త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Dada Saheb Phalke Awards | ఉత్త‌మ న‌టుడిగా ర‌ణ్‌వీర్‌సింగ్‌.. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుల్లో ధురంధ‌ర్ హ‌వా..

Dada Saheb Phalke Awards | దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (DPIFF) 2026 అవార్డుల్లో `ధురంధ‌ర్` (Dhurandhar) మోత మోగించింది. ర‌ణ్‌వీర్‌సింగ్ హీరోగా ఆదిత్య‌ధ‌ర్ (Aditya Dhar) ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ స్పై యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ గతేడాది డిసెంబర్‌, ఈ ఏడాది మార్చిలో రెండు భాగాలుగా విడుద‌లై క‌లెక్ష‌న్ల సునామీ సృష్టించిన విష‌యం తెలిసిందే. ఇందులో న‌ట‌న‌కుగాను ర‌ణ్‌వీర్‌సింగ్‌ను (Ranveer Singh) ఉత్త‌మ న‌టుడి అవార్డు వ‌రించింది.

G

Entertainment | Published On Nov 21, 2026, 6.07 am IST

Dada Saheb Phalke Awards | ఉత్త‌మ న‌టుడిగా ర‌ణ్‌వీర్‌సింగ్‌.. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుల్లో ధురంధ‌ర్ హ‌వా..
Advertisement

Dada Saheb Phalke Awards | త్రినేత్ర న్యూస్‌: దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (DPIFF) 2026 అవార్డుల్లో `ధురంధ‌ర్` (Dhurandhar) మోత మోగించింది. ర‌ణ్‌వీర్‌సింగ్ హీరోగా ఆదిత్య‌ధ‌ర్ (Aditya Dhar) ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ స్పై యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ గతేడాది డిసెంబర్‌, ఈ ఏడాది మార్చిలో రెండు భాగాలుగా విడుద‌లై క‌లెక్ష‌న్ల సునామీ సృష్టించిన విష‌యం తెలిసిందే. ఇందులో న‌ట‌న‌కుగాను ర‌ణ్‌వీర్‌సింగ్‌ను (Ranveer Singh) ఉత్త‌మ న‌టుడి అవార్డు వ‌రించింది. అలాగే ఆదిత్యధర్ ఉత్తమ దర్శకుడిగా, ఉత్తమ ప్రతినాయకుడిగా అక్షయ్‌ ఖన్నా, ఉత్తమ సంగీత దర్శకుడిగా శాశ్వత్‌ సచ్‌దేవ్ ఎంపిక‌య్యారు. మొత్తంగా ఈ మూవీ ఉత్త‌మ చిత్రం స‌హా ఐదు అవార్డులు ద‌క్కించుకుంది.

ఇక `స‌యారా`లో న‌ట‌న‌కుగాను ఉత్త‌మ న‌టి అవార్డును అనీత్ ప‌డ్డా (Aneet Padda) సొంతం చేసుకుంది. ప్ర‌ముఖ గాయ‌ని టేల‌ర్ స్విఫ్ట్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఆర్టిస్ట్ ఆఫ్ ది ఇయ‌ర్ అవార్డుకు ఎంపిక‌య్యారు. క్రిటిక్స్ బెస్ట్ ఫిల్మ్‌, క్రిటిక్స్ బెస్ట్ యాక్ట‌ర్‌, ఉత్తమ సినిమాటోగ్రాఫర్ విభాగాల్లో కాంతారా చాప్ట‌ర్1 అవార్డులు గెలుచుకుంది. భారతీయ సినిమా పితామహుడిగా ప్రసిద్ధి చెందిన దాదాసాహెబ్ ఫాల్కే (Dada Saheb Phalke Awards) పేరుతో ఈ ఫెస్టివల్‌ను నిర్వహిస్తున్నారు. దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌ ద్వారా భారతీయ సినిమా, వినోద రంగంలో ప్రతిభ కనబర్చిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు ఈ పురస్కారం అందిస్తున్నారు.

అవార్డు విజేత‌లు..

ఉత్తమ సినిమా- ధురంధర్‌
ఉత్తమ నటుడు- రణ్‌వీర్‌ సింగ్‌ (ధురంధర్‌)
ఉత్తమ నటి- అనీత్‌ పడ్డా (సయారా)
ఉత్తమ దర్శకుడు- ఆదిత్య ధర్‌ (ధురంధర్‌)
ఉత్తమ సహాయ నటుడు- వినీత్‌ కుమార్‌ సింగ్‌ (ఛావా)
ఉత్తమ ప్రతినాయకుడు- అక్షయ్‌ ఖన్నా (ధురంధర్‌)
హాస్య ప్రధాన పాత్రలో ఉత్తమ నటుడు- రితేశ్‌ దేశ్‌ముఖ్‌ (హౌస్‌ఫుల్‌ 5)
ఉత్తమ సంగీత దర్శకుడు- శాశ్వత్‌ సచ్‌దేవ్‌ (ధురంధర్‌)
క్రిటిక్స్‌ బెస్ట్‌ ఫిల్మ్‌- కాంతార: చాప్టర్‌1
క్రిటిక్స్‌ బెస్ట్ యాక్టర్‌- రిషబ్‌శెట్టి (కాంతార: చాప్టర్‌1)
క్రిటిక్స్‌ బెస్ట్‌ యాక్టర్‌- యామి గౌతమ్‌ధర్‌ (హక్‌)

