Russian Oil | రష్యా చమురు కొనేందుకు భారత్‌కు మినహాయింపు.. కానీ ఆ నౌకల నుంచే!
International | Published On Mar 6, 2026, 9.32 am IST
Russian Oil | త్రినేత్ర.న్యూస్: ఇరాన్‌పై అమెరికా (US), ఇజ్రాయెల్ భీకర దాడులకు పాల్పడుతుండటంతో మధ్య ప్రాచ్యంలో (Middle East) తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో చమురు రవాణాలో (Crude Oil) అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిని (Hormuz Strait) ఇరాన్ మూసివేసింది. ఇంధన రవాణాకు తీవ్ర అంతరాయం కలుగుతున్నది. ఈ నేపథ్యంలో ముడిచమురు దిగుమతులపైనే ఆధారపడిన భారత్‌లో (India) ఇంధన కొరత ఏర్పడనుంది. ఈ క్రమంలో కీలక పరిణామం చోటుచేసుకున్నది. రష్యా (Russian Oil) నుంచి 30 రోజుల పాటు చమురు కొనుగోలు చేసేందుకుభారత్‌కు అమెరికా తాత్కాలిక మినహాయింపు ఇచ్చింది. ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ ఎక్స్ వేదికగా తెలిపారు.
ఇంధన సరఫరా వ్యవస్థలో స్థిరత్వాన్ని కొనసాగించడానికి రష్యా చమురు కొనుగోలు చేసేందుకు భారత్‌కు తాత్కాలిక మినహాయింపు ఇస్తున్నట్లు వెల్లడించారు. దీంతో ప్రపంచ మార్కెట్‌లో చమురు సరఫరా అవుతుందన్నారు. అయితే ఇప్పటికే సముద్రంలో చిక్కుకున్న రష్యా చమురు నౌకల నుంచి మాత్రమే కొనుగోళ్లు చేయాలని స్పష్టంచేశారు. తద్వారా ఆ దేశానికి పెద్దగా ఆర్థిక ప్రయోజనం చేకూరదని పేర్కొన్నారు. అమెరికాకు భారత్ ముఖ్యమైన భాగస్వామి అని తెలిపారు. భవిష్యత్తులో అమెరికా ముడిచమురు కొనుగోళ్లను భారత్ పెంచుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.

గ్యాస్ సరఫరాపై యుద్ధ ప్రభావం..
మధ్య ప్రాచ్యంలో యుద్ధం (Middle East war) రోజురోజుకూ ముదురుతున్నది. ఇరాన్, ఇజ్రాయెల్-అమెరికా మధ్య దాడులు, ప్రతిదాడులతో పశ్చిమాసియా అతలాకుతలమవుతోంది. ఈ యుద్ధం కారణంగా ప్రపంచ ఇంధన రవాణాకు జీవనాడి అయిన హర్ముజ్ జలసంధి (Strait Of Hormuz) స్తంభించిపోయింది. ఈ జలసంధి గుండా సరఫరా నిలిచిపోయింది. ఈ ప్రభావం ప్రపంచ దేశాలపై పడింది. ఇక ఈ యుద్ధం భారత్‌లో వంట గ్యాస్ సరఫరాపై కూడా తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది.
భారత్ ఎల్పీజీ అవసరాల్లో సుమారు 80 నుంచి 85 శాతం దిగుమతులపైనే ఆధారపడుతోంది. ఇందులో మెజారిటీ భాగం గల్ఫ్ దేశాల (Gulf Countries) నుంచే వస్తుంది. అయితే, ప్రస్తుతం యుద్ధం కారణంగా హర్ముజ్ జలసంధిని (Strait Of Hormuz) ఇరాన్ మూసివేసింది. ఈ మార్గం గుండా వెళ్లే నౌకలను పేల్చేస్తామంటూ హెచ్చరించింది. దీంతో రవాణా ఆగిపోయింది. ఈ క్రమంలో ప్రస్తుతం భారత్ వద్ద ఎల్పీజీ నిల్వలు (LPG stocks) నిండుకున్నట్లు తెలిసింది. దేశంలో ఎల్పీజీ నిల్వలు 30 రోజులకు సరిపడా మాత్రమే ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మార్చి నెలలో రావాల్సిన గ్యాస్ కార్గోలు ఆలస్యమైనా, ఆగిపోయినా కొరత ఏర్పడే అవకాశం ఉంది. ఈ భయంతో ప్రజలు ముందుగానే బుకింగ్ చేసుకుంటున్నారు. ఫలితంగా ఉన్న నిల్వలు కూడా తగ్గిపోయే ప్రమాదం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
భారత్ వద్ద ఎల్పీజీ నిల్వలు తక్కువ..
కెప్లర్ (Kpler) సంస్థ లీడ్ రీసెర్చ్ అనలిస్ట్ సుమిత్ రిటోలియా మాట్లాడుతూ.. ముడి చమురుతో పోలిస్తే భారత్ వద్ద భారీ స్థాయిలో వ్యూహాత్మక ఎల్పీజీ నిల్వ సామర్థ్యం లేదన్నారు. దీనివల్ల సరఫరాలో అంతరాయం ఏర్పడితే.. ఎల్పీజీ వ్యవస్థ దెబ్బతినే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఎల్పీజీని సేకరించే విషయంలో భారత్‌కు పరిమితులు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. అమెరికా, రష్యా, అర్జెంటీనా వంటి దేశాల నుంచి తెప్పించుకోవడం ఖరీదుతో కూడుకున్నది. అంతేకాదు సరిపడా గ్యాస్ దొరకడం కూడా కష్టమే అని ఆయన వివరించారు.
Also Read..
సంబంధిత వార్తలు

