త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ponguleti Srinivas Reddy | త్వరలో డిజిటల్ మీడియా పాలసీ : మంత్రి పొంగులేటి

Ponguleti Srinivas Reddy | వచ్చే రెండు, మూడు నెలల్లో డిజిటల్ మీడియా పాలసీని తీసుకు రాబోతున్నామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, పౌర సంబంధాల శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రకటించారు.

S

Telangana | Published On Mar 18, 2026, 3.55 pm IST

Ponguleti Srinivas Reddy | త్వరలో డిజిటల్ మీడియా పాలసీ : మంత్రి పొంగులేటి
Advertisement

Ponguleti Srinivas Reddy | త్రినేత్ర‌.న్యూస్ : వచ్చే రెండు, మూడు నెలల్లో డిజిటల్ మీడియా పాలసీని తీసుకు రాబోతున్నామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, పౌర సంబంధాల శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రకటించారు. జర్నలిస్టుల సమస్యలపై శాసన మండలిలో మంగళవారం నాడు పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి పొంగులేటి సమాధానం ఇచ్చారు.

జర్నలిస్టు మిత్రులకు భద్రత కల్పించే విషయములో ఈ ప్రభుత్వం ఎలాంటి రాజీ పడబోదని స్పష్టం చేశారు. అక్రిడేషన్ కార్డుల జారీ విషయములో కొంత మంది లేనిపోని అపోహలను సృష్టిస్తున్నారు. అర్హులైన జర్నలిస్టులందరికి అక్రిడేషన్ కార్డులు జారీచేస్తాం. ఎలాంటి భేష‌జాల‌కు పోకుండా మొదట విడుదల చేసిన జీవోపై అన్ని జర్నలిస్టుల సంఘాల అభిప్రాయాలను, సూచనలను తీసుకొని జీవోలో మార్పులు చేర్పులు చేశాం. డెస్క్ జర్నలిస్టులు మరో జర్నలిస్టులనే తేడ మా ప్రభుత్వానికి లేదన్నారు. ఇండ్ల స్థలాల విషయములో కూడా సానుకూల నిర్ణయం తీసుకుంటామని ఇప్పటికి ఈ విషయములో ముఖ్యమంత్రి స్పష్టత ఇచ్చారని, న్యాయస్థానం పరిధిలో ఇబ్బందులు లేకుండా ఇండ్ల స్థలాలు ఇవ్వడానికి కార్యాచరణ సిద్దం చేస్తున్నామని వెల్లడించారు.

Advertisement

తాజావార్తలు

Advertisement