త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Yadagirigutta | యాద‌గిరిగుట్ట‌లో 20 నుంచి కార్తికోత్స‌వాలు

Yadagirigutta | రాష్ట్రంలోని అన్ని ఆల‌యాల్లో కార్తిక మాసం సంద‌డి నెల‌కొంది. కార్తిక మాసాన్ని పుర‌స్క‌రించుకుని భ‌క్తులు శివాల‌యాల‌కు పోటెత్తుతున్నారు. కార్తిక దీపాలు వెలిగించి త‌మ మొక్కులు చెల్లించుకుంటున్నారు.

S

Telangana | Published On Nov 17, 2026, 6.40 am IST

Yadagirigutta | యాద‌గిరిగుట్ట‌లో 20 నుంచి కార్తికోత్స‌వాలు
Advertisement

Yadagirigutta | త్రినేత్ర న్యూస్ : రాష్ట్రంలోని అన్ని ఆల‌యాల్లో కార్తిక మాసం సంద‌డి నెల‌కొంది. కార్తిక మాసాన్ని పుర‌స్క‌రించుకుని భ‌క్తులు శివాల‌యాల‌కు పోటెత్తుతున్నారు. కార్తిక దీపాలు వెలిగించి త‌మ మొక్కులు చెల్లించుకుంటున్నారు. అయితే యాద‌గిరిగుట్ట( Yadagirigutta ) ఆల‌యంలోనూ కార్తికోత్స‌వాల‌ను ఈ నెల 20 నుంచి 22 వ‌ర‌కు నిర్వ‌హించాల‌ని ఆల‌య అధికారులు నిర్ణ‌యించారు.

కార్తికోత్స‌వాల షెడ్యూల్ ఇలా..

  • 20న సాయంత్రం 6 నుంచి 7.30 గంటల వరకు మాడుగుల నాగఫణిశర్మ ప్రవచనం.
  • 21న సాయంత్రం 6 నుంచి 7.30 గంటల వరకు సినీ సంగీత దర్శకుడు ఆర్‌పీ పట్నాయక్‌ ఆధ్వర్యంలో సంగీత నృత్య కార్యక్రమాలు.
  • 22న ఆదివారం సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు రుద్రాక్ష ఫౌండేషన్‌ వారితో ఒడిస్సీ నృత్య ప్రదర్శన, అభినేత్రి బృందం ఆధ్వర్యంలో రాత్రి 7 నుంచి 8 గంటల వరకు తెలంగాణ ఆలయాల ఇతివృత్తంపై నృత్య ప్రదర్శన ఉంటాయి.
  • ఈ ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 20న ఏకాదశి సందర్భంగా దేవస్థానం అర్చక బృందం ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి నామార్చన సహిత కోటి పుష్పార్చన నిర్వహిస్తారు.
Advertisement
Advertisement