త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Lula da Silva | బ్రెజిల్ అధ్య‌క్షుడిగా నాలుగోసారి.. మరోసారి అధికారంలోకి లూలా డా సిల్వా

Lula da Silva | బ్రెజిల్ అధ్య‌క్షుడిగా లూయిజ్ ఇనాసియో లూలా డా సిల్వా(Luiz Inácio Lula da Silva) ఘన విజయం సాధించారు. ఫ్లావియో బొల్సోనారోతో (Flavio Bolsonaro) జరిగిన హోరాహోరీ పోరులో 81 ఏండ్ల‌ లూలా గెలుపొందారు.

G

International | Published On Oct 26, 2026, 8.07 am IST

Lula da Silva | బ్రెజిల్ అధ్య‌క్షుడిగా నాలుగోసారి.. మరోసారి అధికారంలోకి లూలా డా సిల్వా
Advertisement

Lula da Silva | త్రినేత్ర న్యూస్‌: బ్రెజిల్ అధ్య‌క్షుడిగా లూయిజ్ ఇనాసియో లూలా డా సిల్వా(Luiz Inácio Lula da Silva) ఘన విజయం సాధించారు. ఫ్లావియో బొల్సోనారోతో (Flavio Bolsonaro) జరిగిన హోరాహోరీ పోరులో 81 ఏండ్ల‌ లూలా గెలుపొందారు. దీంతో ఆయ‌న బ్రెజిల్ అధ్య‌క్షుడిగా ఎన్నిక‌వ‌డం ఇది 4వ సారి ఎన్న‌క‌య్యారు. 2003 నుంచి 2010 వరకు రెండు పర్యాయాలు అధ్యక్షుడిగా పనిచేసిన ఆయన, 2023లో మరోసారి అధికారంలోకి వచ్చారు.

ఓట్ల లెక్కింపు పూర్తయ్యే సమయానికి లూలాకు 51.8 శాతం ఓట్లు రాగా, ఫ్లావియోకు 48.24 శాతం ఓట్లు వచ్చాయి. దీంతో లూలా మరోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు మార్గం సుగమమైంది. అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను తీవ్రంగా విమ‌ర్శించే లూలా.. తాజా విజయంతో తిరిగి అధ్యక్షుడిగా కొనసాగనున్నారు. దీంతో గెటులియో వర్గాస్ తర్వాత బ్రెజిల్ (Brazil) చరిత్రలో అత్యధిక కాలం అధ్యక్షుడిగా పనిచేసిన రెండో వ్యక్తిగా లూలా రికార్డు సృష్టించారు. ఈ విడత పూర్తయ్యేసరికి ఆయన మొత్తం 16 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నట్లవుతుంది. ఇప్పటికే ప్రపంచంలోనే అత్యంత వృద్ధ నాయకులలో ఒకరైన లూలా, 2030లో తన కొత్త పదవీ కాలం ముగిసే సమయానికి 85 ఏండ్ల‌కు చేరుకుంటారు. అమెరికా ఖండంలోనే అత్యంత వృద్ధ అధ్యక్షులుగా ఉన్న 80 ఏండ్ల‌ డొనాల్డ్ ట్రంప్ (Donald Trump), నికరాగ్వా అధ్యక్షుడు డానియల్ ఒర్టెగాల సరసన లూలా చేరారు.

1989లో బ్రెజిల్‌లో ప్రత్యక్ష అధ్యక్ష ఎన్నికలు ప్రారంభమైనప్పటి నుంచి, మొదటి విడత ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచి, ఆ తర్వాత రన్-ఆఫ్ (రెండో విడత) లో గెలిచిన మొదటి అభ్యర్థిగా లూలా నిలిచారు. 1970లలో కార్మిక సంఘం నాయకుడిగా ప్రస్థానం ప్రారంభించిన ఆయ‌న వర్కర్స్ పార్టీ (Workers' Party) స్థాపనలో కీలక పాత్ర పోషించారు.

ఈ ఎన్నికల్లో (Brazil Elections) ప్రజలను ప్రభావితం చేసిన అంశాల్లో నిత్యావసర వస్తువుల ధరలు, నేరాలు, అవినీతి ఆరోపణలు ప్రధానంగా నిలిచాయి. జీవన వ్యయం తగ్గించడం, భద్రతను మెరుగుపరచడం వంటి అంశాలపై ఇద్దరు అభ్యర్థులు దృష్టి పెట్టారు. లూలా గతంలో బ్రెజిల్ స్వతంత్ర విదేశాంగ విధానానికి, చైనా సహా గ్లోబల్ సౌత్ దేశాలతో సంబంధాలకు ప్రాధాన్యం ఇచ్చారు.

Advertisement
Advertisement