Donald Trump | జిన్‌పింగ్ స్నేహితుడిగా ఉండటం నాకు గర్వకారణం : ట్రంప్
Donald Trump | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత చైనాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా చైనా అధ్యుక్షుడు షీ జిన్‌పింగ్‌పై ట్రంప్ ప్రశంసలు కురిపించారు. జిన్‌పింగ్ ఒక గొప్ప నాయకుడు అంటూ కొనియాడారు. ఆయన్ని కలవడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు.
International | Published On May 14, 2026, 11.45 am IST
Donald Trump | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత చైనాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా చైనా అధ్యుక్షుడు షీ జిన్‌పింగ్ (Xi Jinping)తో భేటీ అయ్యారు. బీజింగ్‌లోని గ్రేట్ హాల్ ఆఫ్ ది పీపుల్ వేదికగా ఇరువురు నేతలు కలుసుకున్నారు. ఇరుదేశాల ప్రతినిధి బృందాల మధ్య జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో జిన్‌పింగ్‌పై ట్రంప్ ప్రశంసలు కురిపించారు. జిన్‌పింగ్ ఒక గొప్ప నాయకుడు అంటూ కొనియాడారు. ఆయన్ని కలవడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు.
జిన్‌పింగ్‌తో తన భేటీని అతిపెద్ద శిఖరాగ్ర సమావేశంగా ట్రంప్ అభివర్ణించారు. కేవలం దౌత్యపరమైన అంశాలనే కాకుండా, చైనా అధ్యక్షుడితో తనకున్న వ్యక్తిగత సాన్నిహిత్యం గురించి కూడా ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. జిన్‌పింగ్‌ను ఒక గొప్ప నాయకుడిగా కొనియాడారు. అంతేకాదు ఆయన స్నేహితుడిగా ఉండటం తనకు గర్వకారణమని తెలిపారు. "మేము కలిసే ఉన్నాము. ప్రజలకు ఈ విషయం తెలీదు.. ఇబ్బందులు ఎదురైనప్పుడు వాటిని మేము చాలా తర్వగా పరిష్కరించుకునేవాళ్లం. జిన్‌పింగ్ గొప్ప నాయకుడు. నేను ఇలా చెప్పడం కొందరికి నచ్చకపోవచ్చు.. అయినా నేను ఇదే చెబుతా. ఎందుకంటే ఇది వాస్తవం కాబట్టి. మీ స్నేహితుడిగా ఉండటం నాకు గర్వకారణం. మనం కలిసి అద్భుతమైన భవిష్యత్తును నిర్మించబోతున్నాం" అని ట్రంప్ చెప్పుకొచ్చారు. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ వీరి భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది.
తేడా వస్తే.. ఘర్షణే
ఇక ట్రంప్‌తో భేటీలో అమెరికాకు జిన్‌పింగ్ కీలక హెచ్చరికలు చేశారు. చైనా-యూఎస్ సంబంధాల్లో తైవాన్ అంశమే కీలకమని ట్రంప్‌కు జిన్‌పింగ్ స్పష్టం చేశారు. తైవాన్ జలసంధి (Taiwan Strait) వెంబడి శాంతి, స్థిరత్వాన్ని పరిరక్షించడమే ఇరు దేశాల సంబంధాల్లో అత్యంత ముఖ్యమైన అంశమని చెప్పారు. తైవాన్ అంశాన్ని సరిగ్గా డీల్ చేయకపోతే ఇరు దేశాల మధ్య ఘర్షణ తలెత్తే ప్రమాదం ఉందని ట్రంప్‌ను హెచ్చరించినట్లు చైనా ప్రభుత్వ మీడియా వెల్లడించింది.
ప్రపంచమంతా తమ భేటీని ఎంతో ఆసక్తిగా గమనిస్తోందని జిన్‌పింగ్ అన్నారు. అమెరికా, చైనా దేశాలు పరస్పరం ప్రత్యర్థులుగా కాకుండా, వ్యూహాత్మక భాగస్వామ్య దేశాలుగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఒకరికొకరు సహకరించుకుంటూ అభివృద్ధి పథంలో ముందుకు సాగడం వల్ల ఇరు దేశాలకే కాకుండా, మొత్తం ప్రపంచానికి ఎంతో మేలు జరుగుతుందని జిన్‌పింగ్ అభిప్రాయపడ్డారు.
Also Read..
ఢిల్లీలో మరో నిర్భయ తరహా ఘటన.. బస్సులో మహిళపై సామూహిక అత్యాచారం
తాజావార్తలు
- ●CM Revanth Reddy | నర్సు హత్య ఘటనపై మెజిస్ట్రీయల్ విచారణకు సీఎం ఆదేశం
- ●TRESA | ట్రెసా అధ్యక్షులుగా కే గౌతమ్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా ఎల్ రమణ్ రెడ్డి
- ●KCR | సాగునీటి కోసం మరో యుద్ధానికి సిద్ధం : కేసీఆర్
- ●Ananthika | మార్షల్ ఆర్ట్స్‌తో క్రమశిక్షణ : అనంతిక
- ●Harish Rao | వార్డు మెంబర్ కూడా కాని.. తిరుపతి రెడ్డికి రూ. 40 కోట్లతో భద్రత అవసరమా..?
- ●Harish Rao | కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్.. రేవంతే రాజీనామా చేయాలి

CM Revanth Reddy | నర్సు హత్య ఘటనపై మెజిస్ట్రీయల్ విచారణకు సీఎం ఆదేశం

TRESA | ట్రెసా అధ్యక్షులుగా కే గౌతమ్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా ఎల్ రమణ్ రెడ్డి

KCR | సాగునీటి కోసం మరో యుద్ధానికి సిద్ధం : కేసీఆర్

Ananthika | మార్షల్ ఆర్ట్స్‌తో క్రమశిక్షణ : అనంతిక






