త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Heavy Rain | 20న తెలంగాణ‌లో అతి భారీ వ‌ర్షం..! జ‌ర జాగ్ర‌త్త‌..!!

Heavy Rain | బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఈ నెల 20న మధ్యాహ్నం సమయానికి ఏపీలోని నెల్లూరు-తుని మధ్య తీవ్ర తుపానుగా తీరం దాటే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ వెల్ల‌డించింది.

S

Telangana | Published On Nov 17, 2026, 6.20 am IST

Heavy Rain | 20న తెలంగాణ‌లో అతి భారీ వ‌ర్షం..! జ‌ర జాగ్ర‌త్త‌..!!
Advertisement

Heavy Rain | త్రినేత్ర న్యూస్ : బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఈ నెల 20న మధ్యాహ్నం సమయానికి ఏపీలోని నెల్లూరు-తుని మధ్య తీవ్ర తుపానుగా తీరం దాటే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ వెల్ల‌డించింది.

ఈ తుపాను ప్ర‌భావంతో.. ఈ నెల 19 నుంచి 22వ తేదీ వ‌ర‌కు రాష్ట్రంలోని ప‌లు జిల్లాల్లో వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని తెలిపింది. 20వ తేదీన మ‌హ‌బూబాబాద్, సూర్యాపేట‌, ఖ‌మ్మం, భ‌ద్రాద్రి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని హెచ్చ‌రించింది. ఈ నాలుగు జిల్లాల‌కు వాతావ‌ర‌ణ శాఖ ఆరెంజ్ అల‌ర్ట్ జారీ చేసింది. న‌ల్ల‌గొండ‌, యాదాద్రి, వ‌రంగ‌ల్, హ‌నుమ‌కొండ‌, జ‌న‌గామ‌, ములుగు జిల్లాల‌కు ఎల్లో అల‌ర్ట్ జారీ చేసింది. 21వ తేదీన జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. ఈ జిల్లాలకు వాతావరణ శాఖ ‘ఆరెంజ్‌’ హెచ్చరికలు జారీ చేసింది.

Advertisement
Advertisement