త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ramchandar Rao | అమెరికా టూర్‌కు రేవంత్ రెడ్డికి పర్మిషన్ ఎందుకు ఇవ్వలేదంటే.. రాంచంద‌ర్‌రావు ఏమ‌న్నారంటే..

Ramchandar Rao | సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు అనుమతి నిరాకరణ అంశంపై కాంగ్రెస్ నిరాధార ప్రచారం చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు రాంచంద‌ర్‌రావు మండిప‌డ్డారు. ఇది పూర్తిగా దౌత్యపరమైన నిర్ణయ‌మేన‌ని.. ఇందులో ఎలాంటి రాజ‌కీయ కుట్ర‌లు లేవ‌ని తేల్చి చెప్పారు.

S

Telangana | Published On Aug 21, 2026, 4.44 pm IST

Ramchandar Rao | అమెరికా టూర్‌కు రేవంత్ రెడ్డికి పర్మిషన్ ఎందుకు ఇవ్వలేదంటే.. రాంచంద‌ర్‌రావు ఏమ‌న్నారంటే..
Advertisement

Ramchandar Rao | త్రినేత్ర‌.న్యూస్: సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు అనుమతి నిరాకరణ అంశంపై కాంగ్రెస్ నిరాధార ప్రచారం చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు రాంచంద‌ర్‌రావు మండిప‌డ్డారు. ఇది పూర్తిగా దౌత్యపరమైన నిర్ణయ‌మేన‌ని.. ఇందులో ఎలాంటి రాజ‌కీయ కుట్ర‌లు లేవ‌ని తేల్చి చెప్పారు. త‌రుణ్ గ‌గోయ్ కాంగ్రెస్ సీఎంగా ఉన్న‌ప్పుడు యూపీఏ ప్ర‌భుత్వ‌మే ఆయ‌న‌కు అనుమ‌తి ఇవ్వ‌లేద‌ని గుర్తు చేశారు. సీఎం ప‌ర్య‌ట‌న ర‌ద్దు విష‌య‌మై కాంగ్రెస్ చేస్తున్న ప్రచారంపై శుక్ర‌వారం ఆయ‌న స్పందించారు.

మోదీకి వీసా నిరాక‌రించారు..

మోదీ గారికి అమెరికా వీసా నిరాకరించబడినప్పుడు ఆనందించిన కాంగ్రెస్ నాయకులు, ఇప్పుడు రేవంత్ రెడ్డి విషయంలో మొసలి కన్నీరు కారుస్తున్నారు. విదేవీ వ్య‌వ‌హారా శాఖ రేవంత్‌కు క్లియ‌రెన్స్ ఇవ్వ‌లేదు. వారితో వెళ్తున్న బృందానికి అనుమ‌తి ఇచ్చారు. ఇదేదో రాజ‌కీయప‌ర‌మైన నిర్ణ‌య‌మ‌ని కాంగ్రెసోళ్లు మాట్లాడుతున్న‌రు. దీని వెన‌క ఎటువంటి రాజ‌కీయం లేదు. ఎవ‌రైనా ముఖ్య‌మంత్రిగానీ, రాష్ట్ర మంత్రి, కేంద్ర మంత్రి గానీ విదేశాల‌కు పోతే మ్యాండేట‌రీ క్లియ‌రెన్స్ అనేది ఉంట‌ది.

అధికారికంగా ఎంత అవ‌స‌రం.. వెళ్లేవారి స్థాయి, వాళ్ల పాత్ర, మీటింగ్‌ను ఎట్ల క‌న్ఫామ్ చేశారు, ప్రొటోకాల్, సెక్యూరిటీ అరేంజ్‌మెంట్స్ ఉన్న‌యా? లేవా? వీటితో పాటు వెళ్లే దేశానికి భార‌త్‌కు స‌త్సంబంధాలు ఉన్న‌యా లేదా అనేది కూడా చూస్తారు. వాళ్ల‌పై కేసులు ఉన్నాయా లేదా అని కూడా అడుగుతారు. బేసిగ్గా ఇవ‌న్నీ అడుగుతారు.

త‌రుణ్ గ‌గోయ్‌కి యూపీఏ ప్ర‌భుత్వ‌మే అనుమ‌తి ఇవ్వ‌లే..

త‌రుణ్ గ‌గోయ్ గారు కాంగ్రెస్ సీఎంగా ఉన్న‌ప్పుడు 2012లో అమెరికా, ఇజ్రాయెల్‌కు పోతున్న స‌మ‌యంలో అప్పుడు యూపీఏ ప్ర‌భుత్వ‌మే వారికి అనుమ‌తి ఇవ్వ‌లే. జార్ఖండ్‌ బీజేపీ సీఎం అర్జున్ ముండా థాయ్‌లాండ్ వెళ్ల‌డానికి ప‌ర్మిష‌న్ ఇయ్య‌లే. అంతెందుకు న‌రేంద్ర మోదీగారు అమెరికా పోవాల‌న్న‌ప్పుడు ఇదే కాంగ్రెస్ ఎంపీలు వీసా ఇవ్వొద్ద‌ని చెప్పారు. మోదీకి వీసా రాకుండా చేసిన విష‌యాన్ని కాంగ్రెస్ నాయ‌కులు ఒక‌సారి గుర్తు చేసుకోవాలి.

ఇది కొత్త విష‌యం కాదు. రేవంత్ ఇంత‌కుముందు కూడా విదేశాల‌కు వెళ్లారు. అప్పుడు ఆప‌లేదే. విదేశీ వ్య‌వ‌హారాల శాఖ పెట్టిన ష‌ర‌తుల్లో ఎక్క‌డో ఒక‌చోట లోపాలు ఉంటాయి. ప్రొసీజ‌ర్‌గా ఆపిన ప‌ద్ధ‌తే ఇది. దీంట్ల రాజ‌కీయ కోణం లేదు అని రాంచంద‌ర్‌రావు స్ప‌ష్టం చేశారు.

Advertisement
Advertisement