US visa curbs hit Indians | ట్రంప్ కఠిన వీసా నిబంధనలు.. భారత్, చైనీయులపైనే అధిక ప్రభావం..!
US visa curbs hit Indians | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత వీసా నిబంధనలను కఠినతరం చేసిన విషయం తెలిసిందే. ట్రంప్ అమలు చేస్తున్న కఠిన వీసా విధానాల వల్ల అన్ని దేశాలపై తీవ్ర ప్రభావం పడుతోంది.
International | Published On Mar 23, 2026, 1.37 pm IST
US visa curbs hit Indians | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత వీసా నిబంధనలను కఠినతరం చేసిన విషయం తెలిసిందే. ట్రంప్ అమలు చేస్తున్న కఠిన వీసా విధానాల వల్ల అన్ని దేశాలపై తీవ్ర ప్రభావం పడుతోంది. అయితే, భారత్, చైనాపై ఆ ప్రభావం మరింత ఎక్కువగా ఉన్నట్లు (US visa curbs hit Indians) తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి.
ది వాషింగ్టన్ పోస్ట్ నివేదిక ప్రకారం.. విద్యార్థులు, ఉద్యోగులు, కుటుంబ సభ్యుల వీసాల జారీ గణనీయంగా తగ్గింది. 2024తో పోలిస్తే 2025 తొలి ఎనిమిది నెలల్లో సుమారు 2.5 లక్షల వీసాలు తక్కువగా జారీ అయ్యాయి. యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ విడుదల చేసిన డేటా ప్రకారం.. 2025 జనవరి నుంచి ఆగస్టు మధ్య శాశ్వత నివాసం (గ్రీన్‌కార్డ్), తాత్కాలిక వీసాల సంఖ్య అంతకుముందు సంవత్సరం (2024) ఇదే కాలంతో పోలిస్తే సుమారు 11 శాతం మేర తగ్గింది. ఈ తగ్గుదలలో పర్యాటక వీసాలను లెక్కలోకి తీసుకోలేదు. అయితే వాటి జారీ కూడా తగ్గినట్లు సమాచారం.
ట్రంప్ కఠిన వీసా నిబంధనల కారణంగా ముఖ్యంగా భారత్, చైనా దేశాలకు చెందిన అభ్యర్థులే ఎక్కువగా నష్టపోతున్నట్లు సదరు నివేదిక వెల్లడించింది. ఈ రెండు దేశాలకు చెందిన పౌరులకు జారీ చేసిన వీసాల సంఖ్య 2024తో పోలిస్తే సుమారు 84 వేల మేర తగ్గింది. ఇక 2024తో పోలిస్తే 2025లో స్టూడెంట్ వీసాలు కూడా గణనీయంగా పడిపోయాయి. 2024 మొదటి ఎనిమిది నెలల్లో 3,44,000గా ఉన్న విద్యార్థి వీసాలు.. 2025 ఏడాది అదే కాలంలో 2,38,000కి పడిపోయాయి. అదే సమయంలో కుటుంబ ప్రాధాన్యత వీసాల్లోనూ 27 శాతం కంటే ఎక్కువగానే తగ్గుదల కనిపిస్తోంది. అంటే కుటుంబ ప్రాధాన్యత వీసాలు గతేడాదితో పోలిస్తే 44 వేలకుపైగా తగ్గాయి. వ్యాపార, పర్యాటక వీసాల్లో సైతం 3.4 శాతం తగ్గుదల ఉంది. అంటే 2024తో పోలిస్తే దాదాపు 2,00,000 వీసాలు తగ్గాయి.
ట్రంప్ యంత్రాంగం 2025-2026లో అత్యంత కఠినమైన వీసా విధానాలను అమలు చేస్తోన్న విషయం తెలిసిందే. H-1B వీసా రిజిస్ట్రేషన్‌పై $100,000 (సుమారు ₹84 లక్షలు) భారీ రుసుము, లాటరీ విధానంలో మార్పులు, అధిక వేతనాలు పొందే వారికే ప్రాధాన్యతనిస్తూ నిబంధనలను కఠినతరం చేసింది. అలాగే, 75కి పైగా దేశాల నుంచి వలస వీసాల (Immigrant Visas) జారీని నిలిపివేసింది. అయితే ఇందులో నాన్-ఇమ్మిగ్రెంట్ వీసాలకు (H-1B, L-1, B-1/B-2) మినహాయింపు ఇచ్చింది. ట్రంప్ యంత్రాంగం తెచ్చిన కఠిన వీసా నిబంధనల కారణంగా అంతర్జాతీయ విద్యార్థులు, అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే ఐటీ నిపుణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Also Read..
టాలీవుడ్‌లో తెలంగాణ మట్టి కథల గుబాళింపు
ఢిల్లీ పేలుడు కేసు.. జమ్ము కశ్మీర్‌లో ఎన్ఐఏ సోదాలు
లగ్జరీ కారుతో ప్రమాదకర స్టంట్స్.. చిక్కుల్లో మాజీ అండర్‌వరల్డ్ డాన్ కొడుకు
తాజావార్తలు
- ●Bhatti Vikramarka | రైతు భరోసాకు మరో రూ.1,900 కోట్లు.. ఖమ్మం సభలో డిప్యూటీ భట్టి ప్రకటన
- ●Damodara nd Vivek | ఈఎస్ఐ డిస్పెన్సరీ సేవలు మరింత బలోపేతం చేస్తున్నాం
- ●El Nino Impact Telangana | ఎల్‌నినో టెన్షన్ వద్దు.. ఈ పంటలే ముద్దు!
- ●Venkatesh Son | వెంకటేష్ వారసుడు వచ్చేస్తున్నాడోచ్ - దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి మరో కొత్త హీరో?
- ●Man Sleeping on Bull | నడి రోడ్డుపై ఎద్దు ఒడిలో హాయిగా నిద్ర.. ఇండియా ఈజ్ నాట్ ఫర్ బిగినర్స్ బ్రో.. వీడియో వైరల్
- ●Indiramma Illu | ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో భాగస్వాములు కండి

Bhatti Vikramarka | రైతు భరోసాకు మరో రూ.1,900 కోట్లు.. ఖమ్మం సభలో డిప్యూటీ భట్టి ప్రకటన

Damodara nd Vivek | ఈఎస్ఐ డిస్పెన్సరీ సేవలు మరింత బలోపేతం చేస్తున్నాం

El Nino Impact Telangana | ఎల్‌నినో టెన్షన్ వద్దు.. ఈ పంటలే ముద్దు!

Venkatesh Son | వెంకటేష్ వారసుడు వచ్చేస్తున్నాడోచ్ - దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి మరో కొత్త హీరో?






