త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Nagarkurnool | వాన‌లు ప‌డ‌డం లేద‌ని.. మృత‌దేహాన్ని వెలికి తీశారు

Nagarkurnool | నాగ‌ర్‌క‌ర్నూల్ జిల్లాలో వింత ఘ‌ట‌న వెలుగు చూసింది. గ్రామంలో వాన‌లు ప‌డ‌డం లేద‌ని.. మూడు నెల‌ల క్రితం పూడ్చి పెట్టిన మృత‌దేహాన్ని వెలికి తీశారు. అనంత‌రం పెట్రోల్ పోసి ద‌హ‌నం చేశారు.

S

Telangana | Published On Aug 23, 2026, 10.22 pm IST

Nagarkurnool | వాన‌లు ప‌డ‌డం లేద‌ని.. మృత‌దేహాన్ని వెలికి తీశారు
Advertisement

Nagarkurnool | త్రినేత్ర‌.న్యూస్ : నాగ‌ర్‌క‌ర్నూల్ జిల్లాలో వింత ఘ‌ట‌న వెలుగు చూసింది. గ్రామంలో వాన‌లు ప‌డ‌డం లేద‌ని.. మూడు నెల‌ల క్రితం పూడ్చి పెట్టిన మృత‌దేహాన్ని వెలికి తీశారు. అనంత‌రం పెట్రోల్ పోసి ద‌హ‌నం చేశారు.

ప‌ద‌ర మండ‌లం కోడోనిప‌ల్లి గ్రామానికి చెందిన ఆంజ‌నేయులు.. మూడు నెల‌ల క్రితం హైద‌రాబాద్ న‌గ‌రంలో రోడ్డు ప్ర‌మాదంలో ప్రాణాలు కోల్పోయాడు. పోస్టుమార్టం అనంత‌రం డెడ్ బాడీని స్వ‌గ్రామానికి త‌ర‌లించి ఖ‌న‌నం చేశారు.

అయితే అప్ప‌ట్నుంచి కోడోనిప‌ల్లిలో వ‌ర్షాలు కురియ‌డం లేద‌ని స్థానికుల అభిప్రాయం. శ‌వాన్ని ద‌హ‌నం చేయ‌కుండా ఖ‌న‌నం చేసినందుకు వ‌ర్షాలు ప‌డ‌డం లేద‌ని గ్రామ‌స్తులు భావించారు. దీంతో గ్రామ పెద్ద‌ల నిర్ణ‌యం మేర‌కు జేసీబీ స‌హాయంతో శ‌వాన్ని బ‌య‌ట‌కు వెలికి తీశారు. అనంత‌రం మృత‌దేహాన్ని కట్టెల‌పై ఉంచి పెట్రోల్ పోసి ద‌హ‌నం చేశారు గ్రామ‌స్తులు. ఈ ఘటనపై పూర్తి వివరాలు సేకరించి.. ఇలాంటి మూఢనమ్మకాలకు అడ్డుకట్ట వేయాలని పోలీసులను, అధికారులను యువ‌కులు కోరారు.

Advertisement
Advertisement