Iran strong warning to Trump | ఒక్క లీటర్ చమురు కూడా పోనివ్వం.. ట్రంప్‌కు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్
Iran strong warning to Trump | ఆయిల్ సప్లైకి (oil supply) అడ్డుపడితే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ఇరాన్‌కు ట్రంప్ (Donald Trump) తీవ్ర హెచ్చరికలు చేసిన విషయం తెలిసిందే. ఈ హెచ్చరికలపై ఇరాన్ ఘాటుగా స్పందించింది. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది.
International | Published On Mar 10, 2026, 10.48 am IST
Iran strong warning to Trump | పశ్చిమాసియాలో (Middle East) యుద్ధం వరుసగా 11వ రోజుకు చేరింది. ఇరాన్‌పై ఇజ్రాయెల్-అమెరికా సంయుక్తంగా దాడులను కొనసాగిస్తున్నాయి. ఇరాన్ సైతం ప్రతిదాడులు చేస్తోంది. అదే సమయంలో దేశాధినేతలు తీవ్ర హెచ్చరికలు చేసుకుంటున్నారు. ఆయిల్ సప్లైకి (oil supply) అడ్డుపడితే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ఇరాన్‌కు ట్రంప్ (Donald Trump) తీవ్ర హెచ్చరికలు చేసిన విషయం తెలిసిందే.
అమెరికా ఆస్తులను, ఇజ్రాయెల్‌ను లక్ష్యంగా చేసుకుని ఏదైనా కుయుక్తులు పన్నాలని చూస్తే.. ప్రపంచ చమురు సరఫరాలో 20 శాతం వాటా కలిగిన హర్మూజ్ జలసంధిని ( Strait of Hormuz) తన ఆధీనంలోకి తీసుకుంటానని ట్రంప్ హెచ్చరించారు. అయితే, ఈ హెచ్చరికలపై ఇరాన్ ఘాటుగా స్పందించింది. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఇజ్రాయెల్, అమెరికా దాడులు కొనసాగితే ఈ ప్రాంతం నుండి 'ఒక్క లీటరు చమురు' కూడా బయటకు వెళ్లనివ్వమని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (Islamic Revolutionary Guard Corps) హెచ్చరించింది.
ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరికలు ఇవే..
సోమవారం సీబీఎస్ న్యూస్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ.. ఇరాన్‌కు కీలక హెచ్చరికలు చేశారు. ప్రపంచ చమురు సరఫరాకు టెహ్రాన్ అడ్డుపడితే అది 'ఇరాన్ అంతానికి' దారితీస్తుందని తీవ్ర స్వరంతో హెచ్చరించారు. 'వారు ప్రయోగించాలనుకున్నవన్నీ ప్రయోగించేశారు. ఇకపై వారు ఎటువంటి కుయుక్తులు పన్నకపోవడమే మంచిది. లేదంటే ఆ దేశం సర్వనాశనం అవుతుంది. వారు ఏదైనా చేసేందుకు ప్రయత్నిస్తే అది ఇరాన్ పతనానికి దారితీస్తుంది. ఆ పేరు మళ్ళీ ఎక్కడా వినబడదు' అని ట్రంప్ హెచ్చరించారు. ప్రస్తుతం హర్మూజ్ జలసంధి తెరిచే ఉందని.. దాన్ని తమ ఆధీనంలోకి తీసుకోవడం గురించి ఆలోచిస్తున్నట్లు ట్రంప్ వెల్లడించారు.
ఒమన్, ఇరాన్ దేశాల మధ్య ఉన్న హర్మూజ్ జలసంధి ప్రపంచ ఇంధన మార్కెట్‌కు అత్యంత కీలకమైన రవాణా మార్గం. ప్రస్తుతం యుద్ధం కారణంగా ఈ జలసంధి ద్వారా వాణిజ్య నౌకల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఫలితంగా ప్రపంచ చమురు సరఫరాకు తీవ్ర అంతరాయం కలగడమే కాకుండా.. ముడి చమురు ధరలు భారీగా పెరుగుతున్నాయి.
Also Read..
Stock Markets | యుద్ధం ముగుస్తుందని సంకేతాలు.. పుంజుకున్న స్టాక్ మార్కెట్లు..
Shiv Pratap Shukla | రేపు ఉదయం 11.30 గంటలకు నూతన గవర్నర్ బాధ్యతల స్వీకరణ
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు






