Paper Leak | ఉపాధ్యాయ నియామక పరీక్ష పేపర్ లీక్.. 30 మంది అభ్యర్థుల నుంచి 1.2 కోట్లు వసూలు చేసిన డాక్టర్..
aper Leak | బీహార్‌లో ఉపాధ్యాయ నియామక పరీక్ష (Teacher Recruitment) పేపర్ లీక్ వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన డాక్టర్‌ను ఆర్థిక నేరాల విభాగం (EOU) అరెస్టు చేసింది. తన సహచరులతో కలిసి పేపర్‌ను లీక్ (Paper Leak) చేసిన డాక్టర్.. మొత్తం 30 మంది అభ్యర్థుల నుంచి పెద్దమొత్తంలో వసూలు చేసినట్లు తేలింది.
Paper Leak | త్రినేత్ర.న్యూస్: బీహార్‌లో ఉపాధ్యాయ నియామక పరీక్ష (Teacher Recruitment) పేపర్ లీక్ వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన డాక్టర్‌ను ఆర్థిక నేరాల విభాగం (EOU) అరెస్టు చేసింది. తన సహచరులతో కలిసి పేపర్‌ను లీక్ (Paper Leak) చేసిన డాక్టర్.. మొత్తం 30 మంది అభ్యర్థుల నుంచి పెద్దమొత్తంలో వసూలు చేసినట్లు తేలింది.
2024 మార్చి 15న బీహార్‌లో టీచర్ రిక్రూట్‌మెంట్ పరీక్ష (BPSC TRE) జరగాల్సి ఉన్నది. అయితే దానికి ఒకరోజు ముందే పరీక్ష పేపర్ లీక్ అయినట్లు, ప్రశ్నపత్రాలు కొందరు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లినట్లు EOU గుర్తించింది. దీంతో బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (BPSC) పరీక్షను రద్దు చేసింది. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టిన ఈఓయూ.. డాక్టర్ మనీశ్ కుమార్ (Dr Manish Kumar) అనే వ్యక్తిని ప్రధాన నిందితుడిగా గుర్తించింది. తన సహచరులైన డాక్టర్ శివ్, డాక్టర్ శుభంతో కలిసి ఈ వ్యవహారం నడిపినట్లు తేల్చింది. పరీక్ష ముందు 30 మంది అభ్యర్థులకు ప్రశ్నపత్రాలు అందించి, వారి నుంచి సుమారు రూ.1.2 కోట్లు వసూలు చేసినట్లు గుర్తించింది. ప్రతి అభ్యర్థి నుంచి రూ.50 వేలు తీసుకున్నట్లు తేల్చింది.
పరీక్షకు ఒక రోజు ముందే..
పరీక్షకు ఒక రోజు ముందే అంటే 2024, మార్చి 14న పాట్నాలోని ఓ హోటల్‌లో 30 మంది అభ్యర్థులకు బస ఏర్పాటు చేశారు. వారికి ప్రశ్నపత్రాలను అందజేశారు. అయితే పేపర్‌లీక్కు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు మార్చి 14న భాబువాలోని కోహినూర్ హోటల్‌పై (Kohinoor Hotel) దాడిచేశారరు. అయితే అప్పటికే మనీశ్ కుమార్ అక్కడినుంచి తప్పించారు. దీంతో హోటల్ సీసీటీవీ ఫుటేజీ, ఇతర సాంకేతిక ఆధారాలతో మనీశ్ కుమార్‌ను పోలీసులు గుర్తించారు. అప్పటి నుంచి మనీశ్ పరారీలో ఉన్నాడు.
తాజాగా పాట్నా మెడికల్ కాలేజ్ హాస్పిటల్ (పీఎంసీహెచ్), నలంద మెడికల్ కాలేజ్ హాస్పిటల్ (ఎన్ఎంసీహెచ్) విద్యార్థుల డేటా ఆధారంగా అతడిని గుర్తించి అరెస్టు చేశారు. అతడు పేపర్ లీక్ కేసులో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న సంజీవ్ ముఖియా కుమారుడని అధికారులు తెలిపారు. ఈ కేసులో ఇప్పటివరకు మొత్తం 296 మందిని అరెస్ట్ చేశారు.
సంబంధిత వార్తలు

Philosophy Professor | చిల్లర అడిగితే చెవి పగిలేలా కొట్టాడు.. ఫిలాసఫి ప్రొఫెసర్‌పై షాప్ యజమాని అమానుషం
సెప్టెంబర్ 10, 2026

Nagarmal Bajoria | 300 సార్లు ఎన్నికల్లో పోటీ.. ఆ కోరిక తీరకుండానే అనంత లోకాలకు
సెప్టెంబర్ 4, 2026

SUV On Rooftop | చోరీ భయం.. కారును ఇంటిపైకప్పుపై పార్క్ చేసిన యజమాని
సెప్టెంబర్ 3, 2026
తాజావార్తలు
- ●Gold Sales | పుత్తడి ధరలు తగ్గినా ఆచితూచి కొనుగోళ్లు.. పండుగలు, పెళ్లిళ్ల సీజన్‌పై ఆశలు
- ●Preity Mukhundhan | హిట్ డైరెక్టర్‌తో కోలీవుడ్ హీరోయిన్ తెలుగు రొమాంటిక్ మూవీ - రిలీజ్ డేట్ కన్ఫామ్
- ●Uttam Kumar Reddy | రైతులకు రూ.813 కోట్ల పరిహారం వెంటనే చెల్లించాలి : మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
- ●IPL 2027 | ఫ్లెమింగ్ శకం ముగిసింది.. సీఎస్కే కొత్త హెచ్కోచ్గా జహీర్ ఖాన్..!
- ●Krithi Shetty | జనవరి 12 విడుదల సెట్స్‌లో కృతిశెట్టి బర్త్‌డే సెలబ్రేషన్స్
- ●Snapana Tirumanjanam | ముత్యాల మాలలు, పంచామృతాభిషేఖాలు.. శ్రీవారికి వైభవంగా స్నపన తిరుమంజనం

Gold Sales | పుత్తడి ధరలు తగ్గినా ఆచితూచి కొనుగోళ్లు.. పండుగలు, పెళ్లిళ్ల సీజన్‌పై ఆశలు

Preity Mukhundhan | హిట్ డైరెక్టర్‌తో కోలీవుడ్ హీరోయిన్ తెలుగు రొమాంటిక్ మూవీ - రిలీజ్ డేట్ కన్ఫామ్

Uttam Kumar Reddy | రైతులకు రూ.813 కోట్ల పరిహారం వెంటనే చెల్లించాలి : మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

IPL 2027 | ఫ్లెమింగ్ శకం ముగిసింది.. సీఎస్కే కొత్త హెచ్కోచ్గా జహీర్ ఖాన్..!



