CNG Price Hike | మళ్లీ పెరిగిన సీఎన్జీ ధరలు.. కిలోపై రూ.3.89 భారం..
CNG Price Hike | సీఎన్జీ ధరలు (CNG Price Hike) మళ్లీ పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీ సహా పరిసర ప్రాంతాల్లో (Delhi NCR) సీఎన్జీ (CNG) ధరలను పెంచుతూ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి.
CNG Price Hike | త్రినేత్ర.న్యూస్: సీఎన్జీ ధరలు (CNG Price Hike) మళ్లీ పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీ సహా పరిసర ప్రాంతాల్లో (Delhi NCR) సీఎన్జీ (CNG) ధరలను పెంచుతూ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ (IGL) కిలో సీఎన్జీపై రూ.3.89 పెంచుతున్నట్లు ప్రకటించింది. పెరిగిన ధరలు ఉదయం 6 గంటల నుంచే అమల్లోకి వచ్చాయి. దీంతో ఢిల్లీలో కిలో సీఎన్జీ ధర రూ. 86.98కి చేరింది. అంతర్జాతీయంగా ఎల్‌ఎన్జీ ధరలు తీవ్రంగా పెరిగినప్పటికీ, సీఎన్జీ సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా చూసేందుకు ఈ స్వల్ప సవరణ చేసినట్లు ఐజీఎల్ వెల్లడించింది.
కాగా, ఈ ఏడాది సీఎన్‌జీ ధరలు పెరగడం ఇది ఐదోసారి. మే నెలలో కేవలం పది రోజుల వ్యవధిలో నాలుగు దశల్లో మొత్తం కిలోకు రూ.6 చొప్పున ధరలు పెంచిన ఐజీఎల్.. తాజాగా మరోసారి ధరలను పెంచింది. దీంతో ఆటోలు, ట్యాక్సీలు, సరుకు రవాణా వాహనాల నిర్వహణ ఖర్చులు భారీగా పెరగనున్నాయి.
సంబంధిత వార్తలు

Commercial LPG prices hiked | వాణిజ్య సిలిండర్‌పై మళ్లీ బాదుడు.. సీఎన్జీ, జెట్ ఇంధన ధరలూ పెంపు
సెప్టెంబర్ 1, 2026

Heavy Rain | భారీ వర్షానికి స్తంభించిన ఢిల్లీ.. 250 విమానాలు ఆలస్యం
ఆగస్టు 24, 2026

Supreme Court | ఏం చర్యలు తీసుకున్నారు..? ఢిల్లీ, లక్నో అగ్నిప్రమాదాలపై అధికారులకు సుప్రీంకోర్టు అల్టిమేటం
జులై 9, 2026
తాజావార్తలు
- ●JNTU | జేఎన్టీయూలో ఘర్షణ.. కర్రలతో విచక్షణారహితంగా కొట్టుకున్న విద్యార్థులు
- ●ISRO | నింగిలోకి నిఘానేత్రం.. విజయవంతంగా జీఎస్ఎల్వీ-ఎఫ్17 ప్రయోగం
- ●Bomb Blast | కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత ఇంటి వద్ద పేలిన బాంబు.. హత్యాయత్నం జరిగిందా?
- ●వెయ్యి రోజుల సంబరాల వేళ.. కాంగ్రెస్‌కు ‘కొండంత’ నొప్పి!
- ●Horoscope | సెప్టెంబర్ 4 రాశిఫలాలు.. ఈ రాశి వారికి ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి!
- ●Konda Sushmita Patel | మా అమ్మను రేవంత్ రెడ్డి అవమానించారు

JNTU | జేఎన్టీయూలో ఘర్షణ.. కర్రలతో విచక్షణారహితంగా కొట్టుకున్న విద్యార్థులు

ISRO | నింగిలోకి నిఘానేత్రం.. విజయవంతంగా జీఎస్ఎల్వీ-ఎఫ్17 ప్రయోగం

Bomb Blast | కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత ఇంటి వద్ద పేలిన బాంబు.. హత్యాయత్నం జరిగిందా?

వెయ్యి రోజుల సంబరాల వేళ.. కాంగ్రెస్‌కు ‘కొండంత’ నొప్పి!



