BRS Party | 22న ఓరుగల్లులో బీఆర్ఎస్ బహిరంగ సభ..!
BRS Party | ఈనెల 22న ఓరుగల్లులో భారత రాష్ట్ర సమితి బహిరంగ సభ నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ బహిరంగ సభకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు కానున్నారు.
BRS Party | త్రినేత్ర న్యూస్ : ఈనెల 22న ఓరుగల్లులో భారత రాష్ట్ర సమితి బహిరంగ సభ నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ బహిరంగ సభకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు కానున్నారు. ఈ క్రమంలో బాలసముద్రంలోని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా కార్యాలయంలో సోమవారం మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ ఆధ్వర్యంలో గ్రేటర్ వరంగల్ పరిధిలోని మాజీ పార్లమెంట్ సభ్యులు, మాజీ శాసనసభ్యులతో సమావేశాన్ని నిర్వహించారు.
సభ ఏర్పాట్లు, జనసమీకరణ, ట్రాఫిక్ నియంత్రణ, సభ సంబంధించిన ఇతర ఏర్పాట్లపై సమగ్రంగా చర్చించారు. సభకు సంబంధించిన ఏర్పాట్లపై కమిటీలను ఏర్పాటు చేశారు. పార్టీలో చేరికలపై సైతం చర్చించారు. వరంగల్ పశ్చిమ, వరంగల్ తూర్పు, వర్ధన్నపేట, పరకాల, స్టేషన్ ఘన్‌పూర్ పరిధిలోని పార్టీ శ్రేణులు ఈ సభకు పెద్ద ఎత్తున తరలిరానున్నట్లు తెలిపారు
సమావేశంలో మాజీ పార్లమెంట్ సభ్యులు బోయినపల్లి వినోద్ కుమార్, మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య, మాజీ ఎమ్మెల్యేలు చల్ల ధర్మారెడ్డి, ఆరూరి రమేష్, మాజీ చైర్మన్లు నాగుర్ల వెంకన్న, మర్రి యాదవ రెడ్డి, చింతం సదానందం, రమేష్ బాబు, మాజీ కార్పొరేటర్లు వద్దిరాజ్ గణేష్, జోరిక రమేష్, సీనియర్ నాయకులు నిమ్మగడ్డ వెంకన్న, శోభన్, మసూద్, నయీమొద్దీన్, నీలం రాజ్ కిషోర్, పోలపెల్లి రామ్మూర్తి, ఏకశిల విద్యా సంస్థల చైర్మన్ తిరుపతి రెడ్డి పాల్గొన్నారు.
తాజావార్తలు
- ●Tenth Exam Fee | టెన్త్ విద్యార్థులకు అలర్ట్.. పది పరీక్షల ఫీజు గడువు పొడిగింపు
- ●Yadagirigutta | యాదగిరిగుట్టలో 20 నుంచి కార్తికోత్సవాలు
- ●Heavy Rain | 20న తెలంగాణలో అతి భారీ వర్షం..! జర జాగ్రత్త..!!
- ●Horoscope | నవంబర్ 17 రాశిఫలాలు.. ఈ రాశి వారు ఏ పని చేపట్టినా విజయం తథ్యం..!
- ●Telangana Employees JAC | తెలంగాణ ఉద్యోగుల జేఏసీ భేటీ: ఓపీఎస్ పునరుద్ధరణ, 2వ పీఆర్సీ అమలు సహా 41 ప్రధాన డిమాండ్లు ఇవే!
- ●Couple Photos in Divorce Case | వైష్ణోదేవి, ఉజ్జయిని పుణ్యక్షేత్రాల్లో కలిసి ఫోటోలు దిగినంత మాత్రాన వేధింపులు లేనట్టా?

Tenth Exam Fee | టెన్త్ విద్యార్థులకు అలర్ట్.. పది పరీక్షల ఫీజు గడువు పొడిగింపు

Yadagirigutta | యాదగిరిగుట్టలో 20 నుంచి కార్తికోత్సవాలు

Heavy Rain | 20న తెలంగాణలో అతి భారీ వర్షం..! జర జాగ్రత్త..!!

Horoscope | నవంబర్ 17 రాశిఫలాలు.. ఈ రాశి వారు ఏ పని చేపట్టినా విజయం తథ్యం..!



