Manushi Chhillar | నేనూ పేపర్ లీక్ బాధితురాలినే.. విద్యార్థుల బాధ నాకు తెలుసు : బాలీవుడ్ నటి
Manushi Chhillar | తానూ నీట్ పేపర్ లీక్ (NEET Paper Leak) బాధితురాలినేనని బాలీవుడ్ నటి, మాజీ మిస్ వరల్డ్ మానుషి చిల్లర్ (Manushi Chhillar) తెలిపారు. 2015లో పేపర్ లీక్ వల్ల నీట్ పరీక్షను 45 రోజుల్లోనే రెండుసార్లు రాసినట్లు చెప్పారు. ఆ సమయం తన జీవితంలో అత్యంత కష్టమైన దశల్లో ఒకటని తెలిపారు. ఇప్పటికీ విద్యార్థులు ఇలాంటి కఠిన పరిస్థితులు ఎదుర్కోవడం బాధాకరమన్నారు.
Manushi Chhillar | త్రినేత్ర.న్యూస్ : తానూ నీట్ పేపర్ లీక్ బాధితురాలినేనని బాలీవుడ్ నటి, మాజీ మిస్ వరల్డ్ మానుషి చిల్లర్ (Manushi Chhillar) తెలిపారు. పేపర్ లీక్ ఘటన తన జీవితాన్నే తలకిందలు చేసిందన్నారు. ఎంబీబీఎస్ చేయాలన్న తన కల కోసం తనకు ఇష్టమైన పెయింటింగ్, కూచిపూడిని కూడా పక్కన పెట్టాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు.
నటి సోహా అలీ ఖాన్ పాడ్‌కాస్ట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేపర్ లీక్ వల్ల తనకు ఎదురైన అనుభవాలను మానుషి చిల్లర్ గుర్తు చేసుకున్నారు. 2015లో నీట్ పరీక్ష రాసినట్లు చెప్పారు. అయితే, ఎగ్జామ్ అయ్యాక పేపర్ లీక్ కావడంతో మళ్లీ 45 రోజుల్లో పరీక్ష రాయాల్సి వచ్చిందన్నారు. ఆ సమయం తన జీవితంలో అత్యంత కష్టమైన దశల్లో ఒకటని చెప్పారు. "డాక్టర్ కావాలనే కల కోసం ప్రతి చిన్న సంతోషాన్ని త్యాగం చేయాల్సి వచ్చింది. నాకు ఎంతో ఇష్టమైన కూచిపూడి డ్యాన్స్, పెయింటింగ్‌ను పక్కన పెట్టాల్సి వచ్చింది. ఏడాది పాటూ ఎంతో కష్టపడి నీట్‌కు ప్రిపేర్ అయ్యాను. పరీక్ష రాసిన తర్వాత పేపర్ లీక్ అయినట్లు తెలిసింది.
మళ్లీ 45 రోజుల్లో ఎగ్జామ్ రాయాల్సి రావడం నా జీవితంలో అత్యంత కష్టమైన దశల్లో ఒకటి. నా తల్లిదండ్రులు ఇద్దరూ డాక్టర్లు కావడంతో వారి పూర్తి సహకారం నాకు లభించింది. అయితే, ఇప్పటికీ విద్యార్థులు ఇలాంటి కఠిన పరిస్థితులు ఎదుర్కోవడం బాధాకరం. పరీక్షల కోసం మళ్లీ మళ్లీ చదవడం వల్ల విద్యార్థులు తీవ్రమైన ఒత్తిడి, ఆందోళనను ఎదుర్కొంటారు" అంటూ మానుషి చెప్పుకొచ్చారు. ఇతర విద్యార్థులతో పోలిస్తే తాను ఎదుర్కొన్న కష్టం చాలా చిన్నదని చెప్పారు. ప్రస్తుతం నీట్ లీకేజీల వల్ల విద్యార్థులు ఎదుర్కొంటున్న మానసిక ఆందోళనలు, ఒత్తిడి తనకు తెలుసని అన్నారు. అందుకే పేపర్ లీక్‌లకు వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతున్న విద్యార్థులకు ఆమె పూర్తి మద్దతు ప్రకటించారు. నీట్ పేపర్ లీక్ ఘటనపై ఆందోళనల కొనసాగుతున్న వేళ మానుషి వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది.
హర్యానాకు చెందిన మానుషి చిల్లర్ మెడికల్ స్టూడెంట్‌గా ఎంబీబీఎస్ చదువుతున్న సమయంలోనే మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టారు. 2017లో జరిగిన ప్రతిష్టాత్మక 'మిస్ వరల్డ్' (Miss World 2017) కిరీటాన్ని కైవసం చేసుకున్నారు. రీటా ఫరియా, ఐశ్వర్య రాయ్, డయానా హెడెన్, యుక్తా ముఖి, ప్రియాంక చోప్రా తర్వాత ఈ ఘనత సాధించిన ఆరో భారతీయురాలిగా ఆమె రికార్డు సృష్టించారు. ఆ తర్వాత బాలీవుడ్‌లో అవకాశాలు రావడంతో చదువును మధ్యలోనే వదిలేసి సినీ రంగంలోకి అడుగుపెట్టారు. పలు చిత్రాలతో ప్రేక్షకులకు దగ్గరయ్యారు.
Also Read..
ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు.. నన్ను క్షమించండి అంటూ వీడియో రిలీజ్ చేసిన 15 ఏళ్ల బాలిక
ఏబీబీ ఇండియా భారీ డివిడెండ్.. ఒక్కో షేరుకు రూ.90.. రికార్డ్ డేట్ ఎప్పుడంటే..
స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. వారాంతంలో ప్రతికూల సంకేతాలు..?
సంబంధిత వార్తలు

