త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Woman Home Guard Murdered | మహిళా హోంగార్డు మహబూబీ దారుణ‌ హత్య.. చంపింది ఎవ‌రంటే!

Woman Home Guard Murdered | న‌ల్ల‌గొండ (Nallagonda) జిల్లాలో దారుణం జ‌రిగింది. మ‌హిళా హోంగార్డు మ‌హ‌బూబీ (Woman Home Guard Mahaboobi) దారుణ హ‌త్య‌కు గుర‌య్యారు.

S

Telangana | Published On Nov 10, 2026, 1.36 pm IST

Woman Home Guard Murdered | మహిళా హోంగార్డు మహబూబీ దారుణ‌ హత్య.. చంపింది ఎవ‌రంటే!
Advertisement

Woman Home Guard Murdered | త్రినేత్ర న్యూస్‌: న‌ల్ల‌గొండ (Nallagonda) జిల్లాలో దారుణం జ‌రిగింది. మ‌హిళా హోంగార్డు మ‌హ‌బూబీ (Woman Home Guard Mahaboobi) దారుణ హ‌త్య‌కు గుర‌య్యారు. నల్లగొండ రూరల్ పోలీస్‌స్టేష‌న్‌ సమీపంలో పోలీస్ క్వార్టర్స్ లో మంగ‌ళ‌వారం ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. హెడ్‌క్వార్టర్స్‌లో విధులు నిర్వహిస్తున్న మెహబూబీని భర్త సతీశ్‌ గొంతు నులిమి హత్య చేసినట్లు ప్రాథమిక సమాచారం.

ఇద్దరూ కులాంతర వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది. భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవని స్థానికులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న వన్‌టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. నిందితుడు స‌తీశ్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నామ‌ని.. విచార‌ణ అనంత‌రం పూర్తి వివ‌రాలు వెల్ల‌డిస్తామ‌ని వ‌న్‌టౌన్‌ పోలీసులు తెలిపారు. కాగా మృతురాలికి ముగ్గురు పిల్ల‌లున్నారు.

Advertisement
Advertisement