Gold And Silver Prices Today | స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. వారాంతంలో ప్రతికూల సంకేతాలు..?
Gold And Silver Prices Today | పశ్చిమ ఆసియాలో అమెరికా-ఇరాన్‌ల మధ్య యుద్ధ ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ గత వారం వరుసగా 5 సెషన్లలో ఈక్విటీ మార్కెట్లు ర్యాలీని కొనసాగించాయి. దీంతో బులియన్ మార్కెట్లలోనూ జోరు కనిపించింది.
Gold And Silver Prices Today | పశ్చిమ ఆసియాలో అమెరికా-ఇరాన్‌ల మధ్య యుద్ధ ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ గత వారం వరుసగా 5 సెషన్లలో ఈక్విటీ మార్కెట్లు ర్యాలీని కొనసాగించాయి. దీంతో బులియన్ మార్కెట్లలోనూ జోరు కనిపించింది. అయితే వారాంతంలో ప్రతికూల సంకేతాలు వెలువడడంతో అమెరికా ఈక్విటీ మార్కెట్లు మిశ్రమ ఫలితాలతో ముగియగా, బులియన్ మార్కెట్లు నెగెటివ్‌గా స్థిరపడ్డాయి. పెట్టుబడిదారులపై అమ్మకాల ఒత్తిడి నెలకొనడంతో లాభాల స్వీకరణకు మొగ్గు చూపారు. దీంతో బంగారం, వెండి ధరల్లో స్వల్ప తగ్గుదల చోటు చేసుకుంది. అయితే వచ్చే వారం మార్కెట్లకు చాలా కీలకమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇక అంతర్జాతీయ బులియన్ మార్కెట్‌లలో ఔన్స్ బంగారం ధర 1.42 శాతం మేర తగ్గి 4,045 డాలర్లకు చేరగా వెండి ధర 2.30 శాతం మేర పతనమై 57 డాలర్లకు దిగి వచ్చింది. దేశీయ కమోడిటీ మార్కెట్ ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 144 పాయింట్ల మేర స్వల్పంగా పెరిగి 1,43,376 వద్ద ముగియగా, సిల్వర్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 2,769 పాయింట్లు తగ్గి 2,17,198 వద్ద స్థిరపడింది. దేశీయ స్పాట్ మార్కెట్‌లో బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల చోటు చేసుకోగా, వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు.
స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు..
24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.14,422 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,15, 376గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,44,220 గా ఉంది. 100 గ్రాముల బంగారం ధర రూ.14,42,200 గా ఉంది. ఇది కిందటి రోజు ముగింపుతో పోలిస్తే రూ.3,800 తగ్గింది.
22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.13,220 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,05,760గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,32,200 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.13,22,000గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.3,500 తగ్గింది.
18 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.10,816 ఉండగా, 8 గ్రాముల ధర రూ.86,528గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,08,160 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.10,81,600గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.2900 తగ్గింది.
దేశీయ మార్కెట్‌లో 1 కిలో వెండి ధర రూ.2,35,000 ఉండగా, తులం ధర రూ.2,350గా ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే వెండి ధరలో ఎలాంటి మార్పు లేదు. హైదరాబాద్‌లో 1 కిలో వెండి ధర రూ.2,34,900 ఉండగా, తులం ధర రూ.2,349 గా ఉంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Gold And Silver Prices Today | ఒక్క రోజులోనే రూ.11వేలు తగ్గిన బంగారం ధర.. అమెరికా బాండ్ ఈల్డ్స్ ఎఫెక్ట్..
అక్టోబర్ 3, 2026

Harish Rao | ఒక సామాజిక సమస్యకు కేసీఆర్ చూపిన శాశ్వత పరిష్కారమే.. కల్యాణ లక్ష్మీ: హరీశ్ రావు
అక్టోబర్ 2, 2026

Gold And Silver Prices Today | పసిడికి మళ్లీ పెరుగుతున్న డిమాండ్.. ఒక్క రోజులోనే రూ.10వేలు జంప్..
అక్టోబర్ 2, 2026
తాజావార్తలు
- ●Priyanka Chopra | ప్రియాంక చోప్రా తమిళ మూవీ - దళపతి విజయ్ హీరో - యూట్యూబ్‌లో ఫ్రీ స్ట్రీమింగ్
- ●Akbaruddin Owaisi | నా వయసైపోయింది.. ఇక వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను: అక్బరుద్దీన్ ఓవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు
- ●Men's Hockey Team | ఆసియా క్రీడల్లో హాకీ గోల్డ్.. మలేసియాపై భారత్ సూపర్ విక్టరీ.. ఒలింపిక్స్‌కు అర్హత
- ●ఆఫర్లో కొన్నారా.. ఆఫర్ చూసి కొన్నారా? పండుగ షాపింగ్‌లో అసలు లెక్క ఇదే!
- ●Tiger | అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో పెద్ద పులి దర్శనం..
- ●CM Revanth Reddy | కొత్త ఆస్పత్రుల్లో అత్యాధునిక పరికరాలు సమకూర్చండి

Priyanka Chopra | ప్రియాంక చోప్రా తమిళ మూవీ - దళపతి విజయ్ హీరో - యూట్యూబ్‌లో ఫ్రీ స్ట్రీమింగ్

Akbaruddin Owaisi | నా వయసైపోయింది.. ఇక వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను: అక్బరుద్దీన్ ఓవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు

Men's Hockey Team | ఆసియా క్రీడల్లో హాకీ గోల్డ్.. మలేసియాపై భారత్ సూపర్ విక్టరీ.. ఒలింపిక్స్‌కు అర్హత

ఆఫర్లో కొన్నారా.. ఆఫర్ చూసి కొన్నారా? పండుగ షాపింగ్‌లో అసలు లెక్క ఇదే!



