Udhayanidhi Stalin | సనాతనాన్ని నిర్మూలించడం అంటే.. గుడికి వెళ్లొద్దని కాదు : ఉదయనిధి స్టాలిన్
Udhayanidhi Stalin | సనాతన విధానాలను నిర్మూలించడం అంటే.. ప్రజలు గుడికి వెళ్లకూడదని కాదని తమిళనాడు ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ స్పష్టం చేశారు. యావత్ సమాజంలో ప్రతి ఒక్కరికీ సమాన హక్కులు ఉండాలన్నది తన ఉద్దేశం అని చెప్పుకొచ్చారు.
Udhayanidhi Stalin | సనాతన ధర్మాన్ని (Sanatan Dharma) నిర్మూలించాలంటూ తాను చేసిన వ్యాఖ్యలపై డీఎంకే నేత, తమిళనాడు ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ (Udhayanidhi Stalin) వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యలను ప్రత్యర్థులు తప్పుగా అర్థం చేసుకున్నారని అన్నారు. సనాతన విధానాలను నిర్మూలించడం అంటే.. ప్రజలు గుడికి వెళ్లకూడదని కాదని స్పష్టం చేశారు. కేవలం ఆలయాల్లో మాత్రమే కాకుండా.. యావత్ సమాజంలో ప్రతి ఒక్కరికీ సమాన హక్కులు ఉండాలన్నది తన ఉద్దేశం అని చెప్పుకొచ్చారు.
ప్రజలను ఎగువ, దిగువ కులాలుగా విభజించే పద్ధతుల (abolish caste system) గురించే తాను మాట్లాడానని వివరించారు. అలాంటి వివక్షను అంతం చేయాలన్నారు. తాను పెరియార్ ఇవి రామస్వామి, బీఆర్ అంబేద్కర్, సీఎన్ అన్నాదురై, కరుణానిధి వంటి సామాజిక న్యాయ పోరాట యోధులు బోధించిన సిద్ధాంతాలనే అనుసరిస్తున్నట్లు చెప్పారు. ఎంతమంది ఎన్ని విమర్శలు చేసినా తాను భయపడబోడనని.. కుల వ్యవస్థపై పోరాడుతూనే ఉంటానని ఉదయనిధి స్పష్టం చేశారు.
కాగా, ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం సందర్భంగా ఈనెల 12న తమిళనాడు అసెంబ్లీలో ఉదయనిధి మాట్లాడారు. ఈ సందర్భంగా సనాతన ధర్మం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలను విభజిస్తున్న సనాతనాన్ని నిర్మూలించాలంటూ వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. దీంతో తన వ్యాఖ్యలపై ఉదయనిధి తాజాగా స్పష్టతనిచ్చారు.
Also Read..
వచ్చే ఏడాది నుంచి ఆన్‌లైన్‌లో నీట్ పరీక్ష.. ప్రకటించిన కేంద్ర మంత్రి
ఎన్నికలు ముగిశాయి.. మోదీ వసూళ్లు మొదలయ్యాయి.. ఇంధన ధరల పెంపుపై కాంగ్రెస్ విమర్శలు
ఎన్నికలు ముగిశాయి.. మోదీ వసూళ్లు మొదలయ్యాయి.. ఇంధన ధరల పెంపుపై కాంగ్రెస్ విమర్శలు
సంబంధిత వార్తలు

Karur Stampede Case | కరూర్ తొక్కిసలాటపై డీఎంకే పిటిషన్.. రేపు విచారణకు ఓకే అన్న సుప్రీం..!
జులై 6, 2026

Udhayanidhi Stalin | భర్త కోసం వెతుకుతున్న భార్య కథ రాష్ట్రమంతా తెలుసు.. సీఎం విజయ్‌పై ఉదయనిధి వ్యక్తిగత విమర్శలు
జూన్ 23, 2026

Rahul Gandhi | రాహుల్ ఓ పెద్ద జోక్.. ప్రతిపక్ష పార్టీల మధ్య చీలికకు ఆయనే కారణం.. కాంగ్రెస్ అగ్రనేతపై డీఎంకే విమర్శలు
జూన్ 16, 2026
తాజావార్తలు
- ●Suicide | నేను ఆత్మహత్య చేసుకుంటున్నా.. భార్యకు వీడియో కాల్లో చూపిస్తూ రైలుకు ఎదురెళ్లిన భర్త
- ●Cristiano Ronaldo | ఇదే నా చివరి ప్రపంచకప్.. ప్రకటించిన క్రిస్టియానో రొనాల్డో
- ●Indian Railways | పిల్లలతో రైలు ప్రయాణం ? ఈ రైల్వే నిబంధన తెలియకపోతే జరిమానా తప్పదు..
- ●Bikers Perform Stunts | రెచ్చిపోయిన ఆకతాయిలు.. అంబులెన్స్‌కు దారివ్వకుండా
- ●Karur Stampede Case | కరూర్ తొక్కిసలాటపై డీఎంకే పిటిషన్.. రేపు విచారణకు ఓకే అన్న సుప్రీం..!
- ●Vinod Kumar | ఇక్కడ.. అక్కడ.. రెండు ఓట్ల సంగతి ఎప్పుడు తేలుస్తరు?

Suicide | నేను ఆత్మహత్య చేసుకుంటున్నా.. భార్యకు వీడియో కాల్లో చూపిస్తూ రైలుకు ఎదురెళ్లిన భర్త

Cristiano Ronaldo | ఇదే నా చివరి ప్రపంచకప్.. ప్రకటించిన క్రిస్టియానో రొనాల్డో

Indian Railways | పిల్లలతో రైలు ప్రయాణం ? ఈ రైల్వే నిబంధన తెలియకపోతే జరిమానా తప్పదు..

Bikers Perform Stunts | రెచ్చిపోయిన ఆకతాయిలు.. అంబులెన్స్‌కు దారివ్వకుండా