Students Protest Against Dipke | నీట్ అంశంపై ఎందుకు మౌనంగా ఉన్నారు..? అభిజీత్ దిప్కేకి వ్యతిరేకంగా విద్యార్థుల నిరసన
అక్టోబర్ 2, 2026

Balmoor Venkat | విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు.. మీ లడాయి ఎక్కడికి పోయింది?.. బీజేపీ నేతలపై బల్మూర్ వెంకట్ ఆగ్రహం
ఆగస్టు 24, 2026

NEET System | నీట్ పరీక్షా విధానం అత్యంత సురక్షితం.. సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్ర ప్రభుత్వం
ఆగస్టు 19, 2026
తాజావార్తలు
- ●Tiger | అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో పెద్ద పులి దర్శనం..
- ●CM Revanth Reddy | కొత్త ఆస్పత్రుల్లో అత్యాధునిక పరికరాలు సమకూర్చండి
- ●Captain Smit Machchhar | భారత పైలట్ స్మిత్ మచ్చర్‌ను ఆస్పత్రిలో పరామర్శించి ప్రశంసించిన దుబాయ్ యువరాజు
- ●Artificial Intelligence | ఏఐతో ఆర్థిక నిపుణుల కొలువులకు ఎసరు.. స్వల్ప ఛార్జీలకే సలహాలు..
- ●Gym Trainer Arrest | యువతి అశ్లీల ఫొటో వాట్సాప్‌లో షేర్.. జిమ్ ట్రైనర్ అరెస్ట్
- ●Dulquer Salmaan | తండ్రీకొడుకుల బాక్సాఫీస్ వార్ - ఒకే రోజు థియేటర్లలోకి మమ్ముట్టి, దుల్కర్ సల్మాన్ సినిమాలు

Tiger | అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో పెద్ద పులి దర్శనం..

CM Revanth Reddy | కొత్త ఆస్పత్రుల్లో అత్యాధునిక పరికరాలు సమకూర్చండి

Captain Smit Machchhar | భారత పైలట్ స్మిత్ మచ్చర్‌ను ఆస్పత్రిలో పరామర్శించి ప్రశంసించిన దుబాయ్ యువరాజు

Artificial Intelligence | ఏఐతో ఆర్థిక నిపుణుల కొలువులకు ఎసరు.. స్వల్ప ఛార్జీలకే సలహాలు..



