Ranveer Singh | సినిమా షూటింగ్ కోసం క్రికెట్ మ్యాచ్‌లు వాయిదా – వివాదంలో రణవీర్‌సింగ్ “ప్రళయ్”
రణవీర్‌సింగ్ హీరోగా నటిస్తోన్న ప్రళయ్ మూవీ వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమా షూటింగ్ ముంబైలోని ఆజాద్ స్టేడియంలో జరుగుతోంది. ఈ షూటింగ్ కోసం స్టేడియం లో జరగాల్సిన అండర్ 14తో పాటు అండర్ 16 మ్యాచ్‌లను రద్దు చేయడంపై ముంబై క్రికెట్ అసోసియేషన్ అగ్రహం వ్యక్తం చేస్తోంది.
Entertainment | Published On Nov 6, 2026, 3.33 pm IST
Ranveer Singh |ధురంధర్, ధురంధర్ 2 బ్లాక్‌బస్టర్స్ తర్వాత రణవీర్‌సింగ్ హీరోగా నటిస్తోన్న ప్రళయ్ మూవీ వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమాపై ముంబై క్రికెట్ అసోషియేషన్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ప్రస్తుతం ప్రళయ్ షూటింగ్ ముంబైలో జరుగుతోంది. ఆజాద్ స్టేడియంలో రణవీర్‌సింగ్‌తో పాటు ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
తొలి సినిమా...
ఆజాద్ స్టేడియంలో షూటింగ్‌ను జరుపుకుంటున్న తొలి సినిమా ప్రళయ్ కావడం గమనార్హం. ఈ మైదానంలో బాలీవుడ్ మూవీ చిత్రీకరణను జరుపుకునేందుకు మహారాష్ట్ర స్పోర్ట్స్ డిపార్ట్‌మెంట్ అధికారులు అనుమతులు ఇచ్చారు.
మ్యాచ్‌లు రద్దు...
అయితే ప్రళయ్ షూటింగ్ కారణంగా ఈ స్టేడియంలో జరగాల్సిన అండర్ 14, అండర్ 16 మ్యాచ్‌లు రద్దయ్యాయి. క్రికెట్ మ్యాచ్‌లను వాయిదావేసి స్టేడియాన్ని ప్రళయ్ షూటింగ్ కోసం అద్దెకు ఇవ్వడంపై ముంబై క్రికెట్ అసోసియేషన్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఎప్పుడో షెడ్యూల్ ఫిక్సయిన మ్యాచ్‌లను కాదని, షూటింగ్‌లకు స్టేడియాన్ని ఎలా ఇస్తారంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.
అధికారుల ఫిర్యాదు...
సెట్లు వేయడం, కమర్షియల్ అవసరాలకు వాడటం వల్ల స్టేడియం క్రికెట్‌కు పనికిరాకుండా పోతుందని ముంబై క్రికెట్ అసోసియేషన్ సభ్యులు పేర్కొన్నారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు స్టేడియాలు ఉన్నాయని, సినిమాల కోసం కాదంటూ విమర్శలు గుప్పించారు. ప్రళయ్ టీమ్‌తో పాటు స్టేడియం అధికారులపై డిప్యూటీ స్పోర్ట్స్ డైరెక్టర్‌కు ఎమ్‌సీఏ అధికారులు ఫిర్యాదు చేశారు. మరోవైపు ఈ వివాదంపై ప్రళయ్ టీమ్ స్పందించింది. అన్ని అనుమతులు తీసుకొనే తాము షూటింగ్ చేస్తోన్నట్లు చెప్పారు.
జాంబీ థ్రిల్లర్...
జాంబీ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ప్రళయ్ మూవీకి జై మెహతా దర్శకత్వం వహించారు. ఈ సినిమాతో మలయాళ బ్యూటీ కళ్యాణి ప్రియదర్శన్ హిందీ ఇండస్ట్రీలోకి తొలి అడుగు వేయబోతుంది. హన్సల్ మెహతా, అనన్య బిర్లాతో కలిసి రణవీర్‌సింగ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Ramayana | రామాయణ ఫస్ట్ డే కలెక్షన్స్ – ధరుంధర్ 2 , టాక్సిక్ కంటే తక్కువే!
నవంబర్ 6, 2026

Ramayana | రామాయణ కంటే ప్రభాస్ ఆదిపురుష్ పది రెట్లు బెటర్ – చెత్త మూవీ – బాలీవుడ్ క్రిటిక్ పోస్ట్ వైరల్
నవంబర్ 5, 2026

Regina Cassandrra | దక్షిణాది నటులంటే బాలీవుడ్లో చులకనే – జాన్వీకపూర్‌కు రెజీనా కౌంటర్
నవంబర్ 5, 2026
తాజావార్తలు
- ●Chirumarthi Lingaiah | సాగర్ ఎక్కడ.. కుప్పం ఎక్కడ? 72 టీఎంసీల నీళ్లు పోతుంటే ఏం చేస్తున్నారు?
- ●Karmabhoomi Express | రైల్లో అగ్నిప్రమాదం.. నాలుగు కోచ్‌లకు అంటుకున్న మంటలు
- ●Padi Kaushik Reddy | హోం మంత్రి రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అభినందనలు
- ●Rahul Gandhi | ఇది ఓట్ల చోరీ కాదు.. హక్కుల చోరీ.. ఓటర్ ఐడీతో సంక్షేమ పథకాలపై రాహుల్ విమర్శలు
- ●Devireddy Sudheer Reddy | నల్లాల్లో నీళ్లు బంద్.. 2.35 లక్షల ట్యాంకర్లే సర్కార్ ఘనతా?
- ●Nestvest | పిల్లల భవిష్యత్తు కోసం ‘నెస్ట్వెస్ట్’.. ఏడాదికి కేవలం రూ.29కే పెట్టుబడి సలహాలు..

Chirumarthi Lingaiah | సాగర్ ఎక్కడ.. కుప్పం ఎక్కడ? 72 టీఎంసీల నీళ్లు పోతుంటే ఏం చేస్తున్నారు?

Karmabhoomi Express | రైల్లో అగ్నిప్రమాదం.. నాలుగు కోచ్‌లకు అంటుకున్న మంటలు

Padi Kaushik Reddy | హోం మంత్రి రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అభినందనలు

Rahul Gandhi | ఇది ఓట్ల చోరీ కాదు.. హక్కుల చోరీ.. ఓటర్ ఐడీతో సంక్షేమ పథకాలపై రాహుల్ విమర్శలు



