Devi Prasad | ఉద్యమ పోరాటం, ఆరాటాన్ని ప్రజలకు చెప్పాల్సి ఉంది.. పార్టీలకతీతంగా దీక్షా దివస్‌కు రండి
Devi Prasad | కేసీఆర్‌ను అరెస్ట్ చేసిన అలుగునూరు వద్ద రేపు కేటీఆర్ (KTR) ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నామని.. పార్టీలకతీతంగా ఈ దీక్షా దివస్ (Deeksha Divas) కు తరలి రావాలని బీఆర్ఎస్ నేత, కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవీప్రసాద్ (Devi Prasad) కోరారు.
- కేసీఆర్ తీసుకున్న ఆ నిర్ణయంతోనే తెలంగాణ వచ్చింది
- అప్పుడు ఆయనతో ఉన్నందుకు గర్వంగా ఉంది
- రాష్ట్రాన్ని గాడిన పెట్టాలంటే కేసీఆర్ మళ్లీ గెలవాల్సిందే
- బీఆర్ఎస్ నేత, కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవీప్రసాద్
Devi Prasad | త్రినేత్ర న్యూస్: కేసీఆర్‌ను అరెస్ట్ చేసిన అలుగునూరు వద్ద రేపు కేటీఆర్ (KTR) ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నామని.. పార్టీలకతీతంగా ఈ దీక్షా దివస్(Deeksha Divas) కు తరలి రావాలని బీఆర్ఎస్ నేత, కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవీప్రసాద్ (Devi Prasad) కోరారు. తెలంగాణ ఉద్యమ చరిత్ర, పోరాటం, ఆరాటం, అన్నింటినీ ప్రజలకు వివరించి చెప్పాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ ఫ్రీ జోన్ (Hyderabad Free Zone) సవరణ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ (KCR) తీసుకున్న దీక్ష నిర్ణయమే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి దారి తీసిందని గుర్తుచేశారు. శనివారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ పార్టీ తెలంగాణ అస్తిత్వాన్ని కించపరిచేలా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.
నాడు ఒక్క గులాబీ పార్టీ తప్ప.. ఏ పార్టీ కూడా హైదరాబాద్ ఫ్రీ జోన్ అంశంపై స్పందించలేదు. కేసీఆర్ మార్గనిర్దేశంతోనే తెలంగాణ సమాజం ఏకమైంది. తాను సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో.. అని కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నారు. కేసీఆర్ ను దూషిస్తున్న కాంగ్రెస్ నేతలు నాడు ఎవరి వైపు ఉన్నారో ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. సుష్మాస్వరాజ్ (Sushma Swaraj) లాంటి నేతలు తెలంగాణ ఏర్పాటుకు సహకరించినప్పటికీ.. మోదీ (Modi) సహా బీజేపీ నేతలు తెలంగాణ ఏర్పాటును ఎలా తప్పుపడుతూ మాట్లాడుతున్నారు? తెలంగాణ ప్రజలు ఈ అంశాలన్నింటినీ ఆలోచించుకోవాలి.
నాడు కేసీఆర్ తో పాటు ఉన్నందుకు గర్వంగా ఉంది. కేసీఆర్ ను ఇష్టం వచ్చినట్లు తూలనాడుతున్న నేతలు ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఉద్యమంలో పాల్గొనకుండా నాడు ద్రోహం చేసిన నాయకులకు కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావును విమర్శించే అర్హత లేదు. తెలంగాణను మళ్లీ గాడిన పెట్టేందుకు కేసీఆర్ అవసరం ఎంతైనా ఉంది. పార్టీలకు అతీతంగా తెలంగాణ సమాజం దీక్షా దివస్ స్ఫూర్తి సభల్లో పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నాం అని దేవీప్రసాద్ పేర్కొన్నారు.
కేసీఆర్ ఇజం తెలంగాణకు వరం: దూదిమెట్ల బాలరాజు యాదవ్, కార్పొరేషన్ మాజీ చైర్మన్
మావోయిజం, మార్క్సిజం తరహాలోనే కేసీఆర్ ఇజం తెలంగాణకు వరం. కేసీఆర్ స్ఫూర్తితో తెలంగాణ సమాజం ఏకమై పోరాటం చేసింది. కేసీఆర్ చరిత్రే తెలంగాణ చరిత్ర. దీక్షా దివస్ తెలంగాణ చరిత్ర ఉన్నన్ని రోజులూ స్ఫూర్తినిస్తూనే ఉంటుంది.