WhatsApp | ఇక బిల్లులన్నీ వాట్సాప్‌లోనే చెల్లించవచ్చు.. కొత్త అప్డేట్ వచ్చేసింది..
సెప్టెంబర్ 3, 2026

India | భారత్ క్రెడిట్ రేటింగ్ పెంపు.. జపాన్ ఏజెన్సీ కీలక ప్రకటన..
సెప్టెంబర్ 2, 2026

PM Modi | ఉగ్రవాదం ఎవరికీ వ్యూహాత్మక సంపదగా మారకూడదు.. ప్రపంచానికి ప్రధాని మోదీ గట్టి సందేశం
సెప్టెంబర్ 1, 2026
తాజావార్తలు
- ●Rashmika Mandanna | దేశంలోనే నంబర్ వన్ హీరోయిన్గా రష్మిక మందన్న - దీపికా పడుకోణ్‌ను దాటేసిన నేషనల్ క్రష్
- ●AI Express flight | విమానం గాల్లో ఉండగా లగేజీ స్టోర్ నుంచి పొగలు
- ●MLA Raja Singh | కాంగ్రెస్ నేతల వాటాల గొడవ తేలకే కొండా సురేఖ రాజీనామా!
- ●Konda Surekha | కొండా సురేఖ బర్తరఫ్
- ●Revanth Reddy 1000 Days | 1000 డేస్ ఆఫ్ రేవంత్ సర్కార్: సంక్షేమమే శ్రీరామరక్ష.. గాంధీ భవన్లో కాంగ్రెస్ గ్రాండ్ సెలబ్రేషన్స్!
- ●KA Paul | అమ్మా కొండా సురేఖ! వేరే పార్టీలోకి వెళ్లొద్దు.. మీకు ప్రజాశాంతి పార్టీ ఉంది

Rashmika Mandanna | దేశంలోనే నంబర్ వన్ హీరోయిన్గా రష్మిక మందన్న - దీపికా పడుకోణ్‌ను దాటేసిన నేషనల్ క్రష్

AI Express flight | విమానం గాల్లో ఉండగా లగేజీ స్టోర్ నుంచి పొగలు

MLA Raja Singh | కాంగ్రెస్ నేతల వాటాల గొడవ తేలకే కొండా సురేఖ రాజీనామా!

Konda Surekha | కొండా సురేఖ బర్తరఫ్



