Tamil Nadu Polls | తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అక్రమంగా ఓటేసిన విదేశీయులు.. 10 మంది అరెస్ట్
Tamil Nadu Polls | తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పలువురు విదేశీయులు ఓటు వేసినట్లు తేలింది. తప్పుడు ఓటరు కార్డు గుర్తింపును ఉపయోగించి వారు ఓటు వేసినట్లు అధికారులు గుర్తించారు. దీంతో దాదాపు 10 మందిని పోలీసులు అరెస్ట్ (Foreigners Arrested) చేశారు. వీరిలో మెజారిటీ వ్యక్తులు శ్రీలంక జాతీయులు కావడం గమనార్హం.
Tamil Nadu Polls | తమిళనాడులో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. ఇటీవలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో (Tamil Nadu Polls) పలువురు విదేశీయులు ఓటు వేసినట్లు అధికారులు గుర్తించారు. తప్పుడు ఓటరు కార్డు గుర్తింపును ఉపయోగించి వారు ఓటు వేసినట్లు తేలింది. దీంతో దాదాపు 10 మందిని పోలీసులు అరెస్ట్ (Foreigners Arrested) చేశారు. వీరిలో మెజారిటీ వ్యక్తులు శ్రీలంక జాతీయులు కావడం గమనార్హం.
అరెస్టైన వారిలో శ్రీలంకకు చెందిన రంజని (59), సర్ఫుద్దీన్ (68), నిలంతి (44), జయంతన్ (40), చార్లీ బాలచంద్రన్ (48), చక్రవర్తి లోకప్రియ (50), సునీత చక్రవర్తి (48)గా గుర్తించారు. బ్రిటన్‌కు చెందిన అయ్యాదురై (53), ఇండోనేషియాకు చెందిన టిటిన్ మరియాట్టి (47), కెనడాకు చెందిన జిత్తేంద్రనాథ్ (38) ఉన్నారు. చెన్నై (Chennai) విమానాశ్రయంలో వీరిని ఇమ్మిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారంతా విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా.. తనిఖీల సమయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులకు (immigration officers) దొరికిపోయారు. వారి చూపుడు వేళ్లపై ఉన్న సిరా గుర్తు ఆధారంగా వారిని అరెస్ట్ చేశారు.
అరెస్టైన వారు విదేశీ పాస్‌పోర్టులు కలిగి ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇలా విదేశీ పాస్‌పోర్ట్ ఉండి.. భారత ఎన్నికల సంఘం జారీ చేసిన ఓటర్ ఐడీ కార్డులను కలిగి ఉండటం అక్రమమని, చట్టవిరుద్ధమన్నారు. వీరికి ఓటరు ఐడీ కార్డులు ఎలా వచ్చాయి అనే కోణంలో దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు. ఇంకా ఎంతమంది ఇలా దొంగఓట్లు వేశారన్న విషయంపై దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
Also Read..
సనాతనాన్ని నిర్మూలించడం అంటే.. గుడికి వెళ్లొద్దని కాదు : ఉదయనిధి స్టాలిన్
వచ్చే ఏడాది నుంచి ఆన్‌లైన్‌లో నీట్ పరీక్ష.. ప్రకటించిన కేంద్ర మంత్రి
పరారీలో కేంద్రమంత్రి కుమారుడు.. పోక్సో కేసు నిందితుడిని కాపాడుతున్న కాంగ్రెస్ సర్కార్: కేటీఆర్
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Suicide | నేను ఆత్మహత్య చేసుకుంటున్నా.. భార్యకు వీడియో కాల్లో చూపిస్తూ రైలుకు ఎదురెళ్లిన భర్త
- ●Cristiano Ronaldo | ఇదే నా చివరి ప్రపంచకప్.. ప్రకటించిన క్రిస్టియానో రొనాల్డో
- ●Indian Railways | పిల్లలతో రైలు ప్రయాణం ? ఈ రైల్వే నిబంధన తెలియకపోతే జరిమానా తప్పదు..
- ●Bikers Perform Stunts | రెచ్చిపోయిన ఆకతాయిలు.. అంబులెన్స్‌కు దారివ్వకుండా
- ●Karur Stampede Case | కరూర్ తొక్కిసలాటపై డీఎంకే పిటిషన్.. రేపు విచారణకు ఓకే అన్న సుప్రీం..!
- ●Vinod Kumar | ఇక్కడ.. అక్కడ.. రెండు ఓట్ల సంగతి ఎప్పుడు తేలుస్తరు?

Suicide | నేను ఆత్మహత్య చేసుకుంటున్నా.. భార్యకు వీడియో కాల్లో చూపిస్తూ రైలుకు ఎదురెళ్లిన భర్త

Cristiano Ronaldo | ఇదే నా చివరి ప్రపంచకప్.. ప్రకటించిన క్రిస్టియానో రొనాల్డో

Indian Railways | పిల్లలతో రైలు ప్రయాణం ? ఈ రైల్వే నిబంధన తెలియకపోతే జరిమానా తప్పదు..

Bikers Perform Stunts | రెచ్చిపోయిన ఆకతాయిలు.. అంబులెన్స్‌కు దారివ్వకుండా