మళ్లీ సీఎం అవుతారు: పల్లె రవికుమార్ గౌడ్, కార్పొరేషన్ మాజీ చైర్మన్
కేసీఆర్ అందరినీ ఏకం చేసి నవంబర్ 29న ఆమరణ నిరహార దీక్ష ప్రారంభించారు. కేసీఆర్ దీక్షను కాంగ్రెస్ నేతలు నాడు హేళన చేసారు. నాడైనా, నేడైనా రేవంత్ రెడ్డి తెలంగాణ ద్రోహే. కేసీఆర్ మళ్ళీ సీఎం కావడం ఖాయం.
ఆయన పట్టుదల విమర్శకుల మనసులను కరిగించింది: కె .కిషోర్ గౌడ్, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు
విద్యార్థుల భవిష్యత్ కోసమే తాను దీక్ష ప్రారంభిస్తున్నట్టు కేసీఆర్ నాడు మాతో ఉద్వేగంగా అన్నారు. తన చావుతోనైనా తెలంగాణ రావాలని, దీక్ష మానేసే ప్రసక్తే లేదని కేసీఆర్ పట్టుదల ప్రదర్శించారు. కేసీఆర్ పట్టుదల విమర్శకుల మనసులను సైతం కరిగించింది. కేసీఆర్ దీక్ష లేకుంటే తెలంగాణ లేదు. తెలంగాణ మళ్ళీ కేసీఆర్ చేతిలో ఉంటేనే ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయి.
రేవంత్ నాశనం చేశారు: ఉపేంద్ర చారి, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు
కేసీఆర్ దీక్ష తో న్యాయవాదులు రోడ్లపైకి వచ్చారు. ఆ కోర్టు ఈ కోర్టు అని లేదు.. అన్ని కోర్టుల్లో కేసీఆర్ దీక్షకు సంఘీభావంగా నిరసనలు జరిగాయి. వచ్చిన తెలంగాణను కేసీఆర్ అన్నివిధాల అభివృద్ధి చేశారు. రేవంత్ తెలంగాణను అన్ని విధాలా నాశనం చేశారు. తెలంగాణ మరింత విధ్వంసం కాకముందే కేసీఆర్ సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారు.
దీక్షనే గొప్ప మలుపు: కార్పొరేషన్ మాజీ చైర్మన్ వాల్యానాయక్
పిడికెడు మందితో ప్రారంభించిన తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్ మహోద్యమంగా మలిచారు. కేసీఆర్ దీక్ష తెలంగాణ ఉద్యమంలో గొప్ప మలుపు. గిరిజనుల బాధలు పోవాలంటే తండాలు గ్రామ పంచాయతీలు కావాల్సిందేనని కేసీఆర్ ఉద్యమం సందర్భంగా పోరు బాట పట్టారు. రాష్ట్రం ఏర్పాటు తర్వాత 3 వేలకు పైగా తండాలను, గూడేలను గ్రామ పంచాయతీలుగా చేశారు. మా తండాలో మా రాజ్యం అనే కల సాకారం అయింది. రేవంత్ రెడ్డి ఎన్నడూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదు. కేసీఆర్ ను తిట్టడం తప్ప రేవంత్ కు పాలన చేత కావడం లేదు. వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే.
ఈ ప్రెస్ మీట్ లో కార్పొరేషన్ మాజీ చైర్మన్ రామచంద్రు నాయక్, ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ సభ్యుడు విద్యాసాగర్, బీఆర్ఎస్వీ ఉపాధ్యక్షుడు కడారి స్వామి యాదవ్, అచ్చంపేట మున్సిపల్ మాజీ చైర్మన్ నర్సింహ గౌడ్ పాల్గొన్నారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు
- ●BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల
- ●AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..
- ●HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం
- ●Special Trains | సంక్రాంతికి స్పెషల్ రైళ్లు.. ప్రయాణికులకు ఊరట.. ప్రయాణ తేదీలు, ఆగే స్టేషన్ల వివరాలు ఇవే..!
- ●Siddharth Galla | కొరియన్ అమ్మాయి మెడలో మూడుముళ్లు వేసిన మహేష్‌బాబు మేనల్లుడు

Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు

BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల

AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..

HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం






