Dhurandhar The Revenge | టాలీవుడ్ సినీ అభిమానులకు షాకిచ్చిన ధురంధర్ టీమ్.. తెలుగులో రిలీజ్ లేనట్టేనా?
ఓవైపు ఉగాది, మరోవైపు రంజాన్ పండుగల నేపథ్యంలో రిలీజ్ అవుతున్న ఈ మూవీ ప్రేక్షకులను ఏమేరకు ఆకట్టుకుంటుందో తెలియాలంటే ఇంకొన్ని గంటలు ఆగాల్సిందే.
Dhurandhar The Revenge | బాలీవుడ్ మూవీ ధురంధర్ తొలి పార్ట్ రిలీజ్ అయి ఎన్ని సంచలనాలు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పార్ట్ వన్ మూవీ 1400 కోట్ల వరకు వసూళ్లను రాబట్టింది. బాలీవుడ్ హిస్టరీలోనే హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన మూవీ ఇది. ఆపరేషన్ ధురంధర్ పేరుతో భారత ఇంటెలిజెన్స్ బ్యూరో చేపట్టిన సీక్రెట్ మిషన్ నేపథ్యంలో స్పై యాక్షన్ డ్రామాగా ఈ మూవీ తెరకెక్కింది. ఆదిత్య ధర్ డైరెక్టర్. ఇందులో హమ్జా అనే క్యారెక్టర్లో బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ నటించాడాు. ఈ మూవీ క్రేజ్‌ని దృష్టిలో ఉంచుకొని మూవీ యూనిట్ సెకండ్ పార్ట్‌ని కూడా తీసుకొస్తోంది. ఈ మూవీ కూడా పాన్ ఇండియా లేవల్లో విడుదల కాబోతోంది. మార్చి 19న రిలీజ్ కానుంది. అయితే.. ఈ మూవీకి బాలీవుడ్‌తో పాటు సౌత్‌లోనూ భారీ క్రేజ్ ఏర్పడింది. ఈనేపథ్యంలో తెలుగు, తమిళంలోనూ ఈ మూవీని రిలీజ్ చేసేందుకు మూవీ మేకర్స్ ముందు ప్లాన్ చేశారు. హిందీతో పాటు తెలుగు, తమిళంలోనూ బుధవారం సాయంత్రం ప్రీమియర్స్ వేసేందుకు సిద్ధమయ్యారు. కానీ.. ఇప్పటి వరకు తెలుగు, తమిళం భాషల్లో డబ్బింగ్ అయిన ప్రింట్ థియేటర్లకు చేరలేదట. హిందీ వెర్షన్ మాత్రమే థియేటర్లకు చేరడంతో తెలుగు, తమిళంలో వేయాల్సిన ప్రీమియర్స్ సడెన్‌గా రద్దు చేస్తున్నట్లు మూవీ యూనిట్ ప్రకటించింది.
ఇంకా డబ్బింగ్ దశలోనే
మార్చి 19న అంటే రిలీజ్‌కి ఇంకా ఒక్క రోజు కూడా లేదు.. కానీ ఇంకా తెలుగు, తమిళం భాషల డబ్బింగ్ ఫైనల్ పోస్ట్ ప్రొడక్షన్ ఇంకా పూర్తి కాలేదట. ఫైనల్ ప్రింట్స్ రెడీ కాకపోవడంతో తెలుగు, తమిళంలో ఈ మూవీని తెలుగు రాష్ట్రాల్లో ప్రదర్శించడం కుదరటం లేదని మూవీ యూనిట్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. హిందీ వెర్షన్ మాత్రమే ప్రస్తుతానికి అందుబాటులోకి వచ్చింది. అలాగే తమిళనాడులోనూ తమిళం వెర్షన్ ప్రింట్ ఇంకా రాలేదు.

టెక్నికల్ సమస్యలే కారణమా?
ఓవైపు రీజనల్ లాంగ్వేజ్ డబ్బింగ్ పనులు పూర్తి కాలేదని మూవీ యూనిట్ చెబుతున్నా.. డబ్బింగ్ పూర్తయింది కానీ.. కొన్ని టెక్నికల్ సమస్యల వల్ల ఆ ఫైల్స్ ఆయా థియేటర్లకు డిస్ట్రిబ్యూట్ కాలేదని తెలుస్తోంది.
ఇప్పటికే టికెట్ బుక్ చేసుకున్న వాళ్ల పరిస్థితి ఏంటి?
రీజనల్ లాంగ్వేజ్ ప్రీమియర్స్‌కి టికెట్స్ బుక్ చేసుకున్న వాళ్లు హిందీ వెర్షన్లోనే మూవీ చూడాల్సి ఉంటుంది. కాకపోతే వాళ్లకు ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్ కింద వస్తాయని చెబుతున్నారు. ఒకవేళ హిందీ వెర్షన్ వద్దనుకుంటే టికెట్ డబ్బులు రిఫండ్ చేస్తామని బ్రాడ్వే సినిమాస్ ప్రకటించింది.

ఓవైపు ఉగాది, మరోవైపు రంజాన్ పండుగల నేపథ్యంలో రిలీజ్ అవుతున్న ఈ మూవీ ప్రేక్షకులను ఏమేరకు ఆకట్టుకుంటుందో తెలియాలంటే ఇంకొన్ని గంటలు ఆగాల్సిందే.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



