదా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పిండం త‌ర్వాత సాయికిర‌ణ్ దైదా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న సెకండ్ మూవీ ఇది.

 

Advertisement
Advertisement