Harish Rao | స్కూళ్ల ప్రారంభం వాయిదా వెనుక రూ. 2 వేల కోట్ల కుంభకోణం : హరీశ్‌రావు
Harish Rao | ఏటా జూన్ 12న తెరుచుకోవాల్సిన స్కూళ్లను 15వ తేదీకి ఎందుకు వాయిదా వేశారు అని మాజీ మంత్రి హరీశ్‌రావు నిలదీశారు. దీని వెనుక ఏకంగా రూ. 2 వేల కోట్ల భారీ కుంభకోణం దాగి ఉందని ఆరోపించారు. కమీషన్ల కోసం కాంట్రాక్టులు సెట్ కాకపోవడం వల్లే బడుల ప్రారంభాన్ని వాయిదా వేశారని ఆయన పేర్కొన్నారు.
Harish Rao | త్రినేత్ర.న్యూస్ : ఏటా జూన్ 12న తెరుచుకోవాల్సిన స్కూళ్లను 15వ తేదీకి ఎందుకు వాయిదా వేశారు అని మాజీ మంత్రి హరీశ్‌రావు నిలదీశారు. దీని వెనుక ఏకంగా రూ. 2 వేల కోట్ల భారీ కుంభకోణం దాగి ఉందని ఆరోపించారు. కమీషన్ల కోసం కాంట్రాక్టులు సెట్ కాకపోవడం వల్లే బడుల ప్రారంభాన్ని వాయిదా వేశారని ఆయన పేర్కొన్నారు. గురువారం మీడియాతో చిట్ చాట్ సందర్భంగా హరీశ్‌రావు ఈ వ్యాఖ్యలు చేశారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో గురుకులాలు, ప్రభుత్వ బడుల్లో యూనిఫామ్స్ కుట్టే బాధ్యత చేనేత కార్మికులకు.. షూ, బెల్టుల తయారీ దళిత కుటుంబాలు బతకాలని LIDCAP కు ఇచ్చాం. కానీ రేవంత్ రెడ్డి వాటిని సెంట్రలైజ్ చేసి, మన వాళ్ల పొట్టగొట్టి గుజరాత్ కాంట్రాక్టర్‌కు కట్టబెట్టాడు. ఆ గుజరాత్ కాంట్రాక్టర్ నుంచి ఇంతవరకు బట్టలు రాలేదు. 7 లక్షల మంది గురుకుల విద్యార్థులకు ఇవ్వాల్సిన బ్యాగులు, డ్రెస్సులు, బెల్టులు, నోట్ బుక్స్ ఏవీ ఇంకా అందలేదు. మేము అధికారంలో ఉన్నప్పుడు స్కూల్ తెరిచిన మొదటి రోజే అన్నీ ఇచ్చేవాళ్లం. అన్యాయం జరిగిందని చేనేత సంస్థలు కోర్టుకు కూడా వెళ్లాయి. విద్యాశాఖ మంత్రిగా ముఖ్యమంత్రే ఉండటం వల్లే విద్యావ్యవస్థ ఇంత అస్తవ్యస్తంగా మారింది అని హరీశ్‌రావు మండిపడ్డారు.
చివరకు విద్యార్థులు తినే కోడిగుడ్డులో కూడా అవినీతి
సీఎం కనుసన్నల్లో గత టెండర్ల కంటే ఇప్పుడు రేట్లు డబుల్ చేసి మరీ టెండర్లు ఫైనల్ చేసి భారీ అవినీతికి పాల్పడ్డారు. చివరకు విద్యార్థులు తినే కోడిగుడ్డులో కూడా అవినీతి చేయడం దారుణం. పేద పిల్లలు చదివే గురుకులాల్లో ఇలా కమీషన్లు కొడితే దేవుడు కూడా క్షమించడు. ప్రభుత్వ స్కూళ్లలో పిల్లల సంఖ్య దారుణంగా తగ్గిపోయిందని సాక్షాత్తూ కేంద్ర ప్రభుత్వమే రిపోర్ట్ ఇస్తే.. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి యూకేజీఅని రకరకాల కట్టుకథలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
స్కావెంజర్లకు సైతం నాలుగు నెలలుగా జీతాలు ఇవ్వలేదు
