UGC NET | యూజీసీ నెట్ ఫలితాలు విడుదల.. వచ్చేనెల 9, 10 తేదీల్లో 3 సబ్జెక్టులకు రీఎగ్జామ్
UGC NET | ప్రశ్నపత్రాల్లో తప్పుల నేపథ్యంలో యూజీసీ నెట్ (UGC NET) పరీక్షలను మళ్లీ నిర్వహించాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నిర్ణయించింది. ఈమేరకు ఇంగ్లిష్, కామర్స్, సోషియాలజీ సబ్జెక్టులకు సెప్టెంబర్ 9, 10 తేదీల్లో పునఃపరీక్ష (Re-Exam) నిర్వహించనున్నట్లు వెల్లడించింది.
UGC NET | త్రినేత్ర.న్యూస్: ప్రశ్నపత్రాల్లో తప్పుల నేపథ్యంలో యూజీసీ నెట్ (UGC NET) పరీక్షలను మళ్లీ నిర్వహించాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నిర్ణయించింది. ఈమేరకు ఇంగ్లిష్, కామర్స్, సోషియాలజీ సబ్జెక్టులకు సెప్టెంబర్ 9, 10 తేదీల్లో పునఃపరీక్ష (Re-Exam) నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఈ ఏడాది జూన్ 22 నుంచి 25 వరకు, 29, 30 తేదీల్లో యూజీసీ నెట్ 87 సబ్జెక్టుల్లో కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహించింది. అయితే ఇంగ్లిష్, కామర్స్, సోషియాలజీ ప్రశ్నపత్రాలలో అన్వయదోశాలు, ట్రాన్స్‌లేషన్‌లో తప్పులు ఉన్నాయని, పాత పేపర్ల నుంచి అధిక ప్రశ్నలు రిపీట్ అయ్యాయని అభ్యర్థులు ఫిర్యాదు చేశారు. దీంతో ఎన్టీఏ ఓ కమిటీని ఏర్పాటు చేసి విచారణ జరిపించింది. విచారణ కమిటీ పరిశీలనలో ప్రశ్నపత్రంలో ప్రశ్నలు, పేర్లు, పుస్తకాల పేర్లు, ట్రాన్స్ లేషన్, గ్రామర్, టైపింగ్ తప్పులు ఉన్నట్లు గుర్తించింది. కొన్ని ప్రశ్నలను తొలగించడం ద్వారా సరిచేయడం సాధ్యం కాదని కమిటీ తన నివేదికలో పేర్కొంది. ఈ నేపథ్యంలో అభ్యర్థులకు న్యాయం చేసేందుకు ఈ మూడు సబ్జెక్టులకు మళ్లీ పరీక్షలు నిర్వహించాలని ఎన్టీఏ నిర్ణయించింది.
సెప్టెంబర్ 9న ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంగ్లీష్ (English) పేపర్, అదేరోజు మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు కామర్స్ (Commerce), సెప్టెంబర్ 10న ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సోషియాలజీ (Sociology) పరీక్ష నిర్వహించనుంది. రీ-ఎగ్జామ్ రాసే అభ్యర్థులు ఎలాంటి అదనపు పరీక్ష ఫీజు చెల్లించనవసరం లేదని స్పష్టం చేసింది. కాగా, శుక్రవారం అర్ధరాత్రి మిగిలిన పరీక్షల ఫలితాలను యూజీసీ ఇప్పటికే విడుదల చేసింది. 84 సబ్జెక్టుల ఫలితాలను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.
How to Check & Download UGC NET June 2026 Scorecard?#UGCNET #UGCNETJune2026 #NTA #Results pic.twitter.com/jTVqLktUD8
— National Testing Agency (@NTA_Exams) August 28, 2026
మొత్తం 7,73,806 మంది దరఖాస్తు చేయగా 6,07,151 మంది పరీక్ష రాశారు. వారిలో 4,241 మంది జేఆర్ఎఫ్‌కు, 45,904 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్, పీహెచ్‌డీ ప్రవేశాలకు, మరో 97,434 మంది కేవలం పీహెచ్‌డీకి అర్హత సాధించారు.

సంబంధిత వార్తలు

Rahul Gandhi | తప్పులు ఎన్టీఏ చేస్తే.. శిక్ష మాత్రం విద్యార్థులు అనుభవిస్తున్నారు.. మోదీ ప్రభుత్వంపై రాహుల్ గాంధీ ఫైర్
ఆగస్టు 17, 2026

UGC NET | తప్పుల తడకగా ప్రశ్నపత్రాలు.. మూడు సబ్జెక్టులకు మళ్లీ పరీక్ష
ఆగస్టు 17, 2026

NEET Paper Leak | నీట్ పేపర్ లీక్ చేసింది ఎన్టీఏ సబ్జెక్టు నిపుణులే.. గుట్టు విప్పిన సీబీఐ
ఆగస్టు 7, 2026
తాజావార్తలు
- ●CM Revanth Reddy | నాణ్యతలో రాజీ వద్దు.. పనులు వేగవంతం చేయాలి : సీఎం రేవంత్‌రెడ్డి
- ●Chiranjeevi | సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్న కాకా - ఫొటోతో రూమర్లకు చెక్ పెట్టిన మెగాస్టార్
- ●Pain Killers | 30 రోజుల్లో 13 పెయిన్కిల్లర్లు.. చివరకు కిడ్నీలు ఫెయిల్.. వైద్యుల హెచ్చరిక..
- ●Raja Singh | ఒవైసీ బ్రదర్స్ చరిత్ర తెలుసుకోండి
- ●Ananya Nagalla | సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాలో అనన్య - రష్మిక మందన్న ఊరితో లింక్?
- ●Ramchandar Rao | ఓవైసీ సోదరులకు దేశభక్తి సర్టిఫికెట్లు ఇవ్వడమంటే దేశాన్ని అవమానించడమే: రాంచందర్‌రావు

CM Revanth Reddy | నాణ్యతలో రాజీ వద్దు.. పనులు వేగవంతం చేయాలి : సీఎం రేవంత్‌రెడ్డి

Chiranjeevi | సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్న కాకా - ఫొటోతో రూమర్లకు చెక్ పెట్టిన మెగాస్టార్

Pain Killers | 30 రోజుల్లో 13 పెయిన్కిల్లర్లు.. చివరకు కిడ్నీలు ఫెయిల్.. వైద్యుల హెచ్చరిక..

Raja Singh | ఒవైసీ బ్రదర్స్ చరిత్ర తెలుసుకోండి



