త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Arvind Kejriwal | రూ.7 కోట్లు ఇవ్వ‌కుంటే చంపేస్తాం.. కేజ్రీవాల్‌కు బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి హ‌త్య బెదిరింపులు

Arvind Kejriwal | ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ క‌న్వీన‌ర్‌, ఢిల్లీ మాజీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal), ఆయ‌న కుమార్తెకు బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి హ‌త్య బెదిరింపులు (Death threat) వ‌చ్చాయి. రూ.7 కోట్లు ఇవ్వ‌కుంటే చంపేస్తామంటూ బెదిరించారు.

D

National | Published On Nov 12, 2026, 4.24 pm IST

Arvind Kejriwal | రూ.7 కోట్లు ఇవ్వ‌కుంటే చంపేస్తాం.. కేజ్రీవాల్‌కు బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి హ‌త్య బెదిరింపులు
Advertisement

Arvind Kejriwal | త్రినేత్ర న్యూస్ : ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ క‌న్వీన‌ర్‌, ఢిల్లీ మాజీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)కు హ‌త్య బెదిరింపులు క‌ల‌క‌లం రేపాయి. కేజ్రీతోపాటూ ఆయ‌న కుమార్తెకు కూడా ప్ర‌ముఖ గ్యాంగ్ స్ట‌ర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ (Lawrence Bishnoi gang) నుంచి ఈ బెదిరింపులు వ‌చ్చాయి. ఢిల్లీ తిలక్ నగర్ ఆప్ ఎమ్మెల్యే జర్నైల్ సింగ్ (MLA Jarnail Singh)కు నవంబర్ 6న ఈ బెదిరింపు ఫోన్ కాల్, వాట్సాప్ మెసేజ్ వచ్చాయి. తాను లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యుడున‌ని చెప్పుకుంటూ ఒక గుర్తుతెలియని వ్యక్తి రూ. 7 కోట్లు డిమాండ్ చేశాడు. అడిగినంత ఇవ్వ‌కుంటే కేజ్రీవాల్‌, ఆయ‌న కుమార్తెను చంపేస్తాని బెదిరించాడు. కేజ్రీవాల్‌కు ఈ విషయం చేరవేయాలని ఆ వ్యక్తి ఎమ్మెల్యేను ఆదేశించాడు.

ఈ ఘ‌ట‌నపై స‌ద‌రు ఎమ్మెల్యే పంజాబ్‌లోని మొహాలీ పోలీసు స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు ఆధారంగా కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. కాల్ రికార్డులు, ఐపీ లాగ్‌లు, లొకేషన్ వివరాలను ట్రేస్ చేయ‌గా.. హర్యానాలోని రోహ్‌తక్ నుంచి బెదిరింపు కాల్ వ‌చ్చిన‌ట్లు గుర్తించారు. స‌ద‌రు వ్య‌క్తిని గుర్తించి అదుపులోకి తీసుకుని విచారించ‌గా.. ఈ బెదిరింపు కాల్ బూట‌క‌మ‌ని తేలింది. వ్యక్తి రోతక్‌కు చెందిన రిటైర్డ్ క్లర్క్ అని, అతనికి గ్యాంగ్‌స్టర్‌తో లేదా అతని నెట్‌వర్క్‌తో ఎలాంటి సంబంధాలు లేవని పోలీసులు విచార‌ణ‌లో తేల్చారు. ఈ బెదిరింపుల నేప‌థ్యంలో కేజ్రీవాల్, ఆయన కుటుంబ సభ్యులకు తగిన భద్రత కల్పించాలని ఎమ్మెల్యే జర్నైల్ సింగ్ పోలీసులను కోరారు.

Also Read..

బీజేపీకి చెక్ పెట్ట‌డ‌మే ల‌క్ష్యం.. కొత్త కూట‌మి ఏర్పాటు చేసిన అజాద్‌, ఒవైసీ

నీ ఇష్టమొచ్చింది చేసుకోపో.. అన్నంత మాత్రాన ఆత్మహత్య చేసుకుంటారా? భర్తపై కేసు పెడతారా?

అయ్య‌ప్ప ద‌య వ‌ల్ల క్షేమంగా బ‌య‌ట‌ప‌డ్డా - షూటింగ్‌కు వెళుతున్నా - రోడ్డు ప్ర‌మాదంపై శేఖ‌ర్ మాస్ట‌ర్ క్లారిటీ

Advertisement
Advertisement