బడుల్లో సీఎం బ్రేక్ ఫాస్ట్ స్కీమ్ అసలు అమలే కావడం లేదు. అమ్మఒడి కమిటీల ద్వారా పనులు చేసిన మహిళా సంఘాలకు, పేదలకు ఒక్కో నియోజకవర్గానికి రూ. 4 కోట్ల చొప్పున బిల్లులు పెండింగ్ పెట్టారు. బడుల్లో పనిచేసే స్కావెంజర్లకు సైతం నాలుగు నెలలుగా జీతాలు ఇవ్వలేదు. అడ్డగోలుగా పెంచిన భూముల ధరలతో పేద, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ ప్రభుత్వ విధానాలతో రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా కుదేలైంది. ఇతర రాష్ట్రాల్లో కొన్ని SFTల వరకు తక్కువ ధరలు నిర్ణయిస్తే, ఇక్కడ మాత్రం ఇష్టారాజ్యంగా రేట్లు పెంచేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పన్నుల మీద పన్నులు వేస్తూ పేదల నడ్డి విరుస్తోంది. ఆర్టీఏ ఛార్జీలు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు, మద్యం ధరలు ఇప్పటికే పెంచారు, మళ్లీ ఇప్పుడు మందుల ధరలు కూడా పెంచబోతున్నారు అని హరీశ్‌రావు ధ్వజమెత్తారు.
భూమి శిస్తు కూడా తెస్తాడట
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పెట్రోల్ ధరలు తగ్గించాలని ఊరికే డిమాండ్ చేసిన నాయకుడు, అధికారంలోకి రాగానే ఏకంగా పన్నులు ఎందుకు పెంచాడు. కేంద్రం పెంచిందని ధర్నాలు చేసే బదులు, అనేక రాష్ట్రాలు తగ్గించినట్లుగా ఇక్కడ స్టేట్ ట్యాక్స్ తగ్గించాలి. పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో ఈ ప్రభుత్వానికి అదనంగా రూ. 2 వేల కోట్ల ఆదాయం రాబోతోంది. ఈ ప్రభుత్వం పెంచనిది ఏముంది. ఇవి చాలవన్నట్లు మళ్లీ ఇప్పుడు భూమి శిస్తు కూడా తెస్తామని ముఖ్యమంత్రి అంటున్నాడని హరీశ్‌రావు మండిపడ్డారు.
తాజావార్తలు
- ●Ravi Teja | ట్రాన్స్‌జెండర్‌గా మాస్ మహారాజా - రూమర్లలో నిజమెంత?
- ●Meenakshi Natarajan | మీనాక్షి నటరాజన్‌కు బిగ్ షాక్.. ముగ్గురు బీజేపీ అభ్యర్థులు ఏకగ్రీవం
- ●Jawaharlal Nehru vs Savarkar | నెహ్రూ vs సావర్కర్: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌పై కాంగ్రెస్ పోలీస్ కంప్లైంట్
- ●Tollywood | సినిమాల్లోకి రాకముందు సేల్స్ గర్ల్‌గా పనిచేశా - టాలీవుడ్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!
- ●Amazfit Cheetah | చీతా సిరీస్‌లో రెండు పవర్ఫుల్ స్మార్ట్ వాచ్‌లను లాంచ్ చేసిన అమేజ్‌ఫిట్
- ●TMC-Congress | కాంగ్రెస్‌లో టీఎంసీ విలీనం..? క్లారిటీ ఇచ్చిన కేసీ వేణుగోపాల్

Ravi Teja | ట్రాన్స్‌జెండర్‌గా మాస్ మహారాజా - రూమర్లలో నిజమెంత?

Meenakshi Natarajan | మీనాక్షి నటరాజన్‌కు బిగ్ షాక్.. ముగ్గురు బీజేపీ అభ్యర్థులు ఏకగ్రీవం

Jawaharlal Nehru vs Savarkar | నెహ్రూ vs సావర్కర్: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌పై కాంగ్రెస్ పోలీస్ కంప్లైంట్

Tollywood | సినిమాల్లోకి రాకముందు సేల్స్ గర్ల్‌గా పనిచేశా - టాలీవుడ్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!






