Delhi Gang Rape | ఢిల్లీలో మరో నిర్భయ తరహా ఘటన.. బస్సులో మహిళపై సామూహిక అత్యాచారం
Delhi Gang Rape | దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో దారుణం చోటు చేసుకుంది. సరిగ్గా 13 ఏళ్ల కిందట జరిగిన నిర్భయ తరహా ఉదంతం వెలుగు చూసింది. మహిళపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్, కండక్టర్ అఘాయిత్యానికి పాల్పడ్డారు.
Delhi Gang Rape | దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో దారుణం చోటు చేసుకుంది. సరిగ్గా 13 ఏళ్ల కిందట జరిగిన నిర్భయ తరహా ఉదంతం వెలుగు చూసింది. ఓ మహిళపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్, కండక్టర్ అఘాయిత్యానికి పాల్పడ్డారు (Delhi Gang Rape). ఈ ఘటన మే 11వ తేదీన జరగ్గా ఇప్పుడు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ప్రకారం.. సోమవారం రాత్రి ఢిల్లీలోని రాణిబాగ్ ప్రాంతంలో (Rani Bagh area) ఈ ఘటన చోటు చేసుకుంది. బస్సులో ఇద్దరు వ్యక్తులు తనపై అత్యాచారం చేసినట్లు మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది. పీతంపురాలోని ఒక మురికివాడలో నివసించే బాధితురాలు.. మంగోల్‌పురిలోని ఒక ఫ్యాక్టరీలో పని చేస్తోంది. ఆమెకు పెళ్లై ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. ఎప్పటి లాగానే సోమవారం కూడా ఆమె పనికి వెళ్లింది. విధులు ముగించుకొని సాయంత్రం ఇంటికి బయల్దేరింది. ఇంటికి వెళ్లేందుకు ఆమె సరస్వతీ విహార్ బస్టాండ్ వద్ద వేచి ఉంది.
అదే సమయంలో అక్కడికి ఓ బస్సు వచ్చి ఆగడంతో ఆమె ఎక్కింది. ఇంతలోనే బస్సు డ్రైవర్, కండక్టర్ ఆమెను బలవంతంగా లోపలికి లాగేసుకున్నారు. కదులుతున్న బస్సులోనే ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం బాధితురాలిని నంగ్లోయ్ సమీపంలోని ఒక నిర్మానుష్య ప్రాంతంలో రోడ్డు పక్కన పడేసి నిందితులు బస్సుతో సహా పరారయ్యారు. తీవ్ర ఆవేదనలో ఉన్న బాధితురాలు ఎలాగోలా పోలీసులను సంప్రదించింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. సుమారు రెండు గంటల పాటూ తనపై అఘాయిత్యం చేశారని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది.
బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించారు. ఈ మేరకు బస్సు డ్రైవర్, కండెక్టర్‌ను అరెస్ట్ చేశారు. వారిని కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు. నిందితుల గత నేర చరిత్రను ఆరా తీయడంతో పాటు, బస్సును ఫోరెన్సిక్ పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపారు.
నిర్భయ ఘటన..
కాగా, తాజా ఘటన 2012 డిసెంబర్ 16న ఢిల్లీలో జరిగిన నిర్భయ ఘటనను గుర్తు చేస్తోంది. ఆనాడు 23 ఏళ్ల పారామెడికల్ విద్యార్థినిపై కదులుతున్న బస్సులో నిందితులు సామూహిక అత్యాచారం చేశారు. ఈ అత్యంత దారుణమైన సామూహిక అత్యాచారం, హత్యోదంతం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటన దేశంలో మహిళల భద్రతపై పెద్ద ఎత్తున ఆందోళనలకు దారితీసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు రామ్ సింగ్ జైలులో ఆత్మహత్య చేసుకోగా.. మరో నలుగురు దోషులకు మార్చి 20, 2020న తీహార్ జైలులో ఉరిశిక్ష అమలు చేశారు. ఒకరు మైనర్ కావడంతో జువెనైల్ హోంకు తరలించారు. ఈ ఘటన తర్వాత భారత ప్రభుత్వం అత్యాచార చట్టాలను కఠినతరం చేసింది. 2013లో మహిళల భద్రత కోసం నిర్భయ ఫండ్ (Nirbhaya Fund)ను ఏర్పాటు చేసి రూ.1000 కోట్ల నిధిని కేటాయించింది.
Also Read..
సైబర్ మోసాలకు అడ్డాగా ఐపీఎల్ 2026.. టిక్కెట్ల పేరుతో బ్యాంకు ఖాతాలు ఖాళీ..
త్రిష మూవీకి ఫైనాన్షియల్ కష్టాలు...సీఎం విజయ్ పర్మిషన్ ఇచ్చినా... కరుప్పు షోస్ క్యాన్సిల్
వరుసగా రెండో సెషన్‌లోనూ స్వల్ప లాభాల్లో మార్కెట్లు.. రూపాయి విలువ మళ్లీ పతనం..
సంబంధిత వార్తలు

Konda Surekha | సీఎం రేవంత్ పైనే చర్యలు తీసుకోండి : మంత్రి కొండా సురేఖ
సెప్టెంబర్ 2, 2026

Team India | అఫ్గాన్‌తో టీ20 సిరీస్‌కు భారత్ జట్టు ప్రకటన.. మళ్లీ జట్టులోకి వచ్చిన సంజూ శాంసన్
సెప్టెంబర్ 1, 2026

Bus Rape Case | మీ వైఫల్యాలను ఇంకెంతకాలం కప్పిపుచ్చుకుంటారు? ఢిల్లీ, యూపీ ప్రభుత్వాలను నిలదీసిన రాహుల్
సెప్టెంబర్ 1, 2026
తాజావార్తలు
- ●CM Revanth Reddy | నర్సు హత్య ఘటనపై మెజిస్ట్రీయల్ విచారణకు సీఎం ఆదేశం
- ●TRESA | ట్రెసా అధ్యక్షులుగా కే గౌతమ్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా ఎల్ రమణ్ రెడ్డి
- ●KCR | సాగునీటి కోసం మరో యుద్ధానికి సిద్ధం : కేసీఆర్
- ●Ananthika | మార్షల్ ఆర్ట్స్‌తో క్రమశిక్షణ : అనంతిక
- ●Harish Rao | వార్డు మెంబర్ కూడా కాని.. తిరుపతి రెడ్డికి రూ. 40 కోట్లతో భద్రత అవసరమా..?
- ●Harish Rao | కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్.. రేవంతే రాజీనామా చేయాలి

CM Revanth Reddy | నర్సు హత్య ఘటనపై మెజిస్ట్రీయల్ విచారణకు సీఎం ఆదేశం

TRESA | ట్రెసా అధ్యక్షులుగా కే గౌతమ్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా ఎల్ రమణ్ రెడ్డి

KCR | సాగునీటి కోసం మరో యుద్ధానికి సిద్ధం : కేసీఆర్

Ananthika | మార్షల్ ఆర్ట్స్‌తో క్రమశిక్షణ : అనంతిక



