Actor Ajith | అజిత్‌ను పరామర్శించిన సీఎం విజయ్, త్రిష
Actor Ajith | తమిళ సినీ నటుడు అజిత్ కుమార్ తల్లి మోహిని మణి (85) చెన్నైలో కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తమిళనాడు ముఖ్యమంత్రి, తమిళగ వెట్రి కళగం అధినేత, నటుడు విజయ్‌తో పాటు నటి త్రిష కృష్ణన్ శనివారం అర్ధరాత్రి సమయంలో అజిత్ నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
Entertainment | Published On May 31, 2026, 11.30 am IST
Actor Ajith | తమిళ సినీ నటుడు అజిత్ కుమార్ తల్లి మోహిని మణి (85) చెన్నైలో కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తమిళనాడు ముఖ్యమంత్రి, తమిళగ వెట్రి కళగం అధినేత, నటుడు విజయ్‌తో పాటు నటి త్రిష కృష్ణన్ శనివారం అర్ధరాత్రి సమయంలో అజిత్ నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల్లో విజయ్ భారీ భద్రతా ఏర్పాట్ల మధ్య అజిత్ ఇంటికి చేరుకున్నట్లు కనిపించింది. ఇంటి వద్ద అజిత్‌ను ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్న విజయ్, అనంతరం లోపలికి వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చారు. నటి త్రిష సైతం బ్లాక్ సల్వార్ సూట్‌లో అజిత్ నివాసానికి చేరుకుని మోహినికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అజిత్‌ను కలుసుకుని ధైర్యం చెప్పిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇటీవల కాలంలో విజయ్, త్రిషల రిలేషన్‌పై పలు ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో ఇద్దరూ ఒకేసారి అజిత్ ఇంటికి వెళ్లడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
అజిత్ తల్లి మోహిని మణి గత కొంతకాలంగా వయోభారంతో ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. శనివారం ఉదయం నిద్రలోనే ఆమె ప్రశాంతంగా తుదిశ్వాస విడిచినట్లు వెల్లడించారు. దాదాపు మూడేళ్ల కింద ఆమె భర్త పీ సుబ్రమణ్యం మరణించగా.. తాజాగా ఆమె సైతం కన్నుమూయడం కుటుంబాన్ని తీవ్ర విషాదంలో ముంచింది. తల్లి మరణ వార్త తెలిసిన వెంటనే దుబాయ్‌లో ఉన్న అజిత్ కుమార్ హుటాహుటిన చెన్నై చేరుకున్నారు. మోహిని మణి మృతిపై అజిత్ కుటుంబం విడుదల చేసిన ప్రకటనలో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. తమ కుటుంబానికి ఆమె మా కుటుంబానికి గుండెకాయ లాంటివారని, అపారమైన ప్రేమ, సహనం, జ్ఞానం, ఆత్మస్థైర్యానికి ప్రతీకగా నిలిచారని, ఆమె మాకు నేర్పిన విలువలు జీవితాంతం మార్గదర్శకంగా నిలుస్తాయని కుటుంబం పేర్కొంది. సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించి, అజిత్ కుటుంబానికి సానుభూతి ప్రకటించారు. ఆదివారం ఆమె అంత్యక్రియలు జరుగనున్నాయి.
View this post on Instagram
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●US NRI Returning To India | NRIలు ఇండియాకు ఎందుకు తిరిగి రారు? ఈ నిజాలు తెలిస్తే షాక్!
- ●Bulandshahr Monkey Viral Video | వర్షంలా రాలిన రూ.500 నోట్లు.. లాయర్ బ్యాగ్ లాక్కొని చెట్టెక్కిన కోతి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- ●Sridhar Vembu AI Bubble | 1999 డాట్-కామ్ క్రాష్ రిపీట్ కాబోతోందా? 'AI బబుల్'పై జోహో ఫౌండర్ శ్రీధర్ వేంబు స్ట్రాంగ్ వార్నింగ్
- ●Harish Rao | 'రైతు డిస్కం' వ్యవసాయానికి ఉరితాడు.. సోలార్ పవర్‌తో 24 గంటల కరెంట్ ఎలా ఇస్తారు? సీఎం రేవంత్‌పై హరీశ్‌రావు ఫైర్
- ●Mallu Ravi | కేటీఆర్, హరీష్ రావులకు మతిస్థిమితం లేదు.. కూల్చేస్తాం, పేల్చేస్తాం అంటారా? ఎంపీ మల్లు రవి ఫైర్
- ●Kajal Aggarwal | పొట్టి డ్రెస్‌లో కాజల్ అందాల విందు

US NRI Returning To India | NRIలు ఇండియాకు ఎందుకు తిరిగి రారు? ఈ నిజాలు తెలిస్తే షాక్!

Bulandshahr Monkey Viral Video | వర్షంలా రాలిన రూ.500 నోట్లు.. లాయర్ బ్యాగ్ లాక్కొని చెట్టెక్కిన కోతి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

Sridhar Vembu AI Bubble | 1999 డాట్-కామ్ క్రాష్ రిపీట్ కాబోతోందా? 'AI బబుల్'పై జోహో ఫౌండర్ శ్రీధర్ వేంబు స్ట్రాంగ్ వార్నింగ్

Harish Rao | 'రైతు డిస్కం' వ్యవసాయానికి ఉరితాడు.. సోలార్ పవర్‌తో 24 గంటల కరెంట్ ఎలా ఇస్తారు? సీఎం రేవంత్‌పై హరీశ్‌రావు ఫైర్






