త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Diwali celebration | దీపావ‌ళి వేడుక‌ల‌తో చెత్త‌మ‌య‌మైన న్యూజెర్సీ రోడ్లు.. నెట్టింట విమ‌ర్శ‌లు

Diwali celebration | అమెరికాలో దివాళీ సంబ‌రాలు (Diwali celebration) వివాదానికి దారితీశాయి. న్యూజెర్సీ (New Jersey) న‌గ‌రంలోని పలు ప్రాంతాలు మొత్తం చెత్త‌మ‌యంగా మారిపోయాయి. ఎటు చూసినా టపాసుల వ్యర్థాలు, ఖాళీ బాక్సులు (firecracker boxes), చెత్తే ద‌ర్శ‌న‌మిస్తోంది. హై-ప్రెజర్ వాటర్ జెట్లను ఉపయోగించి రోడ్లపై పేరుకుపోయిన చెత్తను అధికారులు శుభ్రం చేయాల్సి వ‌చ్చింది.

D

International | Published On Nov 10, 2026, 1.57 pm IST

Diwali celebration | దీపావ‌ళి వేడుక‌ల‌తో చెత్త‌మ‌య‌మైన న్యూజెర్సీ రోడ్లు.. నెట్టింట విమ‌ర్శ‌లు
Advertisement

Diwali celebration | త్రినేత్ర‌.న్యూస్ : దీపావ‌ళి వేడుక‌ల‌ను (Diwali celebration) భార‌తీయులు ఘ‌నంగా జ‌రుపుకున్నారు. దేశంతోపాటూ విదేశాల్లోని భార‌తీయులు కూడా వెలుగుల పండుగ‌ను కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి వేడుక‌గా చేసుకున్నారు. దీపాల‌ను వెలిగించ‌డంతోపాటూ భారీ ఎత్తున ప‌టాకులు కాల్చి సంద‌డి చేశారు. ఈ సంద‌ర్భంగా అమెరికాలో దివాళీ సంబ‌రాలు వివాదానికి దారితీశాయి. న్యూజెర్సీ (New Jersey) న‌గ‌రంలోని పలు ప్రాంతాలు మొత్తం చెత్త‌మ‌యంగా మారిపోయాయి.

జెర్సీ సిటీ (Jersey City), ఇండియా స్ట్రీట్‌ల‌న్నీ (India Street) బాణాసంచా వ్య‌ర్థాల‌తో నిండిపోయాయి. ఎటు చూసినా టపాసుల వ్యర్థాలు, ఖాళీ బాక్సులు (firecracker boxes), చెత్తే ద‌ర్శ‌న‌మిస్తోంది. వేడుకల అనంతరం దట్టమైన పొగ గాల్లోనే అలుముకుంది. దీంతో వ్య‌ర్థాల‌ను శుభ్రం చేయడానికి అక్క‌డి అధికార యంత్రాంగం రంగంలోకి దిగింది. హై-ప్రెజర్ వాటర్ జెట్లను ఉపయోగించి రోడ్లపై పేరుకుపోయిన చెత్తను గంట‌ల‌త‌ర‌బ‌డి శ్ర‌మించి శుభ్రం చేయాల్సి వ‌చ్చింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. విదేశాల్లో నివసించే భారతీయుల (NRIs) మధ్య పౌర బాధ్యత, సామాజిక స్పృహపై ఈ ఘటన పెద్ద ఎత్తున చ‌ర్చ‌కు దారి తీస్తోంది.

అక్క‌డి భార‌తీయుల ప్ర‌వ‌ర్త‌న‌ను కొంద‌రు నెటిజ‌న్లు తీవ్రంగా త‌ప్పుబ‌డుతున్నారు. పండుగ సంబ‌రాల పేరుతో బ‌హిరంగ ప్ర‌దేశాల‌ను ఇంత‌లా చెత్త‌మ‌యంగా చేయ‌డం స‌రికాద‌ని వ్యాఖ్యానిస్తున్నారు. "పండుగ జరుపుకోవడం సంతోషమే.. కానీ మన చెత్తను మనమే శుభ్రం చేసుకోవాలనే కనీస బాధ్యత ఉండాలి" అని కామెంట్లు చేస్తున్నారు. ఇలాంటి ఘ‌ట‌న‌ల వ‌ల్ల స్థానిక అమెరిక‌న్ల‌లో భార‌తీయుల ప‌ట్ల‌, మ‌న సంస్కృతి ప‌ట్ల ప్ర‌తికూల ప్ర‌భావం ప‌డే ప్ర‌మాదం ఉంద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.

Also Read..

సాయం కోసం ఎదురుచూస్తుండ‌గా రోడ్డు ప్ర‌మాదం.. దుబాయ్‌లో భార‌తీయ విద్యార్థిని దుర్మ‌ర‌ణం

బిలాంగింగ్ కాదు వైట్‌వాషింగ్ అని పెట్టాల్సింది.. సోనియా ఆత్మ‌క‌థ‌పై బీజేపీ విమ‌ర్శ‌లు

పీవీ ఎక్స్‌ప్రెస్‌ వేపై ప్రమాదం.. భారీగా స్తంభించిన ట్రాఫిక్

Advertisement
Advertisement