H-1B Visa | ఫీజు భారీగా పెంచినా H-1B వీసాలకు తగ్గని డిమాండ్.. ఏడాదిలో 2 లక్షల దరఖాస్తులు
H-1B Visa | ప్రత్యేక నైపుణ్యంగల విదేశీ ఉద్యోగులకు ఉద్దేశించిన హెచ్-1బీ వీసా (H-1B Visa) ఫీజును లక్ష డాలర్లకు పెంచినా.. వాటికి డిమాండ్ మాత్రం తగ్గడం లేదు. ప్రస్తుత ఆర్థిక ఏడాదిలో హెచ్1-బీ వీసా కోసం ఏకంగా రెండు లక్షల మందికి పైగా దరఖాస్తులు (H-1B applicants) వచ్చినట్లు అమెరికా ప్రభుత్వం తాజాగా వెల్లడించింది.
H-1B Visa | వలసలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రత్యేక నైపుణ్యంగల విదేశీ ఉద్యోగులకు ఉద్దేశించిన హెచ్-1బీ వీసా (H-1B Visa) ఫీజును భారీగా పెంచిన విషయం తెలిసిందే. ఏకంగా లక్ష డాలర్లకు పెంచారు. అయినప్పటికీ హెచ్1-బీ వీసాకు మాత్రం డిమాండ్ తగ్గట్లేదు. ప్రస్తుత ఆర్థిక ఏడాదిలో హెచ్1-బీ వీసా కోసం ఏకంగా రెండు లక్షల మందికి పైగా దరఖాస్తులు (H-1B applicants) వచ్చినట్లు అమెరికా ప్రభుత్వం తాజాగా వెల్లడించింది. అందులో దాదాపు రెండు లక్షల మంది ఒక్కొక్కరు లక్ష డాలర్లు చెల్లించినట్లు తెలిపింది.
2026 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకూ మాకు H-1B వీసాల కోసం 2,86,000 దరఖాస్తులు వచ్చాయి. వాటిలో వేగవంతమైన వీసా ప్రాసెసింగ్ కోసం 2,00,000 కంటే ఎక్కువ మంది లక్ష డాలర్లు చెల్లించారు. ఫీజు చెల్లించిన దరఖాస్తులు 15 రోజుల్లోనే ప్రాసెస్ అవుతాయి. అదే సాధారణ ప్రాసెసింగ్‌కు అయితే దాదాపు ఏడున్నర నెలల సమయం పడుతుంది అని అమెరికా హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (Department of Homeland Security) సెక్రటరీ మార్క్‌వేన్ ముల్లిన్ తెలిపారు.
అమెరికా (America)లో ఉద్యోగం చేయాలనుకునే వారికి డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) భారీ షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. విదేశీ నిపుణుల నియామకానికి జారీ చేసే హెచ్-1బీ వీసా (H1B Visa Fee) దరఖాస్తులపై వార్షిక రుసుంను లక్ష డాలర్లకు పెంచుతూ గతేడాది సంచలన నిర్ణయం తీసుకున్నారు. దీంతో అమెరికా వేదికగా పనిచేస్తున్న కంపెనీలు విదేశీ నిపుణులను నియమించుకునేందుకు జారీ చేసే ఒక్కో వీసాకు లక్ష డాలర్లు చెల్లించాల్సి వచ్చింది. దరఖాస్తు చేసుకొనే సమయంలో కట్టాల్సిన వన్‌టైమ్ ఫీజు అది. ట్రంప్ నిర్ణయం ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే, ఆ దేశంలో ఇప్పటికే చదువుతున్న విదేశీ విద్యార్థులకు ఆ ఫీజు విషయంలో మినహాయింపు ఇచ్చింది. దేశం బయట నుంచి వచ్చే దరఖాస్తులకు మాత్రమే ఈ ఫీజు వర్తిస్తుందని అమెరికా ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది.
Also Read..
ట్రంప్ మరో బాంబ్.. భారత్‌పై 12.5 శాతం అదనపు సుంకాలకు ప్లాన్
గ్రాడ్యుయేషన్ వేడుకలో ప్రేయసికి పైలట్ ప్రపోజల్.. మోకాళ్లపై కూర్చొని
మరోసారి భగ్గుమన్న పశ్చిమాసియా.. అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ క్షిపణి దాడులు
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Telangana-Germany Partnership | తెలంగాణ-జర్మనీ మధ్య కీలక ఒప్పందం.. పెట్టుబడులకు ముందుకువచ్చిన తురింగియా..!
- ●Tummala Nageshwar Rao | తెలంగాణ - టరాబా రాష్ట్రాల మధ్య "సిస్టర్ స్టేట్" భాగస్వామ్యం : మంత్రి తుమ్మల
- ●Tadoba Tiger Reserve | 3 నెలల పాటు తడోబా టైగర్ రిజర్వ్ మూసివేత
- ●Detox Drink | వేసవిలో బెస్ట్ డిటాక్స్ డ్రింక్ ఏది? బార్లీ వాటర్ లేదా చెరకు రసం..?
- ●CM Revanth Reddy | ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో సీఎం పర్యటన.. రెండురోజుల షెడ్యూల్ ఇదే..
- ●Ponguleti Srinivasa Reddy | 5 నుంచి అమల్లోకి రానున్న సవరించిన భూముల ధరలు : మంత్రి పొంగులేటి

Telangana-Germany Partnership | తెలంగాణ-జర్మనీ మధ్య కీలక ఒప్పందం.. పెట్టుబడులకు ముందుకువచ్చిన తురింగియా..!

Tummala Nageshwar Rao | తెలంగాణ - టరాబా రాష్ట్రాల మధ్య "సిస్టర్ స్టేట్" భాగస్వామ్యం : మంత్రి తుమ్మల

Tadoba Tiger Reserve | 3 నెలల పాటు తడోబా టైగర్ రిజర్వ్ మూసివేత

Detox Drink | వేసవిలో బెస్ట్ డిటాక్స్ డ్రింక్ ఏది? బార్లీ వాటర్ లేదా చెరకు రసం..?






