Singireddy Niranjan Reddy | పాలమూరును వెయ్యేళ్లకు సరిపడా విధ్వంసం చేసింది కాంగ్రెస్సే
Singireddy Niranjan Reddy | పాలమూరు(Palamuru)ను వెయ్యేళ్లకు సరిపడా విధ్వంసం చేసింది కాంగ్రెస్ పార్టీయేనని.. పంటలు వేయొద్దని చెప్పిన మొదటి సీఎంగా రేవంత్ రెడ్డి నిలబడిపోతాడని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి (Singireddy Niranjan Reddy) ఎద్దేవా చేశారు.
- నిన్న రైతు పేరిట సభ వెట్టి రాజకీయం మాట్లాడిండు
- ఆరుతడి పంటలకు కూడా నీళ్లు, కరెంటు ఎట్లనేది ఎందుకు చెప్పలే
- యాసంగి రైతుబంధుపై ఎందుకు మాట్లాడలే
- కొడంగల్ కు చేస్తే పాలమూరుకు ఏం సంబంధం
- కేటీఆర్ పొరపాటున కూడా రేవంత్ రెడ్డి కాడు.. కేటీఆర్ కేటీఆరే
- మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి విమర్శలు
Singireddy Niranjan Reddy | త్రినేత్ర న్యూస్: పాలమూరు(Palamuru)ను వెయ్యేళ్లకు సరిపడా విధ్వంసం చేసింది కాంగ్రెస్ పార్టీయేనని.. పంటలు వేయొద్దని చెప్పిన మొదటి సీఎంగా రేవంత్ రెడ్డి నిలబడిపోతాడని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి (Singireddy Niranjan Reddy) ఎద్దేవా చేశారు. ఆరుతడి పంటలు వేయమన్న రేవంత్.. నీళ్లు, కరంటు సంగతి ఎట్లా అనే విషయాన్ని ఎందుకు చెప్పలేదన్నారు. కొడంగల్‌లో రైతుసభ పెట్టి ఎండిన పంటలకు ఏం ఇస్తారో ఎందుకు చెప్పలేదని నిలదీశారు. యాసంగి రైతుబంధుపై ఎందుకు చెప్పలేదన్నారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రేవంత్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు.
పాలమూరు పచ్చబడ్డదే కేసీఆర్ నాయకత్వాన. కాంగ్రెస్ పార్టీ సమైక్య రాష్ట్రంలో పాలమూరును కలపకుంటే అప్పర్ కృష్ణా, భీమా, ఆర్డీఎస్, తుంగభద్ర హై లెవెల్ కాలువల ద్వారా 1960 దశకం నాటికే పాలమూరులో 20 లక్షల ఎకరాలు గ్రావిటీ ద్వారా పాలమూరు జిల్లాలో పారి ఉండేది. కాంగ్రెస్ తెలంగాణను ఆంధ్రతో కలపడం, నిజాం కాలం నాటి ప్రాజెక్టుల ప్రతిపాదనలను కాంగ్రెస్ ముఖ్యమంత్రులు పక్కనపెట్టి పాలమూరు ప్రజల గొంతు కోసింది కాంగ్రెస్ పార్టీ. ఆ రోజే గ్రావిటీ ప్రాజెక్టులు కట్టుకుని ఉంటే ఈ రోజు పాలమూరు రైతాంగం లిఫ్టుల కోసం ఎదురు చూడాాల్సిన పరిస్థితి ఉండేది కాదు. కాంగ్రెస్ చేసిన దుర్మార్గం, విధ్వంసం మూలంగా మూడు తరాల పాలమూరు కోలుకోకుండా చేసింది.
దానిని సరిచేసే ప్రయత్నం కేసీఆర్ చేసుకుంటూ వచ్చారు. దాన్ని అడ్డుకునేందుకు కాంగ్రెస్ అన్ని ప్రయత్నాలు చేసింది. అయినా అన్ని అడ్డంకులు అధిగమించి కేసీఆర్ రూ.35 వేల కోట్లతో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు పూర్తి చేశారు. తల్లి చనిపోతే దినాలు, కర్మ చేసుకోవడానికి నెత్తిన నీళ్లు చల్లుకోవడానికి కరెంటు లేదు, నీళ్లు లేవు అని శాసనసభలో రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పుకున్నారు. ఇది కాంగ్రెస్ పరిపాలన అని ఎద్దేవా చేసింది రేవంత్ రెడ్డి. నువ్వు మరిచిపోయావని గుర్తుచేస్తున్నాం.
