KTR | వారం రోజులుగా పరారీలో కేంద్రమంత్రి కుమారుడు.. పోక్సో కేసు నిందితుడిని కాపాడుతున్న కాంగ్రెస్ సర్కార్: కేటీఆర్
KTR | త్రినేత్ర.న్యూస్: పోక్సో కేసులో (POCSO Case) కేంద్రమంత్రి కుమారుడు వారం రోజులుగా పరారీలో ఉన్నాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమర్శించారు. పోక్సో కేసు నిందితుడిని కాంగ్రెస్ (Congress) సర్కార్ కాపాడుతున్నదని ఆరోపించారు. కోర్టుల్లో బాధితురాలి తరఫున పోరాడేందుకు ప్రభుత్వం నిరాకరిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Union minister’s son is
absconding in #POCSO case for the last one week!!Congress Govt is absconding from its duty by shielding the criminal & refusing to fight for the victim in the court of law
— KTR (@KTRBRS) May 15, 2026
భగీరథ్‌ను వెంటనే అరెస్టు చేయాలి
బండి భగీరథ్‌ను అరెస్టుకు సంబంధించి నిరసనలు రోజురోజుకు తీవ్రరూపం దాల్చుతున్నాయి. తాజాగా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) కుమారుడు బండి భగీరథ్ (Bandi Bhagirath) పై బీఆర్ఎస్ మహిళా లోకం మరోసారి భగ్గుమంది. బాలికపై వేదింపులకు పాల్పడిని పోక్సో కేసు నిందితుడు భగీరథ్‌ను వెంటనే అరెస్టు చేయాలని మహిళలు నినాదాలతో హోరెత్తించారు. సీఎం డౌన్ డౌన్, బండి భగీరథ్‌ను వెంటనే అరెస్టు చేయాలి అనే నినాదాలతో ట్యాంక్‌బండ్ పరిసరాలు దద్దరిల్లాయి. బండి సంజయ్‌ను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని బీఆర్ఎస్ మహిళా నాయకురాళ్లు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
అంతకుముందు ప్లకార్డులు చేతబూని మహిళా నాయకురాళ్లు భారీ సంఖ్యలో ట్యాంక్‌బండ్ విగ్రహం వద్దకు చేరుకున్నారు. విగ్రహ ఆవరణలోకి వెళ్లి అక్కడే బైఠాయించారు. శాంతియుతంగా నిరసన తెలిపారు. బండి భగీరథ్‌పై పోక్సో కేసు నమోదైనా ఎందుకు అరెస్టు చేయడం లేదని ప్రశ్నించారు. నిందితుడిని కాంగ్రెస్ ప్రభుత్వం కాపాడుతోందని, వెంటనే సీఎం స్పందించి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో అక్కడికి పోలీసులు భారీ సంఖ్యలో చేరుకుని శాంతి భద్రతలను పర్యవేక్షిస్తున్నారు.
తాజావార్తలు
- ●Jagadish Reddy | అక్కడ బటన్ నొక్కితే తెలంగాణ మొత్తం నీళ్లొస్తయ్
- ●Kriti Sanon | హీరో డామినేషన్ నచ్చలేదు - చాలా కండీషన్లు పెట్టాడు - అల వైకుంఠపురములో రీమేక్‌పై కృతి సనన్ కామెంట్లు
- ●Missing Link | ప్రారంభమైన రెండు నెలలకే.. భారీ వర్షానికి మూతపడిన రూ.7వేల కోట్ల మిస్సింగ్ లింక్.. మహా సర్కార్‌పై ప్రతిపక్షాల విమర్శలు
- ●Tesla | ఢిల్లీలో టెస్లా తొలి ఇన్మాల్ ఈవీ చార్జింగ్ కేంద్రం ప్రారంభం..!
- ●ITR Filing | రూ.4 లక్షల లోపు ఆదాయమా? అయినా ఈ 5 పరిస్థితుల్లో ఐటీఆర్ దాఖలు తప్పనిసరి!
- ●Telugu OTT | ఓటీటీలోకి నివేదా పేతురాజ్ రీఎంట్రీ తెలుగు మూవీ - నో డైలాగ్స్ - సినిమా మొత్తం పాటలే!

Jagadish Reddy | అక్కడ బటన్ నొక్కితే తెలంగాణ మొత్తం నీళ్లొస్తయ్

Kriti Sanon | హీరో డామినేషన్ నచ్చలేదు - చాలా కండీషన్లు పెట్టాడు - అల వైకుంఠపురములో రీమేక్‌పై కృతి సనన్ కామెంట్లు

Missing Link | ప్రారంభమైన రెండు నెలలకే.. భారీ వర్షానికి మూతపడిన రూ.7వేల కోట్ల మిస్సింగ్ లింక్.. మహా సర్కార్‌పై ప్రతిపక్షాల విమర్శలు

Tesla | ఢిల్లీలో టెస్లా తొలి ఇన్మాల్ ఈవీ చార్జింగ్ కేంద్రం ప్రారంభం..!





