Trump Plans New Tariffs | ట్రంప్ మరో బాంబ్.. భారత్‌పై 12.5 శాతం అదనపు సుంకాలకు ప్లాన్
Trump Plans New Tariffs | భారత్‌పై అమెరికా మరోసారి టారిఫ్ బాంబ్ పేల్చింది. వెట్టిచాకిరీ (Forced Labour) నిరోధానికి తగిన చర్యలు తీసుకోవడంలో విఫలమైనందుకు గానూ భారత్ (India) సహా 60 భాగస్వామ్య దేశాలపై అదనపు సుంకాలను విధించాలని నిర్ణయించింది. ఈ ప్రతిపాదిత సుంకాలు 10 శాతం నుంచి 12.5 శాతం వరకూ ఉండనున్నాయి.
Trump Plans New Tariffs | అగ్రరాజ్యం అమెరికా తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రపంచ దేశాలపై మరోసారి టారిఫ్‌లతో విరుచుకుపడేందుకు ట్రంప్ యంత్రాంగం సిద్ధమైంది. వెట్టిచాకిరీ (Forced Labour) నిరోధానికి తగిన చర్యలు తీసుకోవడంలో విఫలమైనందుకు గానూ భారత్ (India) సహా 60 భాగస్వామ్య దేశాలపై అదనపు సుంకాలను విధించాలని నిర్ణయించింది. ఈ మేరకు యూఎస్ వాణిజ్య ప్రతినిధి కార్యాలయం (US Trade Representative) అమెరికా ప్రభుత్వానికి కీలక ప్రతిపాదన చేసింది. ఈ ప్రతిపాదిత సుంకాలు 10 శాతం నుంచి 12.5 శాతం వరకూ ఉంటాయని ప్రభుత్వ ఫైలింగ్ ద్వారా తెలిసింది.
ఏఏ దేశాలపై ఎంత సుంకం..?
వెట్టికాచిరీ నిరోధించడంలో విఫలమయ్యాయన్న ఆరోపణలపై సుమారు 60 దేశాలపై యూఎస్ ట్రేడ్ రెప్రజెంటేటివ్ దర్యాప్తు చేసింది. ప్రపంచవ్యాప్తంగా 54 దేశాలు 'బలవంతపు శ్రమ' (Forced Labour) ద్వారా తయారయ్యే వస్తువుల దిగుమతులను సమర్థవంతంగా నిషేధించడానికి లేదా నిరోధించడానికి తగిన చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యాయని గుర్తించింది. ఈ మేరకు ఆయా దేశాలపై 12.5 శాతం అదనపు సుంకాలను ప్రతిపాదించింది.
ఈ జాబితాలో భారత్ సహా చైనా, జపాన్, బంగ్లాదేశ్, వియత్నాం, తైవాన్, ఇరాక్, ఇజ్రాయెల్, ఖతార్, రష్యా, సౌదీ అరేబియా, సింగపూర్, యూఏఈ, యూకే, దక్షిణ కొరియా, బ్రెజిల్, స్విట్జర్లాండ్ తదితర దేశాలు ఉన్నాయి. ఇక, కెనడా, ఈక్వెడార్, ఈయూ, ఇండోనేసియా, మెక్సికో, పాకిస్థాన్ దేశాలు నిషేధం విధించినప్పటికీ.. వాటిని సమర్థవంతంగా అమలు చేయడంలో విఫలమైనట్లు యూఎస్ ట్రేడ్ రెప్రజెంటేటివ్ పేర్కొంది. అందువల్ల ఆయా దేశాలపై 10శాతం అదనపు సుంకాలు విధించాలని ప్రతిపాదించింది.
భారతీయ వ్యాపారాలపై తీవ్ర ప్రభావం..
ఇదిలా ఉండగా.. భారత్, అమెరికాల మధ్య ప్రతిపాదిత ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై న్యూఢిల్లీలో కీలకమైన ఉన్నత స్థాయి చర్చలు జరుగుతున్న తరుణంలో ఈ అదనపు సుంకాలు సాగుతున్న చర్చలపై ప్రభావం చూపే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, కొత్త సుంకాలు వెంటనే అమల్లోకి రావు. ఈ ప్రతిపాదిత సుంకాలపై జులై మొదటి వారం వరకు ప్రజాభిప్రాయ సేకరణ (Public Comments), సమీక్షలు జరగనున్నాయి, ఆ తర్వాతే ఇవి అధికారికంగా అమలులోకి వస్తాయి. ఒకవేళ ఈ అదనపు పన్నులు అమలైతే భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే వస్తువుల ధరలు పెరిగి భారతీయ వ్యాపారాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది.
Also Read..
స్థిరంగా కొనసాగుతున్న బంగారం, వెండి ధరలు.. మార్కెట్ల దిశ ఎటు వైపు..?
సోమాజీగూడలో కేటీఆర్ Meet The Press.. లైవ్
గ్రాడ్యుయేషన్ వేడుకలో ప్రేయసికి పైలట్ ప్రపోజల్.. మోకాళ్లపై కూర్చొని
తాజావార్తలు
- ●Mumbai Water Crisis | ముంబై మహా నగరానికి ముంచుకొస్తున్న నీటి గండం? దారుణంగా పడిపోయిన నీటి మట్టాలు
- ●Kevin Kunta | రామ్ చరణ్ బాడీగార్డ్ కెవిన్ కుంట ఎవరు? 'పెద్ది' ఈవెంట్లో జాన్వీ కపూర్‌ను ఎలా కాపాడాడు?
- ●DK Shivakumar | కర్నాటకలో కొలువుదీరిన కొత్త సర్కారు.. విద్య, ఉద్యోగం, రైతులపై డీకే ఫోకస్..!
- ●Raghunandan Rao | రేవంత్ నాయకత్వంలో కాంగ్రెస్‌కు ఇవే చివరి ఎన్నికలు: ఎంపీ రఘునందన్ రావు
- ●Foreigners’ Registration | ఆ పత్రాలు సమర్పించాల్సిందే.. ఇమ్మిగ్రేషన్ చట్టంపై పోలీసుల వార్నింగ్..!
- ●Accident | అమెరికాలో కారు ప్రమాదం.. మాజీ ఎంపీ సతీమణి సుచియాష్కీకి గాయాలు

Mumbai Water Crisis | ముంబై మహా నగరానికి ముంచుకొస్తున్న నీటి గండం? దారుణంగా పడిపోయిన నీటి మట్టాలు

Kevin Kunta | రామ్ చరణ్ బాడీగార్డ్ కెవిన్ కుంట ఎవరు? 'పెద్ది' ఈవెంట్లో జాన్వీ కపూర్‌ను ఎలా కాపాడాడు?

DK Shivakumar | కర్నాటకలో కొలువుదీరిన కొత్త సర్కారు.. విద్య, ఉద్యోగం, రైతులపై డీకే ఫోకస్..!

Raghunandan Rao | రేవంత్ నాయకత్వంలో కాంగ్రెస్‌కు ఇవే చివరి ఎన్నికలు: ఎంపీ రఘునందన్ రావు