ఆలస్యంగా పుట్టినరోజు శుభాకాంక్షలు
పాలమూరు నీళ్లను వినియోగించుకుంటే ఈ రోజు పాలమూరు ముఖచిత్రం మారిపోయి ఉండేది. ఇప్పుడున్న నీళ్లను వాడుకోమన్నా పట్టించుకోవడం లేదు. రేవంత్ రెడ్డికి ఆలస్యంగా పుట్టిన రోజు శుభాకాంక్షలు. ప్రభుత్వ ఖర్చుతో పుట్టినరోజు చేసుకున్న ఏకైక సీఎం రేవంత్ రెడ్డి అయి ఉంటాడు. ప్రభుత్వ ఖర్చుతో ఏర్పాటైన వేదికల మీద తన పుట్టినరోజు వేడుకలు చేసుకోవడం, అక్కడ రాజకీయాలు మాట్లాడడం, అందులో ప్రతిపక్ష పార్టీని, ప్రతిపక్ష నాయకుడిని ధూషించడం రేవంత్ కే చెల్లింది.
తిప్పడు తిరునాళ్లకు పోయిండు.. రానే వచ్చిండు అన్నట్లుంది
సమాజం గమనిస్తుంది అనే విషయాన్ని కూడా బేఖాతరు చేస్తూ ఎవ్వడేమన్న అనుకోని నేను ఇట్లే మాట్లాడతా ఒక అజ్ఞానంతో కూడిన అహంకార పూరితమైనటువంటి ప్రదర్శిస్తున్నాడు. రాష్ట్ర ఖ్యాతిని, పరువునే కాకుండా, ముఖ్యమంత్రి స్థానానికి ఉండే మర్యాదను కానీ ఏనాడు కాపాడే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేయకపోవడం బాధాకరం. రేవంత్ రెడ్డి కొడంగల్ పర్యటన తిప్పడు తిరునాళ్లకు పోయిండు.. రానే వచ్చిండు అన్నట్లుంది. సొంత నియోజకవర్గానికి వెళ్లడంలో ప్రత్యేకత ఏంటి? కొడంగల్ పర్యటనకు పాలమూరుకు ఏం సంబంధం? మిగిలిన 13 నియోజకవర్గాలకు చేసింది ఏంటి?
కేసీఆర్ పాలనలో గజ్వేల్ నియోజకవర్గం అభివృద్ధి చేయడంతో పాటు, రాష్ట్రంలోని అయిదు, ఆరు నియోజకవర్గాలు మినహా మిగిలిన నియోజకవర్గాలకు లక్ష ఎకరాల చొప్పున నీళ్లు ఇవ్వాలన్న సంకల్పంతో పనిచేసి సాగునీరు అందించారు. కేసీఆర్ చేసిన పనులు ఎక్కడికి వెళ్లినా కనిపిస్తూ వెక్కిరిస్తున్నందునే రేవంత్ రెడ్డి ఏమీ చేయలేక కేసీఆర్, కేటీఆర్ స్మరణ చేస్తూ తిట్లదండకం చేస్తున్నావు. తిట్లు తిండిపెట్టవు, ఎండిన పంటలకు నీళ్లు ఇవ్వవు, రైతన్నలకు మనోధైర్యం ఇవ్వవు.
35 నెలలలో పాలమూరుకు పట్టుమని రేవంత్ రెడ్డి చేసిన పనులు ఏంటి? పాలమూరు ప్రజలకు వచ్చిన ఉపాధి ఏంటి చూయించాలి? కనీసం అదనంగా ఒక్క ఎకరాకు అయినా సాగునీళ్లు వచ్చాయా? పదే పదే ప్రశ్నిస్తే మొక్కుబడిగా పాలమూరు ప్రాజెక్టులు సందర్శించి చేతులు దులుపుకుని వెళ్లారు. పచ్చని పాలమూరు మీద రేవంత్ రెడ్డి పగబట్టాడు. జూరాలలో 9 టీఎంసీల సాగునీళ్లు ఉన్నా రైతులకు ఇవ్వకుండా వేధించారు. తాగునీళ్ల పేరుతో రైతుల పొలాలు ఎండబెడితే రైతులే స్వయంగా నీళ్లు వదులుకున్నారు. ప్రస్తుతం పంటలు చివరి దశకు వచ్చాయి.
