త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Microsoft Layoffs | మైక్రోసాఫ్ట్‌లో భారీ లేఆఫ్స్‌.. వ్యాపారం బాలేదంటూ ఉద్యోగుల‌కు లేఖ రాసిన ఎక్స్‌బాక్స్ సీఈవో

Microsoft Layoffs | ప్ర‌ముఖ టెక్ దిగ్గ‌జం మైక్రోసాఫ్ట్ ఉద్యోగుల‌కు షాక్ (Microsoft Layoffs) ఇచ్చింది. భారీ స్థాయిలో లేఆఫ్స్ ప్ర‌క‌టించింది. ప్ర‌పంచ వ్యాప్తంగా సుమారు 4,800 మందిపై వేటు వేసింది.

D

Business | Published On Jul 7, 2026, 12.56 pm IST

Microsoft Layoffs | మైక్రోసాఫ్ట్‌లో భారీ లేఆఫ్స్‌.. వ్యాపారం బాలేదంటూ ఉద్యోగుల‌కు లేఖ రాసిన ఎక్స్‌బాక్స్ సీఈవో
Advertisement

Microsoft Layoffs | ప్ర‌ముఖ టెక్ దిగ్గ‌జం మైక్రోసాఫ్ట్ ఉద్యోగుల‌కు షాక్ (Microsoft Layoffs) ఇచ్చింది. భారీ స్థాయిలో లేఆఫ్స్ ప్ర‌క‌టించింది. ప్ర‌పంచ వ్యాప్తంగా సుమారు 4,800 మందిపై వేటు వేసింది. ఇది సంస్థ మొత్తం ఉద్యోగుల్లో దాదాపు 2.1 శాతానికి స‌మానం. ఈ ఉద్యోగాల కోత వ‌ల్ల మైక్రోసాఫ్ట్ గేమింగ్ విభాగం ఎక్స్‌బాక్స్‌ (Xbox gaming division )పై తీవ్ర ప్ర‌భావం ప‌డింది. ఈ విభాగంలో రాబోయే ఏడాది కాలంలో తన మొత్తం వర్క్‌ఫోర్స్‌లో 20 శాతం అంటే దాదాపు 3,200 మందికి లేఆఫ్స్ ప్ర‌క‌టించింది. సోమ‌వారం ఒక్క‌రోజే ఈ విభాగంలో 1600 మందిని తొల‌గించారు. 2026-27 ఆర్థిక సంవ‌త్స‌రం చివ‌రి నాటికి మిగ‌తా లేఆఫ్స్ పూర్త‌వుతాయ‌ని వెల్ల‌డించింది. మైక్రోసాఫ్ట్ చీఫ్ పీపుల్స్ ఆఫీసర్ ఏమీ కోల్‌మన్ ఈ లేఆఫ్స్ గురించి ఉద్యోగులకు అంతర్గత నోటీసులో తెలియజేశారు. సంస్థ కార్యకలాపాల్లో జరుగుతున్న వ్యూహాత్మక మార్పుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని పేర్కొన్నారు.

వ్యాపారం బాగోలేదు..

ఈ లేఆఫ్స్ నేప‌థ్యంలో ఉద్యోగుల‌కు ఎక్స్‌బాక్స్ సీఈవో ఆశా శర్మ (Asha Sharma) భావోద్వేగంతో కూడిన లేఖ రాశారు. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో త‌మ వ్యాపారం ఏ మాత్రం ఆశాజ‌న‌కంగా లేద‌ని తెలిపారు. లాభాల మార్జిన్లు ఇత‌ర సంస్థ‌ల‌తో పోలిస్తే 3-10 రెట్లు త‌క్కువ‌గా ఉన్నట్లు చెప్పారు. అందుకే ఈ క‌ఠిన నిర్ణ‌యం తీసుకోవాల్సి వ‌చ్చింద‌న్నారు. ఇక ఈ లేఆఫ్స్ నిర్ణ‌యం ఉద్యోగుల టాలెంట్‌, వారి అంకిత‌భావాన్ని త‌క్కువ చేసి చూప‌డానికి కాద‌ని స్ప‌ష్టం చేశారు. అంతేకాదు ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో ఎక్స్‌బాక్స్ త‌న నాలుగు గేమింగ్ స్టూడియోల‌ను విక్ర‌యించ‌నుంద‌ని తెలిపారు. ప్రస్తుతం గేమింగ్ ఇండ‌స్ట్రీ అత్యంత తీవ్రమైన హార్డ్‌వేర్ సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని ఆమె తెలిపారు. అందువ‌ల్ల ఎక్స్‌బాక్స్‌ను రీసెట్ చేయాల్సి వ‌చ్చింద‌ని చెప్పుకొచ్చారు.

ఏఐ భ‌ర్తీ కోసం కాదు..

కంపెనీ తన భవిష్యత్తు ప్రాధాన్యతలకు అనుగుణంగా టీమ్‌లను పునర్వ్యవస్థీకరిస్తోందని మైక్రోసాఫ్ట్ చీఫ్ పీపుల్స్ ఆఫీసర్ ఏమీ కోల్‌మన్ తెలిపారు. వేగంగా మారుతున్న సాంకేతిక రంగంలో వినియోగదారుల అంచనాలను అందుకోవడానికి సంస్థ నిరంతరం మార్పులు చేపడుతోందని కోల్‌మన్ వివరించారు. తాజా ఉద్యోగాల కోతను కృత్రిమ మేధ (AI)తో భర్తీ చేయడం కోసం చేపట్టలేదని స్పష్టం చేశారు. అయితే, ఏఐ సాంకేతికత కారణంగా సంస్థ కార్యకలాపాలు, పని విధానాల్లో గణనీయమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయని కోల్‌మ‌న్‌ పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్‌లో సుమారు 2.2 లక్షల మందికిపైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. గత ఏడాది మే నెలలో కూడా సంస్థ దాదాపు 6,000 మంది ఉద్యోగులను తొలగించిన విష‌యం తెలిసిందే.

Also Read..

దేశంలోనే తొలి గ్రీన్ హైడ్రోజన్ రైలు.. జులై 17న జెండా ఊపి ప్రారంభించ‌నున్న ప్ర‌ధాని మోదీ

మ‌రోసారి భ‌గ్గుమ‌న్న హ‌ర్మూజ్‌.. నౌక‌ల‌పై ఇరాన్ క్షిప‌ణి దాడులు

ఇన్వెస్ట‌ర్ల‌కు గుడ్ న్యూస్‌.. రెంటోమోజో ఐపీఓకు సెబీ గ్రీన్ సిగ్నల్..

Advertisement
Advertisement