Gold And Silver Prices Today | పసిడి పరుగుకు స్వల్ప బ్రేక్.. కాస్త దిగివచ్చిన ధరలు..
Gold And Silver Prices Today | దేశీయ మార్కెట్లో భారీ ర్యాలీ తర్వాత గురువారం ఎంసీఎక్స్‌లో గోల్డ్, సిల్వర్ ధరలు స్వల్పంగా తగ్గాయి. గత సెషన్‌లో దిగుమతి సుంకాల పెంపు కారణంగా బంగారం దాదాపు 6 శాతం, వెండి 7.5 శాతం పైగా పెరిగిన నేపథ్యంలో ప్రస్తుతం మార్కెట్లో ప్రాఫిట్ బుకింగ్ కనిపిస్తోంది. ఎంసీఎక్స్ గోల్డ్ జూన్ ఫ్యూచర్స్ 0.18 శాతం తగ్గి 1,61,897 వద్ద ట్రేడ్ అవుతున్నాయి.
Gold And Silver Prices Today | దేశీయ మార్కెట్లో భారీ ర్యాలీ తర్వాత గురువారం ఎంసీఎక్స్‌లో గోల్డ్, సిల్వర్ ధరలు స్వల్పంగా తగ్గాయి. గత సెషన్‌లో దిగుమతి సుంకాల పెంపు కారణంగా బంగారం దాదాపు 6 శాతం, వెండి 7.5 శాతం పైగా పెరిగిన నేపథ్యంలో ప్రస్తుతం మార్కెట్లో ప్రాఫిట్ బుకింగ్ కనిపిస్తోంది. ఎంసీఎక్స్ గోల్డ్ జూన్ ఫ్యూచర్స్ 0.18 శాతం తగ్గి 1,61,897 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. అలాగే ఎంసీఎక్స్ సిల్వర్ జూలై ఫ్యూచర్స్ 1.07 శాతం పడిపోయి 2,97,027 వద్ద ఉన్నాయి. క్రితం ట్రేడింగ్ సెషన్‌లో కేంద్ర ప్రభుత్వం బంగారం, వెండిపై దిగుమతి సుంకాలను 15 శాతానికి పెంచడంతో మార్కెట్లో భారీ కొనుగోళ్లు జరిగాయి. దీంతో గోల్డ్ జూన్ ఫ్యూచర్స్ దాదాపు 6 శాతం ఎగబాకగా, సిల్వర్ జూలై ఫ్యూచర్స్ 7.5 శాతం పైగా జంప్ చేశాయి. ఇక అంతర్జాతీయ మార్కెట్ల దృష్టి ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్‌ల మధ్య జరుగుతున్న కీలక చర్చలపై నిలిచింది.
దాదాపు పదేళ్ల తర్వాత అమెరికా అధ్యక్షుడు చైనాను సందర్శించడం ఇదే తొలిసారి. నివేదికల ప్రకారం ట్రంప్ బీజింగ్‌లో జిన్‌పింగ్‌తో పలు సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ చర్చలు ప్రధానంగా దీర్ఘకాలిక ట్రేడ్ డీల్‌లు, ఆర్థిక ఒప్పందాలపై కేంద్రీకృతం కానున్నాయి. అలాగే మధ్యప్రాచ్య సంక్షోభంపై కూడా చర్చలు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదే సమయంలో అమెరికాలో ద్రవ్యోల్బణం పెరుగుతుండటం మార్కెట్లలో ఆందోళన కలిగిస్తోంది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను ఎక్కువకాలం స్థిరంగా ఉంచవచ్చనే అంచనాలు పెరుగుతున్నాయి. ద్రవ్యోల్బణం మరింత పెరిగితే రేట్ల పెంపును కూడా పరిశీలించే అవకాశముందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఏప్రిల్‌కు సంబంధించిన అమెరికా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ (సీపీఐ) మూడు సంవత్సరాల గరిష్ఠమైన 3.8 శాతానికి చేరిన తర్వాత, గత నెలలో ప్రొడ్యూసర్ ప్రైస్‌లు కూడా నాలుగేళ్లలోనే అతిపెద్ద పెరుగుదలను నమోదు చేశాయి.
ఇక అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధర ఔన్స్‌కు 0.21 శాతం మేర పెరిగి 4,698 డాలర్ల వద్ద ఉండగా, వెండి ధర 0.17 శాతం తగ్గి 87 డాలర్ల వద్ద ఉంది. అయితే దేశీయ స్పాట్ మార్కెట్‌లో మాత్రం బంగారం ధర స్వల్పంగా పెరిగింది. వెండి ధర భారీగా తగ్గింది.
స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు..
24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.16,233 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,29,864 గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,62,330 గా ఉంది. 100 గ్రాముల బంగారం ధర రూ.16,23,300 గా ఉంది. ఇది కిందటి రోజు ముగింపుతో పోలిస్తే రూ.3,300 పెరిగింది.
22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.14,880 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,19,040గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,48,800 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.14,88,000గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.3వేలు పెరిగింది.
18 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.12,175 ఉండగా, 8 గ్రాముల ధర రూ.97,400గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,21,750 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.12,17,500గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.2,500 పెరిగింది.
దేశీయ మార్కెట్‌లో 1 కిలో వెండి ధర రూ.3,00,000 ఉండగా, తులం ధర రూ.3,000గా ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే వెండి కిలోకు రూ.10వేలు తగ్గింది. అలాగే హైదరాబాద్‌లో 1 కిలో వెండి ధర రూ.3,15,000 ఉండగా, తులం ధర రూ.3,150 గా ఉంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Stock Markets | ఆరంభంలో లాభాలు.. ముగింపులో నష్టాలు.. స్టాక్ మార్కెట్లలో తీవ్ర అస్థిరత..
మే 21, 2026

Gold And Silver Prices Today | స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. సేఫ్ హావెన్ ఆస్తులపై తగ్గుతున్న ఆసక్తి..
మే 21, 2026

Stock Markets | స్టాక్ మార్కెట్లలో జోష్.. లాభాల్లో ట్రేడవుతున్న సూచీలు..
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



