త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Infant | ఓ చిన్నారి పుట్టుకతోనే అరుదైన ఘనత సాధించింది..

Infant | ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లాకు చెందిన ఓ చిన్నారి పుట్టుకతోనే అరుదైన ఘనత సాధించింది.

S

National | Published On Nov 17, 2026, 8.00 am IST

Infant | ఓ చిన్నారి పుట్టుకతోనే అరుదైన ఘనత సాధించింది..
Advertisement

Infant | త్రినేత్ర న్యూస్ : ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లాకు చెందిన ఓ చిన్నారి పుట్టుకతోనే అరుదైన ఘనత సాధించింది. మునగపాక మండలం ఉమ్మలాడ గ్రామానికి చెందిన భవాని, సందీప్ దొర దంపతులకు సెప్టెంబర్ 18న ఆడబిడ్డ జన్మించింది. పుట్టినప్పుడే చిన్నారి తల నిండా ఒత్తైన నల్లటి జుట్టు ఉండటంతో వైద్యులు ఆశ్చర్యపోయారు. పాప జుట్టు పొడవు 7 సెంటీమీటర్లుగా గుర్తించారు.

గిన్నిస్ ప్రతినిధులు ఈ అరుదైన ఘనతను ప్రపంచ రికార్డుగా నమోదు చేసి చిన్నారికి సర్టిఫికెట్, మెడల్ అందించారు. పుట్టుకతోనే గిన్నిస్ రికార్డు సాధించడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
Advertisement