Red Fort blast case | ఢిల్లీ పేలుడు కేసు.. జమ్ము కశ్మీర్‌లో ఎన్ఐఏ సోదాలు
Red Fort blast case | గతేడాది నవంబర్‌లో ఢిల్లీలో జరిగిన పేలుడు కేసుపై జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) దర్యాప్తు కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా తాజాగా జమ్ము కశ్మీర్‌లో (Jammu And Kashmir) సోదాలు చేపట్టింది.
Red Fort blast case | గతేడాది నవంబర్‌లో ఢిల్లీలో జరిగిన పేలుడు కేసుపై జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) దర్యాప్తు కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా తాజాగా జమ్ము కశ్మీర్‌లో (Jammu And Kashmir) సోదాలు చేపట్టింది. సోమవారం తెల్లవారుజామున నుంచి కుప్వారా జిల్లాలోని హంద్వారా ప్రాంతం, బారాముల్లా జిల్లాలోని రఫీయాబాద్, కుల్గాం, శ్రీనగర్ జిల్లాల్లోని ఇతర ప్రాంతాల్లో ఎన్ఐఏ అధికారులు ఏకకాలంలో విస్తృతంగా సోదాలు చేపడుతున్నారు.
హంద్వారాలోని ఓ వ్యాపారి నివాసంలో ఎన్‌ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ కేసులో అరెస్టైన వైద్యులకు.. ఆయుధాలు సరఫరా చేసిన వ్యక్తులతో అతడికి సంబంధం ఉన్నట్లు గుర్తించామని అధికారులు వెల్లడించారు. ఆ వ్యాపారి ఇంటి నుంచి పలు కీలక పత్రాలు, డిజిటల్ పరికరాలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. కేసు దర్యాప్తులో భాగంగా ఈ నెల మొదట్లో పుల్వామా, షోపియాన్, కుప్వారా, బారాముల్లా తదితర ప్రాంతాల్లో సోదాలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు.
గతేడాది నవంబర్ 10వ తేదీన ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో భారీ పేలుడు (Red Fort blast case) సంభవించిన విషయం తెలిసిందే. ఢిల్లీ పేలుడులో చనిపోయిన సూసైడ్ బాంబర్‌ను హర్యానా రాష్ట్రంలోని ఫరీదాబాద్‌లోగల అల్‌ఫలా యూనివర్సిటీకి చెందిన వైద్యుడు ఉమర్ నబీగా అధికారులు గుర్తించారు. ఈ పేలుడుతో దేశంలో వైట్‌కాలర్ టెర్రర్ మాడ్యూల్ బయటపడింది. ఇక ఈ కేసులో ఇప్పటి వరకూ 11 మందిని అధికారులు అరెస్ట్ చేశారు.
Also Read..
లగ్జరీ కారుతో ప్రమాదకర స్టంట్స్.. చిక్కుల్లో మాజీ అండర్‌వరల్డ్ డాన్ కొడుకు
హర్మూజ్‌ను దాటాలంటే రూ.18 కోట్లు కట్టాల్సిందే..!
ఫీజు రీయంబర్స్ మెంట్ కు కొర్రీలు.. పేద విద్యార్థులకు వర్రీలు..
సంబంధిత వార్తలు

Encounter | “మీరు పారిపోవచ్చు.. కానీ దాక్కోలేరు”.. ఎన్కౌంటర్లో లష్కరే టాప్ కమాండర్ హతం
జులై 8, 2026

Cloudburst | కిష్త్వార్‌లో క్లౌడ్ బరస్ట్.. బురదలో కూరుకుపోయిన పలు వాహనాలు.. VIDEO
జులై 6, 2026

Bharti Airtel | అమర్నాథ్ యాత్ర మార్గాల్లో ఎయిర్టెల్ ఫుల్ సిగ్నల్.. నెట్‌వర్క్‌ను విస్తరించిన సంస్థ..
జులై 3, 2026
తాజావార్తలు
- ●JP Nadda | దేశానికే ఆదర్శంగా బీబీనగర్ ఎయిమ్స్ : కేంద్రమంత్రి జేపీ నడ్డా
- ●Jana Nayagan | దళపతి విజయ్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ - జననాయగన్ సెన్సార్ కంప్లీట్ - మూడు గంటల రన్టైమ్తో రిలీజ్
- ●China Floods | చైనాలో వరద బీభత్సం: నీటిలో కొట్టుకొచ్చిన 900 విష సర్పాలు.. పాముకాటుతో మహిళ మృతి
- ●Bhatti Vikramarka | రైతు భరోసాకు మరో రూ.1,900 కోట్లు.. ఖమ్మం సభలో డిప్యూటీ భట్టి ప్రకటన
- ●Damodara nd Vivek | ఈఎస్ఐ డిస్పెన్సరీ సేవలు మరింత బలోపేతం చేస్తున్నాం
- ●El Nino Impact Telangana | ఎల్‌నినో టెన్షన్ వద్దు.. ఈ పంటలే ముద్దు!

JP Nadda | దేశానికే ఆదర్శంగా బీబీనగర్ ఎయిమ్స్ : కేంద్రమంత్రి జేపీ నడ్డా

Jana Nayagan | దళపతి విజయ్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ - జననాయగన్ సెన్సార్ కంప్లీట్ - మూడు గంటల రన్టైమ్తో రిలీజ్

China Floods | చైనాలో వరద బీభత్సం: నీటిలో కొట్టుకొచ్చిన 900 విష సర్పాలు.. పాముకాటుతో మహిళ మృతి

Bhatti Vikramarka | రైతు భరోసాకు మరో రూ.1,900 కోట్లు.. ఖమ్మం సభలో డిప్యూటీ భట్టి ప్రకటన



