త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Lakshmi Manchu | మంచు ల‌క్ష్మి ఇంట శుభ‌కార్యం.. ఆక‌ట్టుకుంటున్న ఫొటోలు

Lakshmi Manchu | టాలీవుడ్ న‌టి, కలెక్షన్ కింగ్ మోహ‌న్ బాబు కుమార్తె మంచు ల‌క్ష్మి (Lakshmi Manchu) ఇంట శుభ‌కార్యం జ‌రిగింది. ల‌క్ష్మి కుమార్తె విద్య నిర్వాణ (Vidya Nirvana) ఓణీల వేడుక (half saree ceremony)ను కుటుంబ స‌భ్యులు ఘనంగా నిర్వ‌హించారు.

D

Movies | Published On Mar 18, 2026, 4.32 pm IST

Lakshmi Manchu | మంచు ల‌క్ష్మి ఇంట శుభ‌కార్యం.. ఆక‌ట్టుకుంటున్న ఫొటోలు
Advertisement

Lakshmi Manchu | టాలీవుడ్ న‌టి, కలెక్షన్ కింగ్ మోహ‌న్ బాబు కుమార్తె మంచు ల‌క్ష్మి (Lakshmi Manchu) ఇంట శుభ‌కార్యం జ‌రిగింది. ల‌క్ష్మి కుమార్తె విద్య నిర్వాణ (Vidya Nirvana) ఓణీల వేడుక (half saree ceremony)ను కుటుంబ స‌భ్యులు ఘనంగా నిర్వ‌హించారు. హైద‌రాబాద్‌లోని ఓ రిసార్ట్‌లో ఈనెల 15న ఈ వేడుక అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగింది. అతి కొద్ది మంది స్నేహితులు, బంధుమిత్రుల స‌మ‌క్షంలో ఈ కార్య‌క్ర‌మాన్ని సంప్ర‌దాయ‌బ‌ద్దంగా నిర్వ‌హించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

మంచు ఫ్యామిలీ మెంబ‌ర్స్ మొత్తం వేడుక‌ల్లో పాల్గొన్న‌ట్లు తెలుస్తోంది. మేన‌మామ‌గా మంచు మ‌నోజ్ త‌న మేన‌కోడ‌లిని ప‌ల్ల‌కిలో వేదిక‌పైకి తీసుకొచ్చారు. మంచు విష్ణు ఫ్యామిలీ కూడా ఈవెంట్‌కు అటెండ్ అయిన‌ట్లుగా ఫొటోల‌ను బ‌ట్టి తెలుస్తోంది. వేడుక‌ల్లో విద్య నిర్వాణ ఎంతో అందంగా అచ్చ‌మైన తెలుగ‌మ్మాయిలా ముస్తాబై ఆక‌ట్టుకుంది. ముఖ్యంగా ఈ ఈవెంట్ డెకరేషన్ అందరినీ విపరీతంగా ఆకట్టుకుంది. తాజా పూలు, అరిటాకులతో అచ్చమైన సౌత్ ఇండియన్ ట్రెడిషనల్ స్టైల్‌లో మండపాన్ని ముస్తాబు చేశారు.

Also Read..

రిఫైన‌రీల్లో 40శాతం పెరిగిన ఎల్‌పీజీ ఉత్ప‌త్తి.. పుకార్ల‌ను న‌మ్మొద్ద‌ని కేంద్రం విజ్ఞ‌ప్తి..!

టాలీవుడ్ సినీ అభిమానులకు షాకిచ్చిన ధురంధర్ టీమ్.. తెలుగులో రిలీజ్ లేనట్టేనా?

త్వరలో డిజిటల్ మీడియా పాలసీ : మంత్రి పొంగులేటి

Advertisement

తాజావార్తలు

Advertisement