తెలంగాణ మంత్రులను కర్ణాటక నుండి నీళ్లు విడుదల చేయాలని పంపించారు. వాళ్లు వెళ్లి వచ్చినా ఒక్కచుక్క నీరు కర్ణాటక వదిలింది లేదు. కర్ణాటకలో 17 లక్షల ఎకరాలలో వరి సాగు చేశారు. కిందకు నీళ్లు వస్తాయి అని చెప్పినా ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు. కర్ణాటక నుండి నీళ్లు విడుదల చేయాలని ప్రభుత్వం కనీసం ఒక్క లేఖ కూడా రాయలేదు. వచ్చిన నీళ్లను ఎలా వినియోగించుకోవాలో ఈ ప్రభుత్వానికి ప్రణాళిక, చిత్తశుద్ధి లేదు.
జూరాల దిగువకు ఈ ఏడాది 245 టీఎంసీలు నీళ్లు వచ్చాయి అని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఇందులో శ్రీశైలం నుండి అధికారికంగా 75 టీఎంసీలు, అనధికారికంగా 20 టీఎంసీలు ఏపీ తరలించుకుపోయింది. గత 45 రోజులుగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పంపులు నడిపితే నార్లాపూర్, ఏదుల, వట్టెం రిజర్వాయర్లు నింపుకునే అవకాశం ఉండేది. దాంతో భూగర్భజలాలు పెరిగేవి. కేవలం మూడు వంతెనల వద్ద మట్టి తీస్తే సాగునీరు తరలించే అవకాశం ఉండేది. అఖిలపక్ష సమావేశంలో ఈ విషయం చెబితే నీటిపారుదల శాఖా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పట్టించుకోలేదు. రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కాలువల టెండర్లను రద్దు చేశారు.
కొండగల్ అభివృద్ధి మీద ఈర్ష పడుతున్నారు అని రేవంత్ అంటున్నాడు. ఈ విషయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులకు తప్ప మాకెవ్వరికీ ఈర్ష లేదు. దాంతో పాటు కొన్ని కోట్లు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు ఖర్చు చేస్తే లక్షలాది ఎకరాలకు సాగునీరు అందేది కదా. కొండగల్ ఎత్తిపోతల ద్వారా సాగునీళ్లు వచ్చేది ఎన్నడో కానీ ఇఫ్పటికే రావాల్సిన సాగునీటిని రాకుండా చేశారు. 10, 15 లక్షల ఎకరాలకు సాగునీరు వస్తే మరో 15 లక్షల మందికి ఉపాధి లభించేది. కాళేశ్వరం మీద పగబట్టావు మరి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పనులను నిలపడానికి కారణం ఏంటి? కాళేశ్వరంలో మూడు పిల్లర్లను సరిచేయడానికి మూడేళ్లుగా అడుగు ముందుకు పడడం లేదు. ఇప్పటికైనా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పంపులను ఆన్ చేసి నీళ్లను ఎత్తిపోయాలి
అది చెప్పడానికి నువ్వే కావాలా?
నీళ్లు లేవు. కరువు వచ్చింది అని చెప్పడానికి సీఎం రేవంత్ రెడ్డినే కావాలా. తన ఉన్మాద భాషను మార్చుకోవాలి. కేసీఆర్, కేటీఆర్ నీకు పోటీనే కానప్పుడు ప్రతిరోజూ వారి గురించి ఎందుకు మాట్లాడుతున్నావు. ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుండి అధికారంలోకి వచ్చి మూడేళ్లు అవుతున్నా అవే ఆరోపణలు చేస్తున్నారు. మీరు చెబుతున్నది అబద్దాలు అని ప్రజలకు అర్థం అయింది. కానీ మీరు ఇంకా ప్రజలు నమ్ముతారన్న భ్రమల్లో ఉన్నారు.
