త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Tummala Nageswara Rao | ఆయిల్‌పామ్‌కు సంబంధించి మార్కెటింగ్‌, ఎగుమతుల సమస్య లేదు: మంత్రి తుమ్మల

Tummala Nageswara Rao | రాష్ట్రంలో ఆయిల్‌పామ్‌కు (Oil Palm) సంబంధించి మార్కెటింగ్‌, ఎగుమ‌తుల స‌మ‌స్య లేద‌ని మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర్ రావు (Tummala Nageswara Rao) అన్నారు. ఆయిల్‌పామ్‌ సాగులో నష్టం రాకుండా చూసే బాధ్యత ప్రభుత్వానిదన్నారు.

G

Telangana | Published On Sep 16, 2026, 12.04 pm IST

Tummala Nageswara Rao | ఆయిల్‌పామ్‌కు సంబంధించి మార్కెటింగ్‌, ఎగుమతుల సమస్య లేదు: మంత్రి తుమ్మల
Advertisement

Tummala Nageswara Rao | త్రినేత్ర‌.న్యూస్‌: రాష్ట్రంలో ఆయిల్‌పామ్‌కు (Oil Palm) సంబంధించి మార్కెటింగ్‌, ఎగుమ‌తుల స‌మ‌స్య లేద‌ని మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర్ రావు (Tummala Nageswara Rao) అన్నారు. ఆయిల్‌పామ్‌ సాగులో నష్టం రాకుండా చూసే బాధ్యత ప్రభుత్వానిదన్నారు. పది వేల ఎకరాల్లో పంట వస్తేనే పరిశ్రమ నిరంతరం నడుస్తుందన్నారు. ఆరు నెలల్లో పరిశ్రమ ఏర్పాటు చేసే బాధ్యత ప్రభుత్వానిదని హామీ ఇచ్చారు. శాస‌న స‌భ వ‌ర్షాకాల స‌మావేశాల్లో ప్ర‌శ్నోత్త‌రాల సంద‌ర్భంగా ఆయిల్‌పామ్, ఉద్యాన పంట‌ల సాగుకు సంబంధి స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర రావు స‌మాధానం ఇచ్చారు. రాష్ట్రంలో 88 వేల మంది రైతులు 3.25 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు చేస్తున్నారని వెల్ల‌డించారు. 2021-22లో 2.74 లక్షల ఎకరాల ఆయిల్‌పామ్ సాగుతో తెలంగాణ (Telangana) అగ్రస్థానంలో ఉందని చెప్పారు. 2023 డిసెంబర్‌ నుంచి 1.37 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగులోకి తెచ్చామని పేర్కొన్నారు. 2026-27లో 85 వేల ఎకరాల లక్ష్యానికి 29 వేల ఎకరాల్లో మొక్కలు నాటినట్లు వెల్ల‌డించారు.

2026-27లో అదనంగా 2 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటల (Horticulture) సాగుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఉద్యాన పంటల సాగు పెంపునకు 40-90 శాతం రాయితీపై పరికరాల పంపిణీ చేస్తున్నామని వెల్ల‌డించారు. ఉద్యాన పంటల సాగు పెంపునకు రూ.150 కోట్లు, బిందు, తుంపర సేద్యం కోసం రూ.243 కోట్లు, ఆయిల్‌పామ్ సాగు అభివృద్ధికి రూ.261 కోట్లు కేటాయించామని తెలిపారు. ఉద్యాన పంటల వైపు మళ్లించడానికి రైతులకు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామ‌న్నారు. సోలార్‌ వ్యవస్థ ద్వారా రైతుల ఉద్యాన పంటల సాగుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.

Advertisement
Advertisement