త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Gold And Silver Prices Today | బులియ‌న్ మార్కెట్ల‌లో తీవ్ర అనిశ్చితి.. స్వ‌ల్పంగా పెరిగిన బంగారం ధ‌ర‌లు..

Gold And Silver Prices Today | ప‌శ్చిమ ఆసియాలో కొన‌సాగుతున్న యుద్ధం కార‌ణంగా దేశీయ, అంత‌ర్జాతీయ స్టాక్ మార్కెట్లు ఇప్ప‌టికే భారీ న‌ష్టాల్లో ఉన్నాయి. అయితే బుధ‌వారం చ‌మురు ధ‌ర‌లు స్వ‌ల్పంగా త‌గ్గ‌డంతో ఈక్విటీ మార్కెట్ల‌లో అనుకూల సంకేతాలు క‌నిపించాయి. ప్ర‌స్తుతం సూచీలు స్వ‌ల్ప లాభాల్లో ఉన్న‌ప్ప‌టికీ యుద్ధ భ‌యాలు ఇంకా తొల‌గిపోలేదు.

S

Business | Published On Sep 16, 2026, 11.29 am IST

Gold And Silver Prices Today | బులియ‌న్ మార్కెట్ల‌లో తీవ్ర అనిశ్చితి.. స్వ‌ల్పంగా పెరిగిన బంగారం ధ‌ర‌లు..
Advertisement

Gold And Silver Prices Today | ప‌శ్చిమ ఆసియాలో కొన‌సాగుతున్న యుద్ధం కార‌ణంగా దేశీయ, అంత‌ర్జాతీయ స్టాక్ మార్కెట్లు ఇప్ప‌టికే భారీ న‌ష్టాల్లో ఉన్నాయి. అయితే బుధ‌వారం చ‌మురు ధ‌ర‌లు స్వ‌ల్పంగా త‌గ్గ‌డంతో ఈక్విటీ మార్కెట్ల‌లో అనుకూల సంకేతాలు క‌నిపించాయి. ప్ర‌స్తుతం సూచీలు స్వ‌ల్ప లాభాల్లో ఉన్న‌ప్ప‌టికీ యుద్ధ భ‌యాలు ఇంకా తొల‌గిపోలేదు. మ‌రోవైపు అమెరికా బాండ్ ఈల్డ్స్ ప్ర‌భావం, పెరుగుతున్న చ‌మురు ధ‌ర‌లు పెట్టుబ‌డిదారుల్లో ఆందోళ‌న‌ను క‌లిగిస్తున్నాయి. దీంతో బంగారం, వెండి ధ‌ర‌ల్లో తీవ్ర అస్థిర‌త చోటు చేసుకుంటోంది. ఇక బుధ‌వారం అంతర్జాతీయ బులియ‌న్ మార్కెట్ల‌లో బంగారం ధ‌ర‌లు స్వ‌ల్పంగా పెరిగాయి. ఔన్స్ బంగారం ధ‌ర 0.73 శాతం పెరిగి 4,325 డాల‌ర్ల‌కు చేర‌గా, వెండి ధ‌ర 1.42 శాతం మేర ఎగ‌బాకి 64 డాల‌ర్ల‌కు చేరుకుంది. దేశీయ క‌మోడిటీ మార్కెట్ ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచ‌ర్స్ కాంట్రాక్టు 1066 పాయింట్ల‌కు పైగా పెరిగి 1,51,848 వ‌ద్ద ఉండ‌గా, సిల్వ‌ర్ ఫ్యూచ‌ర్స్ కాంట్రాక్టు 3,343 పాయింట్ల‌కు పైగా ఎగ‌సి 2,35,400 వ‌ద్ద ఉంది. దేశీయ స్పాట్ మార్కెట్‌లోనూ బంగారం ధ‌ర‌లు స్వ‌ల్పంగా పెరిగాయి. వెండి ధ‌ర‌ల్లో ఎలాంటి మార్పు లేదు.

స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ధ‌ర‌లు..

24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధ‌ర రూ.15,344 ఉండ‌గా, 8 గ్రాముల ధ‌ర రూ.1,22, 752 గా ఉంది. 10 గ్రాముల ధ‌ర రూ.1,53,440 గా ఉంది. 100 గ్రాముల బంగారం ధ‌ర రూ.15,34,400 గా ఉంది. ఇది కింద‌టి రోజు ముగింపుతో పోలిస్తే రూ.2,700 పెరిగింది.

22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధ‌ర రూ.14,065 ఉండ‌గా, 8 గ్రాముల ధ‌ర రూ.1,12,520గా ఉంది. 10 గ్రాముల ధ‌ర రూ.1,40,650 ఉండగా, 100 గ్రాముల బంగారం ధ‌ర రూ.14,06,500గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.2,500 పెరిగింది.

18 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధ‌ర రూ.11,508 ఉండ‌గా, 8 గ్రాముల ధ‌ర రూ.92,064గా ఉంది. 10 గ్రాముల ధ‌ర రూ.1,15,080 ఉండ‌గా, 100 గ్రాముల బంగారం ధ‌ర రూ.11,50,800గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.2,000 పెరిగింది.

దేశీయ మార్కెట్‌లో 1 కిలో వెండి ధ‌ర రూ.2,45,000 ఉండ‌గా, తులం ధ‌ర రూ.2,450గా ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే వెండి ధ‌ర‌లో ఎలాంటి మార్పు లేదు. హైద‌రాబాద్‌లో 1 కిలో వెండి ధ‌ర రూ.2,50,000 ఉండ‌గా, తులం ధ‌ర రూ.2,500 గా ఉంది.

Advertisement
Advertisement