త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

HP | వాలొరెంట్ అభిమానులకు సర్‌ప్రైజ్.. హైపర్‌ఎక్స్ ఒమెన్ 16 లిమిటెడ్ ఎడిషన్ ల్యాప్‌టాప్ విడుదల..

HP | ప్ర‌ముఖ కంప్యూట‌ర్స్ ఉత్ప‌త్తుల త‌యారీ సంస్థ హెచ్‌పీ భారత్‌లో త‌న కొత్త హైపర్‌ఎక్స్ ఒమెన్ 16 వాలొరెంట్ లిమిటెడ్ ఎడిషన్ గేమింగ్ ల్యాప్‌టాప్‌ను విడుదల చేసింది. ప్రముఖ గేమ్ డెవలపర్ రయట్ గేమ్స్ తో కలిసి రూపొందించిన ఈ ప్రత్యేక ఎడిషన్ ల్యాప్‌టాప్‌లో హై-పెర్‌ఫార్మెన్స్ హార్డ్‌వేర్‌తోపాటు వాలొరెంట్ గేమ్ స్ఫూర్తితో రూపొందించిన ప్రత్యేక డిజైన్ ఎలిమెంట్స్‌ను అందించారు.

S

Technology | Published On Jul 7, 2026, 12.08 pm IST

HP | వాలొరెంట్ అభిమానులకు సర్‌ప్రైజ్.. హైపర్‌ఎక్స్ ఒమెన్ 16 లిమిటెడ్ ఎడిషన్ ల్యాప్‌టాప్ విడుదల..
Advertisement

HP | ప్ర‌ముఖ కంప్యూట‌ర్స్ ఉత్ప‌త్తుల త‌యారీ సంస్థ హెచ్‌పీ భారత్‌లో త‌న కొత్త హైపర్‌ఎక్స్ ఒమెన్ 16 వాలొరెంట్ లిమిటెడ్ ఎడిషన్ గేమింగ్ ల్యాప్‌టాప్‌ను విడుదల చేసింది. ప్రముఖ గేమ్ డెవలపర్ రయట్ గేమ్స్ తో కలిసి రూపొందించిన ఈ ప్రత్యేక ఎడిషన్ ల్యాప్‌టాప్‌లో హై-పెర్‌ఫార్మెన్స్ హార్డ్‌వేర్‌తోపాటు వాలొరెంట్ గేమ్ స్ఫూర్తితో రూపొందించిన ప్రత్యేక డిజైన్ ఎలిమెంట్స్‌ను అందించారు. ఈ ల్యాప్‌టాప్‌లో వాలొరెంట్‌కు సంబంధించిన కస్టమ్ విజువల్ డిజైన్లు, హిడెన్‌ ఈస్టర్ ఎగ్స్‌ను కూడా చేర్చారు. వాలొరెంట్ ప్లేయర్ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఉత్పత్తులపై హెచ్‌పీ, రయట్ గేమ్స్ భాగస్వామ్యంలో ఇది తాజా రిలీజ్‌గా నిలిచింది. పెర్‌ఫార్మెన్స్ విష‌యానికి వ‌స్తే ఈ ల్యాప్‌టాప్‌ను గరిష్టంగా ఏఎండీ రైజెన్ 9-9955హెచ్‌ఎక్స్ ప్రాసెసర్‌తో కాన్ఫిగర్ చేసుకోవచ్చు. ఇందులో 16 కోర్లు ఉండగా, ఎన్‌విడియా జిఫోర్స్ ఆర్‌టీఎక్స్ 5070 గ్రాఫిక్స్ ప్రాసెసర్, 8జీబీ వీడియో మెమరీతో లభిస్తుంది. అలాగే ఒమెన్ ఏఐ ఆప్టిమైజేషన్ ఫీచర్ ద్వారా సిస్టమ్, హార్డ్‌వేర్, గేమ్ సెట్టింగ్‌లను ఆటోమేటిక్‌గా గేమ్‌కు అనుగుణంగా సర్దుబాటు చేస్తుంది. ముఖ్యంగా వాలొరెంట్ కోసం ప్రత్యేక ఆప్టిమైజేషన్ అందుబాటులో ఉంది.

ప‌వ‌ర్‌ఫుల్ ప్రాసెస‌ర్‌, గ్రాఫిక్స్ కార్డ్‌..