ప్రొడ్యూసర్‌ ఆఫ్‌ ది ఇయర్‌- ఆదిత్యధర్‌, జ్యోతి దేశ్‌పాండే, లోకేశ్‌ధర్ (ధురంధర్‌)
ఉత్తమ కొరియోగ్రఫీ- శాండీ మాస్టర్‌ (కూలీ-మోనికా బెలూసీ)
ఉత్తమ సినిమాటోగ్రాఫర్‌- అరవింద్‌ ఎస్‌.కశ్యప్‌ (కాంతార: చాప్టర్‌1)
ఉత్తమ్‌ స్క్రీన్‌ప్లే అండ్‌ డైలాగ్‌- రీషు నాథ్‌ (హక్‌)
ఉత్తమ గేయ రచయిత- ఇర్షద్‌ కమిల్‌ (సయారా)
ఉత్తమ నేపథ్య గాయకుడు- ఫహీమ్‌ అబ్దుల్లా (సయారా)
ఆర్టిస్ట్‌ ఆఫ్‌ ది ఇయర్‌- కరణ్ ఆజ్లా
సాంగ్‌ ఆఫ్‌ ది ఇయర్‌- సయారా
కమెడియన్‌ ఆఫ్‌ ది ఇయర్‌- సామే రైనా

అవుట్‌స్టాండింగ్‌ కాంట్రిబ్యూషన్‌ ఇన్‌ మ్యూజిక్‌ ఇండస్ట్రీ- ఇళయరాజా
అవుట్‌ స్టాండింగ్‌ కాంట్రిబ్యూషన్‌ ఇన్‌ ఫిల్మ్‌ ఇండస్ట్రీ- కమల్‌హాసన్

ఉత్తమ ఇంటర్నేషనల్‌ ఫీచర్‌ ఫిల్మ్‌- అవతార్‌: ఫైర్‌ అండ్‌ యాష్
ఉత్తమ దర్శకుడు (ఇంటర్నేషనల్‌ ఫీచర్‌ ఫిల్మ్‌)- వన్‌ బ్యాటిల్‌ ఆఫ్టర్‌ అనదర్‌
ఉత్తమ నటుడు (ఇంటర్నేషనల్‌ ఫీచర్‌ ఫిల్మ్‌)- మైకేల్‌ బి.జోర్దాన్‌ (సిన్నర్స్‌)
ఉత్తమ నటి (ఇంటర్నేషనల్‌ ఫీచర్‌ ఫిల్మ్‌)- జెస్సీ బక్లే (హ్యామ్‌నెట్‌)
అవుట్‌ స్టాండింగ్‌ కాంట్రిబ్యూషన్‌ ఇన్‌ గ్లోబల్‌ సినిమా- జేమ్స్‌ కామెరూన్‌

ఓటీటీ విభాగంలో విజేతలు

ఉత్తమ వెబ్‌సిరీస్‌- ది బ్యాడ్స్‌ ఆఫ్ బాలీవుడ్‌
ఉత్తమ దర్శకుడు- ఆర్యన్‌ఖాన్‌ (ది బ్యాడ్స్‌ ఆఫ్ బాలీవుడ్‌)
ఉత్తమ నటుడు- జైదీప్‌ అహ్లావత్‌ (పాతాళ్‌ లోక్‌ సీజన్‌2)
ఉత్తమ నటి- షెఫాలీ షా (ఢిల్లీ క్రైమ్‌ సీజన్‌3)
ఉత్తమ సహాయ నటుడు- వినయ్‌ పాఠక్‌ (గ్రామ్‌ చికిత్సాలయ్)
ఉత్తమ ప్రతినాయకురాలు- హ్యుమా ఖురేషి (ఢిల్లీ క్రైమ్‌ సీజన్‌3)
టెలివిజన్‌ సిరీస్‌ ఆఫ్ ది ఇయర్‌- తారక్ మెహతా కా ఉల్టా ఛష్మా
ఉత్తమ నటుడు (టెలివిజన్‌ సిరీస్‌)- అమర్‌ ఉపాధ్యాయ్‌ (క్యోంకీ సాస్ భీ కభీ బహు థీ 2)
ఉత్తమ నటి (టెలివిజన్‌ సిరీస్‌)- స్మృతి ఇరానీ (క్యోంకీ సాస్ భీ కభీ బహు థీ 2)

Advertisement
Advertisement