త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

BRS Complaint to NHRC | అసెంబ్లీ వ‌ద్ద చాలా అవ‌మానం జ‌రిగింది.. ఎన్‌హెచ్ఆర్సీకి బీఆర్ఎస్ మ‌హిళా ఎమ్మెల్యేల ఫిర్యాదు

BRS Complaint to NHRC | ఇటీవ‌ల తెలంగాణ అసెంబ్లీ వ‌ద్ద జ‌రిగిన ఘ‌ట‌న‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు జాతీయ మాన‌వ హ‌క్కుల క‌మిష‌న్‌ను ఆశ్ర‌యించారు. శుక్ర‌వారం ఢిల్లీలో ఎన్‌హెచ్ఆర్సీ సభ్యురాలు విజయ భారతిని క‌లిసి ఫిర్యాదు చేశారు.

S

Telangana | Published On Sep 11, 2026, 1.36 pm IST

BRS Complaint to NHRC | అసెంబ్లీ వ‌ద్ద చాలా అవ‌మానం జ‌రిగింది.. ఎన్‌హెచ్ఆర్సీకి బీఆర్ఎస్ మ‌హిళా ఎమ్మెల్యేల ఫిర్యాదు
Advertisement

BRS Complaint to NHRC | త్రినేత్ర‌.న్యూస్‌: ఇటీవ‌ల తెలంగాణ అసెంబ్లీ వ‌ద్ద జ‌రిగిన ఘ‌ట‌న‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు జాతీయ మాన‌వ హ‌క్కుల క‌మిష‌న్‌ను ఆశ్ర‌యించారు. శుక్ర‌వారం ఢిల్లీలో ఎన్‌హెచ్ఆర్సీ సభ్యురాలు విజయ భారతిని క‌లిసి ఫిర్యాదు చేశారు. అసెంబ్లీ ప్రాంగణంలో తమపై జరిగిన దాడి తీరును ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డి ఈ సంద‌ర్భంగా వివ‌రించారు. మహిళా ఎమ్మెల్యేలను పోలీసుల చేత అవమానించడం, అసెంబ్లీలోకి వెళ్ళనివ్వకుండా అడ్డుకోవడం, శాసనసభ్యులుగా తమ హక్కులకు విఘాతం కలిగించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు వ్యవహరించారని ఫిర్యాదు చేశారు.

ఈ సంద‌ర్భంగా స‌బితా ఇంద్రారెడ్డి మాట్లాడారు. మహిళా ఎమ్మెల్యేలపట్ల కీచకంగా వ్యవహరించారని ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీ వద్ద తమకు జరిగిన అవమానం చాలా బాధ అనిపించింది. కుట్రలో భాగంగానే ఇదంతా జరిగిందని అర్థమవుతోంది. అసెంబ్లీకి వెళ్తుంటే యుద్ధ వాతావరణం సృష్టించారు. దాడి ఘటనపై అసెంబ్లీలో ఒక్క నిమిషం మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. స్పీకర్‌, సీఎం, శాసనసభ వ్యవహారాల మంత్రి స్పందిస్తారని భావించాం. వాళ్లు స్పందించ‌లేదు. అందుకే ఈరోజు ఫిర్యాదు చేశాం అని స‌బితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు.

Advertisement
Advertisement