పోటీతత్వ గేమింగ్‌ను దృష్టిలో ఉంచుకుని ఇందులో హైపర్‌యాక్షన్ కీబోర్డ్ ను 8వేల హెడ్జ్‌ పోలింగ్ రేట్‌తో అందించారు. డిస్‌ప్లే విషయంలో గరిష్టంగా 2.5కె(2560 × 1600) రిజల్యూషన్, 240 హెడ్జ్ రిఫ్రెష్ రేట్, 3 మిల్లీసెకన్ల రెస్పాన్స్ టైమ్‌తో కూడిన ప్యానెల్‌ను ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. ఈ ల్యాప్‌టాప్‌లో 16 ఇంచుల ఐపీఎస్ డిస్‌ప్లే, 16:10 యాస్పెక్ట్ రేషియో, గరిష్టంగా 500 నిట్స్ బ్రైట్‌నెస్, 100 శాతం ఎస్‌ఆర్‌జీబీ కలర్ గామట్, వేరియబుల్ రిఫ్రెష్ రేట్, యాంటీ గ్లేర్, లో బ్లూ లైట్ సపోర్ట్ ఉన్నాయి. ఏఎండీ రైజెన్ 7-8745హెచ్‌ఎక్స్, ఏఎండీ రైజెన్ 9-9955హెచ్‌ఎక్స్ ప్రాసెస‌ర్‌ల‌ను ఎంపిక చేసుకోవ‌చ్చు. అలాగే గ్రాఫిక్స్ కోసం ఎన్‌విడియా జిఫోర్స్ ఆర్‌టీఎక్స్ 5060 లేదా ఆర్‌టీఎక్స్ 5070 ల్యాప్‌టాప్ జీపీయూ కార్డులు లభిస్తాయి. రెండూ 8జీబీ జీడీడీఆర్7 మెమరీతో వస్తాయి.

24జీబీ ర్యామ్‌, 1టీబీ ఎస్ఎస్‌డీ..

మెమరీ పరంగా 16జీబీ డీడీఆర్5-5200 ర్యామ్ లేదా 24జీబీ డీడీఆర్5-5600 ర్యామ్ ఆప్ష‌న్లు ఉన్నాయి. స్టోరేజ్ కోసం 1టీబీ పీసీఐఈ జెన్4 ఎన్వీఎంఈ ఎం.2 ఎస్‌ఎస్‌డీని అందించారు. ఫుల్-సైజ్ 4-జోన్ ఆర్‌జీబీ బ్యాక్‌లిట్ కీబోర్డ్, న్యూమరిక్ కీప్యాడ్, 26-కీ రోల్‌ఓవర్ యాంటీ-ఘోస్టింగ్ సపోర్ట్ ఉన్నాయి. ఆడియో కోసం డీటీఎస్:ఎక్స్ అల్ట్రా, డ్యూయల్ స్పీకర్లు, హెచ్‌పీ ఆడియో బూస్ట్, హైపర్‌ఎక్స్ ఆడియో టెక్నాలజీని పొందుపరిచారు. వీడియో కాల్స్ కోసం హెచ్‌డీఆర్ ఆటో స్విచ్, టెంపరల్ నాయిస్ రిడక్షన్, డ్యూయల్ అరే మైక్రోఫోన్‌లతో కూడిన 1080పీ ఫుల్ హెచ్‌డీ వెబ్‌క్యామ్ అందించారు. కనెక్టివిటీలో వై-ఫై 6, బ్లూటూత్ 5.4, 2.5జీబీఈ ల్యాన్ ఉన్నాయి. పోర్ట్‌లలో యూఎస్‌బీ-సీ 10జీబీపీఎస్ (పవర్ డెలివరీ 3.0, డిస్‌ప్లేపోర్ట్ 1.4, హెచ్‌పీ స్లీప్ అండ్ చార్జ్), ఒక యూఎస్‌బీ-ఏ 10జీబీపీఎస్, రెండు యూఎస్‌బీ-ఏ 5జీబీపీఎస్, హెచ్‌డీఎంఐ 2.1, ఆర్‌జే-45, 3.5ఎంఎం ఆడియో జాక్, ఏసీ స్మార్ట్ పిన్ ఉన్నాయి.

ధ‌ర వివ‌రాలు..

ఈ ల్యాప్‌టాప్‌లో 83వాట్-అవర్ సామర్థ్యంతో ప‌నిచేసే 6-సెల్ లిథియమ్-అయాన్ పాలిమర్ బ్యాటరీ ఉంది. 280వాట్ ఛార్జర్ ద్వారా కేవలం 30 నిమిషాల్లో 50 శాతం వరకు ఫాస్ట్ చార్జింగ్ ను సపోర్ట్ చేస్తుంది. సెక్యూరిటీ కోసం కెమెరా ప్రైవసీ షట్టర్, ఫర్మ్‌వేర్ టీపీఎం ఉన్నాయి. ఇది విండోస్ 11 హోమ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో వస్తుంది. హైపర్‌ఎక్స్ ఒమెన్ 16 వాలొరెంట్ లిమిటెడ్ ఎడిషన్ ల్యాప్‌టాప్ ప్రారంభ ధర భారత్‌లో రూ. 2,24,999గా ఉంది. ఇది హెచ్‌పీ ఆన్‌లైన్ స్టోర్, హెచ్‌పీ వరల్డ్ స్టోర్లు, ఎంపిక చేసిన రిటైల్ అవుట్‌లెట్లు, అమెజాన్ ఇండియా, ఫ్లిప్‌కార్ట్ ద్వారా అందుబాటులో ఉంది.

Advertisement
Advertisement