IIT Roorkee | క్లౌడ్ స్టోరేజ్ కాంపోనెంట్‌లో సమస్య వాస్తవమే.. కానీ,.. డేటా లీక్ ఆరోపణలపై ఐఐటీ రూర్కీ క్లారిటీ
IIT Roorkee | JEE (అడ్వాన్స్‌డ్) పరీక్ష రాసిన లక్షలాది మంది విద్యార్థుల వ్యక్తిగత డేటా లీక్ అయ్యిందంటూ వస్తున్న ఆరోపణలను ఐఐటీ రూర్కీ ఖండించింది. క్లౌడ్ స్టోరేజ్ కాంపోనెంట్‌లో లోపం తలెత్తిన మాట వాస్తవమేనని పేర్కొంది. క్లౌడ్ స్టోరేజ్‌లో ఉన్న విద్యార్థుల డేటా కేవలం చదవడానికి మాత్రమే (Read-only) వీలుందని, మార్పు చేర్పులు చేసేందుకు, డిలీట్ చేసేందుకు అవకాశం లేదని స్పష్టం చేసింది.
IIT Roorkee | JEE (అడ్వాన్స్‌డ్) పరీక్ష రాసిన లక్షలాది మంది విద్యార్థుల వ్యక్తిగత డేటా లీక్ అయ్యిందని, వారి గోప్యతకు భంగం వాటిల్లిందంటూ వస్తున్న ఆరోపణలపై ఐఐటీ రూర్కీ (IIT-Roorkee) స్పందించింది. ఈ మేరకు విద్యార్థుల డేటా లీకైందంటూ వస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండించింది. అభ్యర్థుల సమాచారం పెద్ద ఎత్తున లీక్ అయిందంటూ సాగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలన్నీ అసత్యాలేనని, తప్పుదోవ పట్టించేవి అని కొట్టిపారేసింది. ఈ మేరకు ఐఐటీ రూర్కీ ఒక అధికారిక ప్రకటనను విడుదల చేసింది.
అడ్మిట్ కార్డ్‌లను డౌన్‌లోడ్ చేసుకోవడంలో, రిజిస్ట్రేషన్ ప్రక్రియలో అభ్యర్థులు ఎదుర్కొంటున్న సాంకేతిక ఇబ్బందులను అధిగమించడానికి జూన్ 2, 2026న అత్యవసర ప్రాతిపదికన కొన్ని సాంకేతిక మార్పులు (Technical Interventions) చేసినట్లు ఇన్‌స్టిట్యూట్ తెలిపింది. ఈ ప్రక్రియ వల్ల క్లౌడ్ స్టోరేజ్ కాంపోనెంట్ (cloud storage component)లో లోపం తలెత్తినట్లు వివరించింది. రైలన్ అనిల్ అనే వ్యక్తి ఈ కాన్ఫిగరేషన్ లోపాన్ని గుర్తించి సంబంధిత డేటాబేస్‌ను తాను యాక్సెస్ చేయగలుగుతున్నట్లు తమకు నివేదించారని పేర్కొంది. వెంటనే ఈ సమస్యను సరిదిద్ది డేటా యాక్సెస్‌ను స్టాప్ చేసినట్లు ఇన్‌స్టిట్యూట్ వివరించింది.
అయితే, క్లౌడ్ స్టోరేజ్‌లో ఉన్న విద్యార్థుల డేటా కేవలం చదవడానికి మాత్రమే (Read-only) వీలుందని, మార్పు చేర్పులు చేసేందుకు, డిలీట్ చేసేందుకు అవకాశం లేదని స్పష్టం చేసింది. రీడ్-ఓన్లీ యాక్సెస్ కేవలం 0.05% కంటే తక్కువ డేటాకు మాత్రమే పరిమితమైందని తెలిపింది. అభ్యర్థులకు సంబంధించిన ఎలాంటి సున్నితమైన సమాచారం (Sensitive Data) దుర్వినియోగం కాలేదని స్పష్టం చేసింది. అంతేకాదు, విద్యార్థుల డేటా చోరీకి గురికాలేదని తెలిపింది. ఈ సమస్య వల్ల అభ్యర్థుల మార్కులు, ర్యాంకులు, కేటగిరీలతో సహా పరీక్ష ఫలితాలపై ఎలాంటి ప్రభావం పడలేదని ఐఐటీ రూర్కీ తన ప్రకటనలో వెల్లడించింది.
Also Read..
మణిపూర్‌లో మళ్లీ హింస.. గ్రామంపై కాల్పులు, ఇళ్లకు నిప్పు.. ముగ్గురు మృతి
గడ్డాలు తెల్లవడుతున్నా సుతిలీలు లేవు.. సంచులు లేవని చెప్పుడేంది: ధర్మపురి అరవింద్
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

NEET-UG | నీట్ పరీక్ష విధానంలో కీలక మార్పులు.. పెన్-అండ్-పేపర్ విధానానికి స్వస్తి
ఆగస్టు 6, 2026

DGP Anand | అర్హులైన పోలీసులకు తక్కువ వడ్డీతో రుణాలు.. సిబ్బంది సంక్షేమమే ప్రధాన లక్ష్యం
జులై 20, 2026

IIT Roorkee | చికున్‌గున్యాకు గోమూత్రంతో విజయవంతంగా చికిత్స.. వెల్లడించిన ఐఐటీ రూర్కీ..
జూన్ 24, 2026
తాజావార్తలు
- ●Konda Surekha | ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో మంత్రి కొండా సురేఖ భేటీ..!
- ●Telangana Cabinet | తెలంగాణ కేబినెట్ విస్తరణ..! కొండా సురేఖకు ఉద్వాసన..?
- ●Nagarkurnool | వానలు పడడం లేదని.. మృతదేహాన్ని వెలికి తీశారు
- ●Auto Strike | తెలంగాణలో ఆటోల సమ్మె బంద్..
- ●BRS Party | కాంగ్రెస్ 1000 రోజుల దగాపై బీఆర్ఎస్ సమరభేరి.. సెప్టెంబర్ 2 నుంచి నిరసనలు
- ●MLA Mallareddy | మంత్రి పొంగులేటి పాలు పొంగినట్టు పొంగుతున్నాడు : ఎమ్మెల్యే మల్లారెడ్డి

Konda Surekha | ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో మంత్రి కొండా సురేఖ భేటీ..!

Telangana Cabinet | తెలంగాణ కేబినెట్ విస్తరణ..! కొండా సురేఖకు ఉద్వాసన..?

Nagarkurnool | వానలు పడడం లేదని.. మృతదేహాన్ని వెలికి తీశారు

Auto Strike | తెలంగాణలో ఆటోల సమ్మె బంద్..



