త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Army Pilot Proposes To Girlfriend | గ్రాడ్యుయేష‌న్ వేడుక‌లో ప్రేయ‌సికి పైల‌ట్ ప్ర‌పోజ‌ల్‌.. మోకాళ్ల‌పై కూర్చొని

Army Pilot Proposes To Girlfriend | గ్రాడ్యుయేష‌న్ వేడుక‌లో ఇండియ‌న్ ఆర్మీ ఏవియేష‌న్ కెప్టెన్‌ భ‌ర‌త్ భ‌ర‌ద్వాజ్ త‌న ప్రేయ‌సికి వినూత్న రీతిలో ప్ర‌పోజ్ చేశాడు. కుటుంబ స‌భ్యులు, ఫ్రెండ్స్ స‌మ‌క్షంలో మోకాళ్ల‌పై కూర్చుని త‌న ప్రేయ‌సి ఆరుషికి ఎంగేజ్మెంట్ రింగ్‌తో త‌న ప్రేమ‌ను వ్య‌క్త‌ప‌రిచాడు.

D

National | Published On Jun 3, 2026, 10.59 am IST

Army Pilot Proposes To Girlfriend | గ్రాడ్యుయేష‌న్ వేడుక‌లో ప్రేయ‌సికి పైల‌ట్ ప్ర‌పోజ‌ల్‌.. మోకాళ్ల‌పై కూర్చొని
Advertisement

Army Pilot Proposes To Girlfriend | భారత సైన్యానికి చెందిన ఏవియేషన్ గ్రాడ్యుయేషన్ వేడుకలో ఆర్మీ పైల‌ట్ (Army Pilot Proposes To Girlfriend) ఒక‌రు త‌న ప్రేయ‌సికి వినూత్న రీతిలో ప్ర‌పోజ్ చేసి అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్నాడు. మహారాష్ట్ర (Maharashtra) నాసిక్ (Nashik)లోని 'కాంబట్ ఆర్మీ ఏవియేషన్ ట్రైనింగ్ స్కూల్' (Combat Army Aviation Training Schoo)లో ట్రైనింగ్ పూర్తి చేసుకున్న ఇండియన్ ఆర్మీ ఏవియేషన్ కెప్టెన్ భరత్ భరద్వాజ్.. తన గర్ల్‌ఫ్రెండ్ ఆరుషికి ఊహించని సర్ప్రైజ్ ఇచ్చాడు.

శిక్ష‌ణా కార్య‌క్ర‌మం ముగింపు సంద‌ర్భంగా పాసింగ్ అవుట్ ప‌రేడ్‌, ఏవియేష‌న్ ప్ర‌ద‌ర్శ‌న జ‌రిగింది. త‌న కెరీర్‌లో వ్య‌క్తిగ‌త మైలురాయి అందుకున్న కెప్టెన్ భ‌ర‌ద్వాజ్ (Indian Army Aviation Captain Bharat Bhardwaj) ఆ సంతోష‌ క్ష‌ణాల‌ను మ‌రింత ప‌దిలం చేసుకున్నాడు. కుటుంబ స‌భ్యులు, ఫ్రెండ్స్ స‌మ‌క్షంలో ఆరుషికి ప్ర‌పోజ్ చేశాడు.

సైనిక దుస్తుల్లో ర‌న్‌వేపై న‌డుచుకుంటూ వ‌చ్చిన భ‌ర‌ద్వాజ్‌.. తాను శిక్ష‌ణ పూర్తి చేసుకున్న హెలికాప్ట‌ర్ ముందు మోకాళ్ల‌పై కూర్చుని త‌న ప్రేయ‌సి ఆరుషికి ఎంగేజ్మెంట్ రింగ్‌తో త‌న ప్రేమ‌ను వ్య‌క్త‌ప‌రిచాడు. భ‌రద్వాజ్ ఇచ్చిన ఊహించ‌ని స‌ర్‌ప్రైజ్‌తో ఆమె ఒక్క‌సారిగా షాక్ అయ్యింది. ఆ వెంట‌నే త‌న ప్రేమ‌కు ఓకే చెప్పి రింగ్‌ను తొడిగించుకుంది. ఆ స‌మ‌యంలో అక్క‌డ ఉన్న కుటుంబ‌స‌భ్యులు, తోటి ఆఫీస‌ర్లు, ఇన్‌స్ట్ర‌క్ట‌ర్లు, అతిథులు ఆ జంట‌కు కంగ్రాట్స్ చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియో నెటిజ‌న్ల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంటోంది.

Also Read..

అమెరికాలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు.. అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు

రోడ్ల‌పై నీరు నిల్వ‌కుండా ముంద‌స్తు చ‌ర్య‌లు తీసుకోండి.. అధికారుల‌కు సూచించిన‌ సైబ‌రాబాద్ సీపీ

మ‌రోసారి భ‌గ్గుమ‌న్న ప‌శ్చిమాసియా.. అమెరికా సైనిక స్థావ‌రాల‌పై ఇరాన్ క్షిప‌ణి దాడులు

Advertisement
Advertisement