India Post | ఇండియా పోస్ట్‌లో 23,757 గ్రామీణ డాక్ సేవక్ పోస్టులు.. పదో తరగతి మార్కుల ఆధారంగా ఎంపిక
India Post | దేశ వ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలో గ్రామీణ డాక్ సేవక్ (GDS) పోస్టులు భర్తీ చేస్తన్నది. మొత్తం 23,757 పోస్టులకు నోటిఫికేషన్ (GDS Recruitment ) విడుదల చేసింది.
India Post | త్రినేత్ర.న్యూస్: మీరు పదో తరగతి ఉత్తీర్ణులయ్యారా? కంప్యూటర్ పరిజ్ఞానం ఉందా? అయితే, పోస్టల్ శాఖ (India Post) మీకు మంచి అవకాశం కల్పిస్తున్నది. దేశ వ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలో గ్రామీణ డాక్ సేవక్ (GDS) పోస్టులు భర్తీ చేస్తన్నది. మొత్తం 23,757 పోస్టులకు నోటిఫికేషన్ (GDS Recruitment ) విడుదల చేసింది. ఆగస్టు 31 నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయి. అర్హులైన, ఆసక్తి కలిగిన అభ్యర్థులు సెప్టెంబర్ 2 నుంచి వచ్చేనెల 21 వరకు indiapost.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. సెప్టెంబర్ 23, 24 తేదీల్లో దరఖాస్తుల్లో తప్పొప్పులను సరిచేసుకునే అవకాశం ఉంది. ఇందులో బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్ (BPM), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్ (ABPM), డాక్ సేవక్ పోస్టులు ఉన్నాయి. తెలంగాణ సర్కిల్‌లో 419, ఆంధ్రప్రదేశ్‌లో 918 పోస్టులు ఉన్నాయి. బీపీఎం పోస్టులకు రూ.12,000 నుంచి రూ.29,380 వరకు, మిగిలిన పోస్టులకు రూ.10,000 నుంచి రూ.24,470 వరకు ప్రతి నెల వేతనం వస్తుంది.
పోస్టుపేరు: బీపీఎం, ఏబీపీఎం, డాక్ సేవక్
పోస్టుల సంఖ్య: 23,757
జనరల్ 10,640, ఓబీసీ 4,433, ఎస్సీ 3,082, ఎస్టీ 2,773, ఈడబ్ల్యూఎస్ 2,160 చొప్పున ఉన్నాయి.
తెలంగాణలో 419, ఆంధ్రప్రదేశ్‌లో 918 చొప్పున ఉన్నాయి.
అర్హతలు: పదో తరగతి ఉత్తీర్ణులవ్వాలై కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. అభ్యర్థులకు మ్యాథ్స్, ఇంగ్లిష్ సబ్జెక్టులతో పాటు స్థానిక భాష తెలిసి ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానంతో పాటు సైకిల్ తొక్కడం తెలిసి ఉండాలి. 2026 సెప్టెంబర్ 21 నాటికి అభ్యర్థులు 18 నుంచి 40 ఏండ్ల వయస్కులై ఉండాలి.
ఎంపిక విధానం
బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (బీపీఎం), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (ఏబీపీఎం) పోస్టులను రాత పరీక్ష లేకుండానే భర్తీ చేస్తారు. నియామక ప్రక్రియలో పదో తరగతిలో సాధించిన మార్కులను పరిగణంలోకి తీసుకుని ప్రాధాన్యమిస్తారు. రోజువారీ విధులు నిర్వహించడానికి ల్యాప్‌టాప్/ కంప్యూటర్/ స్మార్ట్ ఫోన్ లాంటివి తపాలా శాఖ అందిస్తుంది. సంబంధిత కార్యాలయానికి అందుబాటులో నివాసం ఉండాలనే నిబంధన ఉంది.
ఎంపికైన అభ్యర్థులు 15 రోజుల్లోగా హాజరుకావాలి. అర్హత ధ్రువీకరణ సర్టిఫికెట్లను సమర్పించాలి. డివిజన్ లేదా యూనిట్ డివిజనల్ లేదా యూనిట్ హెడ్ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలి.
దరఖాస్తులు: ఆన్‌లైన్‌లో మాత్రమే
దరఖాస్తు ఫీజు: రూ.100 కాగా, మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు మినహాయింపు కల్పించారు.
దరఖాస్తులు ప్రారంభం: సెప్టెంబర్ 2
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: సెప్టెంబర్ 21
వెబ్‌సైట్: indiapost.gov.in
సంబంధిత వార్తలు

SSC CPO Recruitment | డిగ్రీ అర్హతతో ఢిల్లీ పోలీస్, సీఏపీఎఫ్లో 1871 ఎస్ఐ ఉద్యోగాలు
సెప్టెంబర్ 11, 2026

RRB Recruitment | రైల్వేలో 560 పారా మెడికల్ ఉద్యోగాలు.. ఆర్ఆర్బీ నోటిఫికేషన్
సెప్టెంబర్ 10, 2026

SSC CHSL | ఇంటర్ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. 2536 పోస్టులతో SSC CHSL నోటిఫికేషన్
సెప్టెంబర్ 9, 2026
తాజావార్తలు
- ●Palla Rajeshwar reddy | ఆ 29 ఎకరాల భూమి నాది అని నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా
- ●Harish Rao | 22ఏ నిషేధిత భూములపై పొంగులేటి అబద్దాల ప్రవాహాన్ని పారించారు
- ●TGPSC | టీజీపీఎస్సీ కీలక ప్రకటన.. 544 అసిస్టెంట్ ప్రొఫెసర్, లైబ్రరీయన్ పోస్టుల నోటిఫికేషన్ రద్దు
- ●TGSRTC | గణేశ్ ఉత్సవాలు.. ఖైరతాబాద్, బాలాపూర్‌కు ప్రత్యేక బస్సులు
- ●Telugu OTT | తెలుగులో ఓటీటీలో రిలీజైన రెండు మలయాళం సినిమాలు ఒకటి మర్డర్ మిస్టరీ - మరోటి యాక్షన్ థ్రిల్లర్
- ●Ashu Reddy | బోల్డ్ లుక్‌లో అషురెడ్డి - చీరలో అందాలు చూడతరమా!

Palla Rajeshwar reddy | ఆ 29 ఎకరాల భూమి నాది అని నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా

Harish Rao | 22ఏ నిషేధిత భూములపై పొంగులేటి అబద్దాల ప్రవాహాన్ని పారించారు

TGPSC | టీజీపీఎస్సీ కీలక ప్రకటన.. 544 అసిస్టెంట్ ప్రొఫెసర్, లైబ్రరీయన్ పోస్టుల నోటిఫికేషన్ రద్దు

TGSRTC | గణేశ్ ఉత్సవాలు.. ఖైరతాబాద్, బాలాపూర్‌కు ప్రత్యేక బస్సులు



