Stock Markets | యుద్ధం ముగుస్తుందని సంకేతాలు.. పుంజుకున్న స్టాక్ మార్కెట్లు..
Stock Markets | భారత స్టాక్ మార్కెట్లు మంగళవారం ప్రారంభ ట్రేడింగ్‌లో మంచి లాభాలను నమోదు చేశాయి. గత వారం రోజులుగా నష్టాలు చవిచూసిన సెన్సెక్స్, నిఫ్టీ 50 సూచీలు భారీగా పతనం అయిన అనంతరం మళ్లీ పుంజుకున్నాయి. పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న యుద్ధం త్వరలో ముగిసే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంకేతాలు ఇవ్వడంతో మార్కెట్లలో జోష్ కనిపించింది.
Stock Markets | భారత స్టాక్ మార్కెట్లు మంగళవారం ప్రారంభ ట్రేడింగ్‌లో మంచి లాభాలను నమోదు చేశాయి. గత వారం రోజులుగా నష్టాలు చవిచూసిన సెన్సెక్స్, నిఫ్టీ 50 సూచీలు భారీగా పతనం అయిన అనంతరం మళ్లీ పుంజుకున్నాయి. పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న యుద్ధం త్వరలో ముగిసే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంకేతాలు ఇవ్వడంతో మార్కెట్లలో జోష్ కనిపించింది. సోమవారం అమెరికా మార్కెట్లు కూడా లాభాల్లో ముగిశాయి. ఇక సెన్సెక్స్ 960 పాయింట్లకు పైగా పెరిగి ఇంట్రాడే గరిష్ఠ స్థాయి 78,476ని తాకింది. అదే సమయంలో నిఫ్టీ 50 కూడా 300 పాయింట్లకు పైగా పెరిగి గరిష్ఠ స్థాయి 24,306ని టచ్ చేసింది. ఇక 9:53 గంటల సమయానికి సెన్సెక్స్ 77,916 వద్ద ట్రేడ్ అవుతుండగా, నిఫ్టీ 24,134 వద్ద ట్రేడ్ అవుతోంది.
రూ.4 లక్షల కోట్లు పెరిగిన సంపద..
మార్కెట్ ప్రారంభమైన కొన్ని నిమిషాల్లోనే పెట్టుబడిదారులు సుమారు రూ.4 లక్షల కోట్ల సంపదను సంపాదించారు. బీఎస్‌ఈలో లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ గత సెషన్‌లోని రూ.441 లక్షల కోట్ల నుంచి రూ.445 లక్షల కోట్లకు పెరిగింది. ఇక మంగళవారం నాడు భారత స్టాక్ మార్కెట్లు పెరిగేందుకు పలు ప్రధాన కారణాలు ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. అమెరికా-ఇరాన్ యుద్ధం ముగియబోతుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పడం మార్కెట్లలో జోష్‌కు కారణం అయింది. మరోవైపు ఇరాన్ కూడా శాంతి చర్చలకు సిద్ధమని ప్రకటించింది. దీంతో యుద్ధం ముగిసే సంకేతాలు వెలువడ్డాయని భావించి పెట్టుబడిదారులు కొనుగోళ్లు పెంచారు. అందుకనే మార్కెట్లు పుంజుకున్నాయి.
ముడి చమురు ధరల తగ్గుదల ప్రభావం..
