Helicopter Crash | బస్సు ప్రమాదాన్ని కవర్ చేసేందుకు వెళ్లి.. కూలిపోయిన మీడియా హెలికాప్టర్
Helicopter Crash | అమెరికాలోని లాస్ ఏంజెలెస్ (Los Angeles)లో బస్సు ప్రమాదాన్ని కవర్ చేసేందుకు వెళ్లిన మీడియా హెలికాప్టర్ అదుపుతప్పి కూలిపోయింది (Helicopter Crash).
International | Published On Sep 16, 2026, 12.08 pm IST
Helicopter Crash | త్రినేత్ర.న్యూస్ : అమెరికాలోని లాస్ ఏంజెలెస్ (Los Angeles)లో ఊహించని ప్రమాదం చోటు చేసుకుంది. బస్సు ప్రమాదాన్ని కవర్ చేసేందుకు వెళ్లిన మీడియా హెలికాప్టర్ అదుపుతప్పి కూలిపోయింది (Helicopter Crash). ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు.
చట్స్‌వర్త్ (Chatsworth) ప్రాంతంలో ప్రయాణికుల బస్సు, ఎస్‌యూవీ ఢీ కొన్నాయి. ఈ ప్రమాదాన్ని కవర్ చేసేందుకు యూఎస్ న్యూస్ మీడియాకు చెందిన హెలికాప్టర్లు వెళ్లాయి. గగనతలం నుంచి ప్రమాదాన్ని కవర్ చేస్తుండగా ఎన్‌బీసీ లాస్ ఏంజెలెస్ (NBC Los Angeles) న్యూస్‌కు చెందిన హెలికాప్టర్ ఒక్కసారిగా అదుపుతప్పి కిందకు దూసుకెళ్లింది. సమీపంలోని పార్కింగ్ ప్రాంతంలో కూలిపోయింది. దీంతో అక్కడ పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.
ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయినట్లు లాస్ ఏంజెలెస్ ఫైర్ డిపార్ట్‌మెంట్ ప్రకటించింది. మృతుల్లో ఒకరు పార్కింగ్ ప్రాంతంలోని వ్యక్తిగా తెలిపింది. ఇక అక్కడ పార్క్ చేసిన అనేక వాహనాలు దెబ్బతిన్నాయి. ప్రమాదానికి సంబంధించిన షాకింగ్ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
BREAKING: TV news helicopter crashes during live shot of bus crash in Los Angeles.
The helicopter belongs to NBC Los Angeles (KNBC-TV). No word yet on casualties. pic.twitter.com/kXwgr5meOP
— BNO News (@BNONews) September 16, 2026
Also Read..
ఆయిల్‌పామ్‌కు సంబంధించి మార్కెటింగ్, ఎగుమతుల సమస్య లేదు: మంత్రి తుమ్మల
ఈ నెల 18న తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త ఇంచార్జి..!
బులియన్ మార్కెట్లలో తీవ్ర అనిశ్చితి.. స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు..
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Helicopter Crash | కెన్యాలో హెలికాప్టర్ ప్రమాదం.. ఈక్వెడార్ ఇంటెలిజెన్స్ చీఫ్ సహా ఏడుగురు దుర్మరణం
ఆగస్టు 20, 2026

Shah Rukh Khan | లాస్ ఏంజిల్స్‌లో నైట్ రైడర్స్ క్రికెట్ గ్రౌండ్.. ఆనందం వ్యక్తం చేసిన షారుఖ్ ఖాన్
జులై 2, 2026

Indian Origin Pilot | హనీమూన్‌కు వెళ్తూ.. హెలికాప్టర్ ప్రమాదంలో భారత సంతతి వరుడు మృతి
జూన్ 1, 2026
తాజావార్తలు
- ●Pak Ship Collides With Indian Navy Unit | అంతర్జాతీయ జలాల్లో అనూహ్య పరిణామం.. భారత నౌకను ఢీ కొట్టిన పాక్ నౌక
- ●Special Trains | వినాయక చవితి రద్దీ.. ప్రత్యేక రైళ్లను ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే
- ●Dinesh Chowdary vs Balmoor Venkat | అప్పుడు నువ్వు కేటీఆర్ కాళ్లు మొక్కింది నిజం కాదా?
- ●Mecca | చరిత్రలోనే తొలిసారి.. హౌతీల దాడులతో మక్కాలో హై అలర్ట్
- ●Speaker Gaddam Prasad Kumar | దౌర్జన్యంగా మైక్ లాక్కున్నారు.. సభలో స్పీకర్ ఆవేదన
- ●UPI | వినియోగదారులకు పేటీఎం గుడ్‌న్యూస్.. యూపీఐ చార్జిలు విధించబోమని ప్రకటన..

Pak Ship Collides With Indian Navy Unit | అంతర్జాతీయ జలాల్లో అనూహ్య పరిణామం.. భారత నౌకను ఢీ కొట్టిన పాక్ నౌక

Special Trains | వినాయక చవితి రద్దీ.. ప్రత్యేక రైళ్లను ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే

Dinesh Chowdary vs Balmoor Venkat | అప్పుడు నువ్వు కేటీఆర్ కాళ్లు మొక్కింది నిజం కాదా?

Mecca | చరిత్రలోనే తొలిసారి.. హౌతీల దాడులతో మక్కాలో హై అలర్ట్