రాహుల్ గాంధీ రాజ్యాంగం పట్టుకుని తిరుగుతూ ద్వేషించే వాళ్లని ప్రేమిస్తా అని తిరుగుతున్నాడు. రేవంత్ రెడ్డి మౌనంగా ఉన్న వాళ్లని ద్వేషిస్తూ తిరుగుతున్నాడు. ఈయన నఫ్రత్ చూసేనా కాంగ్రెస్ పెద్దలు కనీసం జన్మదిన శుభాకాంక్షలు చెప్పలేదా? ఎల్ నినో నేపథ్యంలోనే జాతీయ, అంతర్జాతీయ సంస్థలు చర్యలు తీసుకోవాలని ఏడెనిమిది నెలలుగా సూచనలు చేస్తున్నాయి. తెలివైన ప్రభుత్వం ప్రజలకు ధైర్యం చెబుతూనే మరోవైపు నిర్ధిష్ట కార్యాచరణ చేయాలి. ఎనిమిది నెలల తర్వాత అఖిలపక్ష సమావేశం పెట్టి అందులో వచ్చిన సూచనలను ఒక్కటీ అమలు చేయలేదు.
24.40 లక్షల ఎకరాలలో పంటలు ఎండిపోయాయని ప్రభుత్వమే చెప్పింది. వాస్తవంగా ఇది 30 లక్షల వరకు ఉంటుంది. ప్రభుత్వం చెప్పిన ప్రకారం అయినా ఈ 24.40 లక్షల ఎకరాలలో నష్టపోయిన రైతంగానికి ప్రభుత్వం పరిహారం ఇస్తుందా ? ఇవ్వదా ? ప్రకటించాలి. కేసీఆర్ హయాంలో పంటలు దెబ్బతింటే నిబంధనలు అనుమతించకున్నా ఎకరాకు రూ.10 వేలు అందజేశాం.
కొడంగల్ లో రైతుసభ అని పెట్టి ఎండిన పంటలకు ఏం ఇస్తారో ఎందుకు చెప్పలేదు ? యాసంగి రైతుబంధు గురించి ఎందుకు చెప్పలేదు ? రైతుబీమా గురించి ఎందుకు చెప్పలేదు ? ఆగస్టు 14తో రైతుబీమా ముగిసింది కదా .. మరి ఆ తర్వాత చనిపోయిన రైతు కుటుంబాలకు ఏం ఇస్తారు ? ఇందిరమ్మ బీమా ఎప్పటి నుండి అమలులోకి వస్తుంది ? ఈ విషయాలు చెబుతావని రైతులు ఎదురుచూస్తే కేసీఆర్ మీద విమర్శలు చేయడం ఏంటి ?
వరుసబెట్టి హామీలు ఇవ్వడం తప్ప అమలు చేసిన ఘనకార్యం ఏమీ లేదు. ఉస్మానియాకు వెళ్లి వెయ్యి కోట్లు అని హామీ ఇచ్చాడు. ఏడాది దాటినా ఇప్పటి వరకు దిక్కు లేదు. రేవంత్ విద్యను పెళ్లి చేసుకున్నాడు అని చెప్పిన ఆచార్యులు ముక్కున వేలేసుకున్నారు. స్వభజన, పరభజన, పరస్పర భజన చాలా ముందుకు వెళ్లింది. మరి వెయ్యికోట్లు ఎక్కడికి పోయాయి ? కళ్యాణ లక్ష్మి, తులంబంగారం, స్కూటీ, విద్యార్థుల పారితోషికాలు ఎక్కడికి పోయాయి ? దేశంలో అత్యంత విఫల సర్కార్ రేవంత్ రెడ్డి సర్కార్.
సీఎం స్థాయి వ్యక్తి గడ్డం, మీసాల గురించి మాట్లాడతాడా ? కేటీఆర్ గడ్డాలు, మీసాలు రేవంత్ రెడ్డికి దేనికి అడ్డం వచ్చాయి ? దేశంలో గడ్డం పెంచుకున్నది మొదట రేవంత్ రెడ్డేనా ? గడ్డం పెంచుకున్న వారిలో పోటీకి పెడితే రేవంత్ రెడ్డికి అందాల పోటీకి వచ్చినవా ? వ్యక్తిగత ఆహార్యం గురించే దిగజారుడు స్థాయి ఏంటి? ఎవరి స్థాయి, పరిపాలన, ప్రతిభ ఏంటో తీర్పు ఇవ్వాల్సింది ప్రజలు. రెండేళ్ల తరువాత ప్రజలు తీర్పు ఇస్తారు. నువ్వు ఏం చేసినా కేటీఆర్ రేవంత్ రెడ్డి కాలేడు అంటున్నావు. కేటీఆర్ పొరపాటున కూడా రేవంత్ రెడ్డి కాడు. కేటీఆర్ కేటీఆరే. ఎవరి దక్షత, అవగాహన వారికి ఉంటది. రేవంత్ రాక్షస భాష మార్చుకుంటే బాగుంటుంది.