ఇక ముడి చమురు ధరలు తగ్గడం కూడా మార్కెట్‌కు ఊరట కలిగించింది. అమెరికా-ఇరాన్ యుద్ధం త్వరలో ముగిసే అవకాశముందని ట్రంప్ సంకేతాలు ఇవ్వడంతో చమురు ధరలు తగ్గుముఖం పట్టాయి. ట్రంప్ చమురు సంబంధిత ఆంక్షలను ఎత్తివేయడం గురించి ఆలోచిస్తున్నట్లు కూడా తెలిపారు. అలాగే హోర్ముజ్ జలసంధిలో చమురు ట్యాంకర్లను రక్షించేందుకు అమెరికా నౌకాదళాన్ని పంపే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు చెప్పారు. ఇక జి7 దేశాల సమూహం కూడా ప్రపంచ ఇంధన సరఫరాను స్థిరంగా ఉంచేందుకు అవసరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఇప్పటికే తెలిపింది. అవసరమైతే నిల్వలను విడుదల చేయడం వంటి చర్యలు కూడా తీసుకుంటామని పేర్కొంది. దీంతో చమురు ధరలు దిగి వచ్చాయి. ఈ ప్రభావం కూడా స్టాక్ మార్కెట్లపై పడింది. అందుకనే మంగళవారం నాడు మార్కెట్లు పాజిటివ్ గా స్పందించాయి. మంగళవారం ఉదయం 9:15 గంటల సమయంలో బ్రెంట్ క్రూడ్ ధరలు దాదాపు 6 శాతం తగ్గి బ్యారెల్‌కు 99 డాలర్ల వద్ద ట్రేడయ్యాయి.
బలపడిన రూపాయి..
చమురు ధరలు తగ్గడం భారత స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారులకు ప్రధాన ఊరటగా మారింది. ఎందుకంటే చమురు ధరల పెరుగుదల దేశీయ ఆర్థిక పరిస్థితులపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. భారత రూపాయి పుంజుకోవడం కూడా మార్కెట్ భావోద్వేగాలను మెరుగుపరిచింది. పీటీఐ ప్రకారం మంగళవారం ప్రారంభ ట్రేడింగ్‌లో రూపాయి అమెరికా డాలర్‌తో పోలిస్తే 23 పైసలు పెరిగి 91.98 వద్ద ట్రేడైంది. బ్లూమ్‌బర్గ్ డేటా ప్రకారం సోమవారం అమెరికా-ఇరాన్ యుద్ధం, చమురు ధరల పెరుగుదలపై ఆందోళనల మధ్య రూపాయి చరిత్రలోనే కనిష్ఠ స్థాయి 92.3575ని తాకిన తర్వాత 58 పైసలు పడిపోయి 92.33 వద్ద ముగిసింది. ఇక ప్రధాన రంగాల్లో విలువ ఆధారిత కొనుగోళ్లు జరగడం మార్కెట్ పెరుగుదలకు దోహదపడింది.
లాభాల్లో బ్యాంకింగ్, ఫైనాన్స్, ఆటో, ఫార్మా రంగాలు..
ఇటీవలి మార్కెట్ సవరణ తర్వాత నాణ్యమైన షేర్లలో పెట్టుబడిదారులు కొనుగోళ్లు చేయడంతో నిఫ్టీ బ్యాంక్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఆటో, ఫార్మా సూచీలు మంగళవారం ఉదయం ట్రేడింగ్‌లో ఒక్కొక్కటి 1 శాతానికి పైగా పెరిగాయి. అమెరికా డాలర్, బాండ్ ఈల్డ్స్ తగ్గడం కూడా మార్కెట్‌కు మద్దతు ఇచ్చింది. డాలర్ సూచీ సుమారు 0.5 శాతం తగ్గగా, అమెరికా 10 సంవత్సరాల ప్రభుత్వ బాండ్ ఈల్డ్ గత సెషన్‌లోని 4.2 శాతం నుంచి దాదాపు 4 శాతానికి పడిపోయింది. దీంతో భారత స్టాక్ మార్కెట్లు పాజిటివ్‌గా స్పందించాయి.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Stock Markets | ఆరంభంలో లాభాలు.. ముగింపులో నష్టాలు.. స్టాక్ మార్కెట్లలో తీవ్ర అస్థిరత..
మే 21, 2026

Gold And Silver Prices Today | స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. సేఫ్ హావెన్ ఆస్తులపై తగ్గుతున్న ఆసక్తి..
మే 21, 2026

Stock Markets | స్టాక్ మార్కెట్లలో జోష్.. లాభాల్లో ట్రేడవుతున్న సూచీలు..
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



