Revanth Reddy | కాన్వాయ్‌ని తగ్గించండి.. మోదీ బాటలో సీఎం రేవంత్
Revanth Reddy | ప్రధాని మోదీ బాటలోనే సీఎం రేవంత్ (Revanth Reddy) పయణిస్తున్నారు. అంతర్జాతీయ చమురు సంక్షోభం(Energy Crisis) నేపథ్యంలో దేశ ప్రజలు పొదుపు చర్యలు పాటించాలని ప్రధాని మోదీ (PM Modi) పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.
Revanth Reddy | త్రినేత్ర.న్యూస్: ప్రధాని మోదీ బాటలోనే సీఎం రేవంత్ (Revanth Reddy) పయణిస్తున్నారు. అంతర్జాతీయ చమురు సంక్షోభం(Energy Crisis) నేపథ్యంలో దేశ ప్రజలు పొదుపు చర్యలు పాటించాలని ప్రధాని మోదీ (PM Modi) పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. స్వయంగా ప్రధాని కూడా తన కాన్యాయ్‌ని కుదించుకున్నారు. అదేవిధంగా ఢిల్లీలో ప్రభుత్వ ఉద్యోగులు పబ్లిక్ ట్రాన్స్‌పోర్టును ఉపయోగించేలా ప్రోత్సాహకాలను కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో తన కాన్వాయ్‌లోని వాహనాలను అవసరం మేర తగ్గించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు చెప్పినట్లు సమాచారం. ఇంటిలిజెన్స్ అధికారులు కాన్వాయ్ తగ్గింపుపై కసరత్తు కూడా ప్రారంభించారు.
ప్రధాని పొదుపు బాట..
పశ్చిమాసియాలో సంక్షోభం నేపథ్యంలో దేశ ప్రజలకు పొదుపు మంత్రం పాటించాలని, వృథా ఖర్చులు తగ్గించుకోవాలని సూచించిన మోదీ.. స్వయంగా వాటిని పాటించేందుకు సిద్ధమయ్యారు. ఇంధన వినియోగాన్ని తగ్గించడంలో భాగంగా తన కాన్వాయ్‌లో (Convoy) వాహనాల సంఖ్యను 50 శాతం తగ్గించాలని మోదీ ఆదేశించారు. అదే సమయంలో కాన్వాయ్‌లో విద్యుత్ కార్ల వినియోగాన్ని (Electric Vehicles) పెంచాలని స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (SPG)కి మోదీ సూచించారు. ప్రధాని సూచనల మేరకు స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ అధికారులు చర్యలు తీసుకున్నారు. వాహనాల సంఖ్యను రెండుకు పరిమితం చేశారు. అయితే, ప్రొటోకాల్ ప్రకారం.. ప్రధాని వెళ్లే మార్గాల్లో మాత్రం తప్పనిసరిగా భద్రతా ఏర్పాట్లు కొనసాగించనున్నారు.
ప్రధాని పిలుపుమేరకు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇప్పటికే ఆచరణలోకి దిగారు. మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ తన కాన్వాయ్‌లో వాహనాల సంఖ్యను 13 నుంచి 8కి తగ్గించాలని ఆదేశింఆచరు. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా, రాజస్థాన్ సీఎం భజన్‌లాల్ శర్మ తమ కాన్వాయ్‌లో అనవసరపు వాహనాలు ఉండకూడదని సిబ్బందికి సూచించించారు. కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ తన ఎస్కార్ట్ వాహనాన్ని వాడకూడదని నిర్ణయించారు. పలువురు మంత్రులు కూడా ఆయన బాటలోనే నడుస్తున్నారు.
తాజావార్తలు
- ●CM Revanth Reddy | నర్సు హత్య ఘటనపై మెజిస్ట్రీయల్ విచారణకు సీఎం ఆదేశం
- ●TRESA | ట్రెసా అధ్యక్షులుగా కే గౌతమ్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా ఎల్ రమణ్ రెడ్డి
- ●KCR | సాగునీటి కోసం మరో యుద్ధానికి సిద్ధం : కేసీఆర్
- ●Ananthika | మార్షల్ ఆర్ట్స్‌తో క్రమశిక్షణ : అనంతిక
- ●Harish Rao | వార్డు మెంబర్ కూడా కాని.. తిరుపతి రెడ్డికి రూ. 40 కోట్లతో భద్రత అవసరమా..?
- ●Harish Rao | కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్.. రేవంతే రాజీనామా చేయాలి

CM Revanth Reddy | నర్సు హత్య ఘటనపై మెజిస్ట్రీయల్ విచారణకు సీఎం ఆదేశం

TRESA | ట్రెసా అధ్యక్షులుగా కే గౌతమ్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా ఎల్ రమణ్ రెడ్డి

KCR | సాగునీటి కోసం మరో యుద్ధానికి సిద్ధం : కేసీఆర్

Ananthika | మార్షల్ ఆర్ట్స్‌తో క్రమశిక్షణ : అనంతిక






