Gold Prices | జేపీ మోర్గాన్ సంచలనం.. ఈ ఏడాది చివరి వరకు బంగారం ధర @ రూ.5 లక్షలు..?
Gold Prices | అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు సమీప కాలంలో ఒడిదొడుకులకు గురయ్యే అవకాశం ఉన్నప్పటికీ, 2026 చివరి నాటికి ఔన్సు బంగారం ధర 6,000 డాలర్లకు చేరుకునే అవకాశాలు ఉన్నాయని జేపీ మోర్గాన్ అంచనా వేసింది. అమెరికా ఆర్థిక పరిస్థితులు, వడ్డీ రేట్లపై అనిశ్చితి, ముడి చమురు ధరల మార్పులు బంగారం ధరలపై ప్రభావం చూపనున్నాయి.
Gold Prices | అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు సమీప కాలంలో ఒడిదొడుకులకు గురయ్యే అవకాశం ఉన్నప్పటికీ, 2026 చివరి నాటికి ఔన్సు బంగారం ధర 6,000 డాలర్లకు చేరుకునే అవకాశాలు ఉన్నాయని జేపీ మోర్గాన్ అంచనా వేసింది. అమెరికా ఆర్థిక పరిస్థితులు, వడ్డీ రేట్లపై అనిశ్చితి, ముడి చమురు ధరల మార్పులు బంగారం ధరలపై ప్రభావం చూపనున్నాయి.
బంగారం ధరలకు మళ్లీ రెక్కలు వస్తాయా?
దీపావళి మరుసటి రోజైన సోమవారం అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు తిరిగి పుంజుకున్నాయి. ముడి చమురు ధరలు తగ్గడం, అమెరికా డాలర్ బలహీనపడడం ఇందుకు ప్రధాన కారణాలుగా నిలిచాయి. గత కొన్ని రోజులుగా బంగారం ధరల్లో తీవ్ర ఒడిదొడుకులు కనిపిస్తున్నాయి. అమెరికా మధ్యంతర ఎన్నికల అనంతరం ధరలు పెరగ్గా, బలమైన ఉద్యోగ గణాంకాలు వెలువడడంతో ఫెడరల్ రిజర్వ్ డిసెంబర్‌లో వడ్డీ రేట్లు పెంచుతుందనే అంచనాలు బంగారం ధరలపై ఒత్తిడి పెంచాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుత ధరతో పోలిస్తే సుమారు 46.34 శాతం పెరిగి, 2026 చివరి నాటికి ఔన్సు బంగారం ధర 6,000 డాలర్లకు (సుమారుగా రూ.5 లక్షలు) చేరుతుందని జేపీ మోర్గాన్ అంచనా వేసింది.
అనుకూలంగా మారుతున్న పరిస్థితులు..
సోమవారం స్పాట్ గోల్డ్ ధర 0.74 శాతం పెరిగి ఔన్సుకు 4,100.38 డాలర్లకు చేరింది. స్పాట్ సిల్వర్ ధర కూడా 1.13 శాతం పెరిగి 52.54 డాలర్లకు చేరుకుంది. దేశీయ మార్కెట్లో ఎంసీఎక్స్ డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ 0.71 శాతం పెరిగి 10 గ్రాములకు రూ.1,43,547కు చేరగా, వెండి డిసెంబర్ ఫ్యూచర్స్ 1.12 శాతం పెరిగి కిలోకు రూ.1,87,180 వద్ద ట్రేడయ్యాయి. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధర 4.5 శాతం తగ్గి బ్యారెల్‌కు 93.86 డాలర్లకు పడిపోయింది. ఇరాన్‌పై విస్తృత స్థాయిలో దాడులు చేసే అవకాశం చాలా తక్కువని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించడంతో అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గాయి.
భారీగా బంగారం కొంటున్న చైనా..
2026లో ముడి చమురు, బంగారం ధరలు పరస్పర విరుద్ధ దిశల్లో కదులుతున్నాయని నివేదిక పేర్కొంది. ఇంధన ధరలు పెరిగినప్పుడు ద్రవ్యోల్బణం, కఠిన ద్రవ్య విధానంపై అంచనాలు పెరగడం బంగారానికి ప్రతికూలంగా మారుతోంది. మరోవైపు అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉండడం కూడా బంగారంపై ఒత్తిడి పెంచనుంది. అయితే అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టే సంకేతాలతో ట్రెజరీ బాండ్ల రాబడులు, ముడి చమురు ధరలు తగ్గుతున్నాయి. కాగా చైనా కేంద్ర బ్యాంకు అక్టోబర్‌లోనూ బంగారం నిల్వలను పెంచుకుంది. దీంతో వరుసగా రెండేళ్లుగా బంగారం కొనుగోళ్లను కొనసాగిస్తున్నట్లు బ్లూమ్‌బెర్గ్ తెలిపింది.
సంబంధిత వార్తలు

Gold And Silver Prices Today | బంగారం ర్యాలీకి బ్రేక్.. ఒక మోస్తరుగా తగ్గిన పసిడి ధరలు.. పెట్టుబడులకు సరైన సమయమా..?
నవంబర్ 10, 2026

Gold And Silver Prices Today | ఒక్క రోజులోనే రూ.10వేలకు పైగా పెరిగిన బంగారం ధర.. పెట్టుబడిదారుల్లో జోష్..
నవంబర్ 9, 2026

Gold And Silver Prices Today | దీపావళి ముందు బంగారం ధరల్లో భారీ హెచ్చుతగ్గులు.. స్వల్పంగా పెరిగిన ధరలు..
నవంబర్ 7, 2026
తాజావార్తలు
- ●American Express | రాత్రికి రాత్రే లక్షల రివార్డ్ పాయింట్లు మాయం.. అమెరికన్ ఎక్స్‌ప్రెస్‌పై కస్టమర్ల ఆగ్రహం..
- ●Renu Desai | మగాడు ఎన్ని పెళ్లిళ్లయినా చేసుకోవచ్చు - రేణుదేశాయ్ పాత కామెంట్లు ఇప్పుడు వైరల్
- ●Singireddy Niranjan Reddy | పాలమూరును వెయ్యేళ్లకు సరిపడా విధ్వంసం చేసింది కాంగ్రెస్సే
- ●Diwali celebration | దీపావళి వేడుకలతో చెత్తమయమైన న్యూజెర్సీ రోడ్లు.. నెట్టింట విమర్శలు
- ●Woman Home Guard Murdered | మహిళా హోంగార్డు మహబూబీ దారుణ హత్య.. చంపింది ఎవరంటే!
- ●Indian student was killed | సాయం కోసం ఎదురుచూస్తుండగా రోడ్డు ప్రమాదం.. దుబాయ్‌లో భారతీయ విద్యార్థిని దుర్మరణం

American Express | రాత్రికి రాత్రే లక్షల రివార్డ్ పాయింట్లు మాయం.. అమెరికన్ ఎక్స్‌ప్రెస్‌పై కస్టమర్ల ఆగ్రహం..

Renu Desai | మగాడు ఎన్ని పెళ్లిళ్లయినా చేసుకోవచ్చు - రేణుదేశాయ్ పాత కామెంట్లు ఇప్పుడు వైరల్

Singireddy Niranjan Reddy | పాలమూరును వెయ్యేళ్లకు సరిపడా విధ్వంసం చేసింది కాంగ్రెస్సే

Diwali celebration | దీపావళి వేడుకలతో చెత్తమయమైన న్యూజెర్సీ రోడ్లు.. నెట్టింట విమర్శలు