కొడంగల్ లో రేవంత్ రెడ్డికి ప్రజల్లో అంత అభిమానం ఉంటే పది నియోజకవర్గాల నుండి ప్రజలను ఎందుకు తరలించుకు తీసుకుపోయారు? మహిళా సంఘాలను, రైతులను అధికారులకు టార్గెట్లు పెట్టి తరలించింది వాస్తవం కాదా? పాలమూరు పనులు పూర్తి చేసి సాగునీళ్లు అందించి ఉంటే ప్రజల్లో ఆదరణ ఉండేది. కేసీఆర్ మీద కక్షతో పనులు నిలిపివేశారు. కొడంగల్ ప్రజలకు జరిగిన తక్షణ లాభం ఏంటి ? కొడంగల్ లో పనులు చేస్తున్నది అంతా ఆంధ్రా కాంట్రాక్టర్లే. అక్కడ కాంగ్రెస్ నాయకులను అడిగినా ఈ విషయం చెబుతారు. రాబోయే రెండేళ్ల తరువాత కాంగ్రెస్ పాలనకు ప్రజలే మార్కులు వేస్తారు. ఆ లోపు రేవంత్ రెడ్డి తన భాష మార్చుకుంటే బాగుంటుంది అని నిరంజన్‌రెడ్డి హితవు పలికారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Woman Home Guard Murdered | మహిళా హోంగార్డు మహబూబీ దారుణ హత్య.. చంపింది ఎవరంటే!
నవంబర్ 10, 2026

Harish Rao | ఉద్యమకారుడు లక్ష్మణ్ గౌడ్‌పై అక్రమ కేసు పెట్టారు.. ఆయన మరణం దురదృష్టకరం
నవంబర్ 10, 2026

Nitin Nabin | 18న రాష్ట్రానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్.. కరీంనగర్లో మహా పాదయాత్ర
నవంబర్ 10, 2026
తాజావార్తలు
- ●Diwali celebration | దీపావళి వేడుకలతో చెత్తమయమైన న్యూజెర్సీ రోడ్లు.. నెట్టింట విమర్శలు
- ●Gold Prices | జేపీ మోర్గాన్ సంచలనం.. ఈ ఏడాది చివరి వరకు బంగారం ధర @ రూ.5 లక్షలు..?
- ●Woman Home Guard Murdered | మహిళా హోంగార్డు మహబూబీ దారుణ హత్య.. చంపింది ఎవరంటే!
- ●Indian student was killed | సాయం కోసం ఎదురుచూస్తుండగా రోడ్డు ప్రమాదం.. దుబాయ్‌లో భారతీయ విద్యార్థిని దుర్మరణం
- ●Nvidia | ఎన్విడియా పతనం.. భారత ఇన్వెస్టర్లకు భారీ నష్టాల ముప్పు..?
- ●Harish Rao | ఉద్యమకారుడు లక్ష్మణ్ గౌడ్‌పై అక్రమ కేసు పెట్టారు.. ఆయన మరణం దురదృష్టకరం

Diwali celebration | దీపావళి వేడుకలతో చెత్తమయమైన న్యూజెర్సీ రోడ్లు.. నెట్టింట విమర్శలు

Gold Prices | జేపీ మోర్గాన్ సంచలనం.. ఈ ఏడాది చివరి వరకు బంగారం ధర @ రూ.5 లక్షలు..?

Woman Home Guard Murdered | మహిళా హోంగార్డు మహబూబీ దారుణ హత్య.. చంపింది ఎవరంటే!

Indian student was killed | సాయం కోసం ఎదురుచూస్తుండగా రోడ్డు ప్రమాదం.. దుబాయ్‌లో భారతీయ విద్యార్థిని దుర్మరణం



