త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

IIFA Awards 2026 | ఐఫా అవార్డ్స్ విన్న‌ర్స్ వీళ్లే – ధురంధ‌ర్‌కు 12 అవార్డులు – టాప్ ప్లేస్‌లో షారుఖ్ త‌న‌యుడి వెబ్‌సిరీస్‌

ఐఫా అవార్డ్స్ 2026 విజేత‌ల‌ను శుక్ర‌వారం ప్ర‌క‌టించారు. ర‌ణ‌వీర్‌సింగ్ ధురంధ‌ర్ సినిమాకు 12 అవార్డులు వ‌చ్చాయి. వెబ్‌సిరీస్ కేట‌గిరీలో షారుఖ్‌ఖాన్ త‌న‌యుడు ఆర్య‌న్ ఖాన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్ అత్య‌ధిక అవార్డుల‌తో టాప్ ప్లేస్‌లో నిలిచింది.

N

Entertainment | Published On Oct 30, 2026, 7.20 pm IST

IIFA Awards 2026 | ఐఫా అవార్డ్స్ విన్న‌ర్స్ వీళ్లే – ధురంధ‌ర్‌కు 12 అవార్డులు – టాప్ ప్లేస్‌లో షారుఖ్ త‌న‌యుడి వెబ్‌సిరీస్‌
Advertisement

IIFA Awards 2026 |  ఐఫా అవార్డ్ 2026 విజేత‌ల‌ను శుక్ర‌వారం అనౌన్స్‌చేశారు. సినిమాల‌తో పాటు వెబ్‌సిరీస్‌ల‌కు (Web Series) వేర్వేరుగా అవార్డుల‌ను ప్ర‌క‌టించారు. ర‌ణ‌వీర్‌సింగ్ హీరోగా న‌టించిన ధురంధ‌ర్ (Dhurandhar)  సినిమా ఏకంగా 12 అవార్డుల‌ను గెలుచుకుంది. వెబ్‌సిరీస్ కేట‌గిరీలో షారుఖ్‌ఖాన్ త‌న‌యుడు ఆర్య‌న్ ఖాన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్ అత్య‌ధిక పుర‌స్కారాల‌ను ద‌క్కించుకుంది.

ధురంధ‌ర్ హ‌వా...

ఐఫా 2026లో ధురంధ‌ర్ హ‌వా కొన‌సాగింది. ఉత్త‌మ సినిమా, ఉత్త‌మ న‌టుడుతో మొత్తం ప‌న్నెండు విభాగాల్లో ఈ స్పై యాక్ష‌న్ మూవీ స‌త్తా చాటింది. ఉత్త‌మ న‌టుడిగా ర‌ణ‌వీర్‌సింగ్‌, ఉత్త‌మ ద‌ర్శ‌కుడిగా ఆదిత్య ధ‌ర్‌, విల‌న్‌గా అక్ష‌య్ ఖ‌న్నా ఈ అవార్డుల్లో మెరిశారు.. ధురంధ‌ర్ త‌ర్వాత సైయారా సినిమాకు ఎక్కువ అవార్డులు వ‌చ్చాయి. ఉత్త‌మ న‌టిగా సైయారా సినిమాకుగాను అనీత్ ప‌డ్డా ఐఫా అవార్డును సొంతం చేసుకుంది. బెస్ట్ మ్యూజిక్‌, ఉత్త‌మ తొలి సినిమా హీరోతో పాటు మ‌రికొన్ని విభాగాల్లో సైయారాకు అవార్డులు ద‌క్కాయి. ఉత్త‌మ తొలి సినిమా హీరోయిన్‌గా ర‌షా త‌డానీ నిలిచింది. ఇటీవ‌లే శ్రీనివాస మంగాపురం మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది ర‌షా త‌డానీ.

షారుఖ్‌ఖాన్ త‌న‌యుడు...

ఐఫా సినిమాల‌తో పాటు ఓటీటీ అవార్డుల‌ను కూడా ప్ర‌క‌టించారు. ఓటీటీ (OTT)మూవీస్‌, వెబ్‌సిరీస్‌ల‌కు వేర్వేరుగా విజేత‌ల వివ‌రాల‌ను వెల్ల‌డించారు. వెబ్‌సిరీస్ కేట‌గిరీలో షారుఖ్‌ఖాన్ త‌న‌యుడు ఆర్య‌న్ ఖాన్ ద‌ర్శ‌కుడిగా వ్య‌వ‌హ‌రించిన ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్‌కు ఐదు అవార్డుల‌తో టాప్ ప్లేస్‌లో నిలిచింది. పాతాల్ లోక్ 2కు మూడు పుర‌స్కారాలు ద‌క్కాయి. ఓటీటీ సినిమా కేట‌గిరీలో బెస్ట్ మూవీగా బారాముల్లా నిలిచింది. ఉత్త‌మ న‌టుడిగా స్టోలెన్ సినిమాకుగాను అభిషేక్ బెన‌ర్జీ అవార్డును సొంతం చేసుకున్నారు.

 

ట్యాగ్స్:

Aneet PaddaAryan KhanBads Of BollywoodBollywoodDhurandharIIFA Awards 2026 WinnersRanveer SinghSaiyaara
Advertisement
Advertisement